E-Paper
Advertisement

కేవలం రూ.1000 బడ్జెట్‌లో లివింగ్ రూం డెకరేషన్.. 5-స్టార్ హోటల్ లాంటి స్టైలిష్ లుక్‌

కేవలం రూ.1000 బడ్జెట్‌లో లివింగ్ రూం డెకరేషన్.. 5-స్టార్ హోటల్ లాంటి స్టైలిష్ లుక్‌
Advertisement

Living Room Decoration| ప్రతి ఇంట్లో లివింగ్ రూమ్ అంటే హాలు అందంగా అలంకరిలంచాలని అందిరికీ ఉంటుంది. ఇంటికి అతిథులు వస్తే లివింగ్ డెకరేషన్ చూసి ఎంతో మంచిగా ఫీలవుతారు. అంతేకాదు లివింగ్ రూం మీ ఇంటి ఫస్ట్ లుక్. అందుకే లివింగ్ రూం అందంగా ఉంటే అది వ్యక్తిత్వానికి ఉదాహరణగా నిలుస్తుంది. మీ స్టైల్‌ చూపిస్తుంది.

చాలా మంది కర్టెన్స్, సోఫాలు, కార్పెట్లతో అలంకరిస్తారు. కానీ కాలం గడిచేకొద్దీ అదే అలంకరణ విసుగు పుట్టిస్తుంది. కొత్త, స్టైలిష్ లుక్ కావాలని అనుకుంటారు. కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుందని చాలామంది ఆగిపోతారు. పెద్ద బడ్జెట్ అవసరం లేదు. రూ.1000లోనే మీ లివింగ్ రూమ్‌ను అందంగా మార్చేయవచ్చు. సింపుల్ డెకరేషన్ మార్పులతోనే 5-స్టార్ హోటల్ లాంటి ఫీల్ తీసుకురావచ్చు.

కుషన్ కవర్లు మార్చడం ద్వారా ఈజీ మేకోవర్

Advertisement

కుషన్ కవర్లు మార్చడం లివింగ్ రూమ్‌ని త్వరగా రిఫ్రెష్ చేస్తుంది. ఇది చాలా సులభమైన, చౌకైన మార్గం. రూ.300 నుంచి రూ.400లో స్టైలిష్ కవర్లు దొరుకుతాయి. ప్రింటెడ్ లేదా వెల్వెట్ కవర్లు ఎంచుకోండి. అవి రిచ్ లుక్ ఇస్తాయి. మీ బెడ్‌షీట్ లేదా కర్టెన్ రంగులతో మ్యాచ్ అయ్యే కవర్లు తీసుకోండి. ఇలా చేస్తే గది అందంగా, బ్యాలెన్స్‌గా కనిపిస్తుంది.

ఫెయిరీ లైట్స్‌తో లగ్జరీ ఫీల్

గదిలోని ఒక భాగంలో ఫెయిరీ లైట్స్ ఉంటే మంచి ఆకర్షణగా ఉంటుంది. వెచ్చని, సౌకర్యవంతమైన వాతావరణం సృష్టిస్తాయి. సాధారణంగా పండుగలు, పెళ్లిళ్లలో వీటిని ఉపయోగిస్తారు. ఇంట్లో రోజువారీ అలంకరణకు కూడా బాగంటాయి. రూ.200 నుంచి రూ.500 ధరలో ఫెయిరీ లైట్స్ అందుబాటులో ఉంటాయి. గోడల చుట్టూ, కర్టెన్స్ పైన లేదా టీవీ ఏరియాలో అమర్చండి.

క్రియేటివ్ వాల్ డెకర్ ఐడియాస్

Advertisement

హాలు గోడ అలంకరించేందుకు ఖరీదైన వస్తువులు అవసరం లేదు. సాధారణ ఐటెమ్స్‌తో అందమైన డిజైన్లు సృష్టించవచ్చు. పాత ఫోటో ఫ్రేములతో మీ మెమొరీస్‌ని క్రియేటివ్‌గా చూపించండి. మ్యాగజైన్ కటింగ్స్ లేదా ప్రింటెడ్ పోస్టర్లు ఉపయోగించండి. వాటిని గోడపై చక్కగా అమర్చండి. ఇవి లివింగ్ రూంకు ఆధునిక లుక్ ఇస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మీ అందమైన సెలక్షన్స్ గోడపై కనిపిస్తాయి.

మినీ ప్లాంట్లతో తాజాదనం

ఇండోర్ ప్లాంట్లు లివింగ్ రూమ్‌ను తాజాగా, జీవంతో నింపుతాయి. అవి సహజంగా గాలి క్వాలిటీని మెరుగుపరుస్తాయి. మనీ ప్లాంట్ వంటి చిన్న మొక్కలు తక్కువ ధరలో లభిస్తాయి. సక్యులెంట్స్ మొక్కలు కూడా సులభంగా పెంచవచ్చు, పెద్దగా ఖర్చు కూడా ఉండదు. పైగా ఇవి మంచి లుక్ ఇస్తాయి. సుమారు రూ200కి ఈ మొక్కలు కొనవచ్చు. కిటికీల దగ్గర లేదా ఖాళీ మూలల్లో ఉంచండి. అవి గదికి సహజమైన, క్లాసీ టచ్ ఇస్తాయి.

Also Read: పిల్లల కోసం కొత్త స్కూల్‌లో అడ్మిషన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు చెక్ చేయడం తప్పనిసరి

ఫర్నిచర్‌ మార్పులు

డబ్బు ఖర్చు చేయకుండానే గదిని మెరుగుపరిచేందుకు బెస్ట్ ఐడియా.. ముందు శుభ్రం చేసి, అనవసరమైన వస్తువులు తొలగించండి. ఫర్నిచర్‌ను కొత్తగా అమరిస్తే ఖాళీ స్థలం పెరుగుతుంది. ఫ్లోర్ చక్కగా అరేంజ్ చేయండి. గది విశాలంగా, క్లీన్‌గా ఉంటే ఇంట్లో లగ్జరీ ఫీల్ వస్తుంది.

లివింగ్ రూమ్ డెకరేషన్ కోసం పెద్ద బడ్జెట్ అవసరం లేదు. చిన్న మార్పులు కూడా లివింగ్ రూం‌ని అందంగా చేస్తాయి. సింపుల్ ఐడియాలతో రిఫ్రెష్ చేయండి. రూ.1000లోనే స్టైలిష్ లుక్ పొందండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×