E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ పై మహా ప్రయోగం.. తృటిలో తప్పించుకున్న చక్రీ.. కన్నా పుట్టుక బయటపడుతుందా..?

Podarillu Today Episode : చక్రీ పై మహా ప్రయోగం.. తృటిలో తప్పించుకున్న చక్రీ.. కన్నా పుట్టుక బయటపడుతుందా..?
Advertisement

Podarillu Today Episode April 30th : కేశవ కస్టమర్ బండి పాడైపోయింది అని చెప్పగానే.. అతనికి రిపేర్ చేయించడానికి ఒక టీ షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ టీ తాగడానికి వెళ్లిన రమణయ్యకు పెళ్లి బాగా జరిపించారు కదా అని అతను అనడంతో అవును ఆకాశమంత పన్నీరుతో చాలా బాగా జరిగింది అని గొప్పలు చెప్పుకుంటాడు. అంతేకాదు మాధవ్ని తప్పు పట్టేలా కేశవ నీ రెచ్చగొడుతూ రమణయ్య మాట్లాడుతాడు.. ఇక పక్కకు తీసుకొని వెళ్ళిన కేశవ రమణయ్యకు వార్నింగ్ ఇస్తాడు.. ఒక్క ఫోను నేను చేశాను అంటే ఆ వినోద్ గాడు వీసా కూడా రాకముందే మీ అమ్మాయిని ఇంటికి పంపిస్తాడు చేయమంటావా నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది లేదంటే మాత్రం నేను చేయాల్సింది చేస్తాను అని అంటాడు..

కేశవను ఆడుకున్న చక్రీ.. 

కేశవ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. దేని కోసం వెతుకుతున్నావ్.. స్పానర్ తెచ్చి పెట్టాడంట దానికోసం ఇల్లంతా వెతుకుతున్నాడు అని మాధవ్ అనగానే అవునా ఎక్కడ పెట్టావో గుర్తుకు లేదా అని కేశవాడుగుతాడు. ఏమోరా ఎక్కడ పెట్టాను అర్థం కావడం లేదు కొత్తది తెచ్చాను. అదే కనిపించలేదు అని అంటే చక్రి కేశవ్ అని ఆడుకుంటాడు. అక్కడ పెట్టావ్ ఏమో చూడు ఇక్కడ పెట్టావేమో చూడు ఎక్కడుందో ఒకసారి చూడు అని అంటూ కేశవ ని చక్రి ఆటపటిస్తాడు. ఇక చివరికి ఆ స్పానర్ని బంటి గాడు వచ్చి తీసుకెళ్లాడు అని చెప్పగానే.. ఎందుకురా నువ్వు అబద్ధం చెప్పావు అని కేశవ సీరియస్ అవుతాడు. ఇంతకీ మామిడి కాయ ఎక్కడ కనిపించడం లేదు అని అనగానే చక్రి కేశవ మాధవ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఆవిడ ఉన్నప్పుడు అనలేను లేనప్పుడు అనలేను లేనప్పుడు అయినా కనీసం అలా ఫీల్ అవ్వనివ్వండి అని చక్రి అంటాడు. కన్నాతో కలిసి ఏదో కొనాలని బయటకు వెళ్ళింది. ఏంటి చిన్న మరిదితో కలిసి బయటికి వెళ్లిందా అని చక్రి అంటాడు..

మహా వంటకు షాక్..

Advertisement

అప్పుడే ఇంట్లోకి వచ్చిన మహా, కన్న ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్లారు రా అని చక్రి అడుగుతాడు.. మేము బజార్ కి ఇండక్షన్ స్టవ్ కొనడానికి వెళ్ళాము అని తుంది మహాలక్ష్మి.. అదేదో నాకు చెప్తే నేను వెళ్లి కొనుక్కొని వచ్చేవాన్ని కదా మీరు ఎందుకు వెళ్లారు అని కేశవ అడుగుతాడు. నేను వెళ్తే ఏమైంది అని మహాలక్ష్మి అంటుంది.. ఈ ఇండక్షన్ స్టవ్ గురించి మీకు తెలియదా అని మహాలక్ష్మి అనగానే కేశవ ఏంటి దాని గురించి మీకు తెలియదా అని ఏదో గొప్పగా చెప్తాడు. అమెరికాలో ఆస్ట్రేలియా వంటి దేశాలలో వీటి మీదే వంట చేసుకుంటారు అని చక్రి అనగానే కౌంటర్లు వేస్తాడు. ఇక మొత్తానికి మహాలక్ష్మి మాధవ్ కలిసి మష్రూమ్స్ కర్రీ చేస్తారు..

ఎలక పై ప్రయోగం సక్సెస్..

మహాలక్ష్మి వంట చేసింది అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ ముందుగా చక్రీకి ఆ కర్రీ వేసి ఎలా ఉందో చెప్పిన తర్వాత అందరం తిందాము అని మహాలక్ష్మి అంటుంది. ఎందుకండీ నామీద మీ ప్రయోగం.. నేనేం పాపం చేశాను అని చక్రి అడుగుతాడు. సైంటిస్టులు కోసం ఎలక లాంటి వాడివని మీ నానే చెప్పారు. అందుకే ముందు మీరు తిని ఎలా ఉందో చెప్పండి అని మహాలక్ష్మి అడుగుతుంది. చక్రి నోట్లో పెట్టుకున్న తర్వాత కాసేపు మౌనంగా ఉంటాడు. అందరూ కంగారు పడిపోతూ ఉంటారు.. కానీ చక్రి బావుంది అని చెప్పగానే చాలా సంతోషంగా తింటారు. చక్రి ఆత్రంతో అంత నాకే కావాలి అని ప్లేట్లో వేసుకోగానే పైనుంచి ఒక రాయి వచ్చి కింద పడుతుంది.. అది చూసిన అందరూ ఒక్కసారిగా నవ్వుతారు కానీ ఆ పెచ్చు మీద పడలేదు అని సంతోష పడతారు.

ఇంటి డాక్యుమెంట్స్ కోసం వేట..

Advertisement

ఇంటికి మరమ్మతులు చేస్తే ఒక పని అయిపోతుంది కదా అని మహాలక్ష్మి అనగానే మొత్తం నిజాన్ని మహాలక్ష్మితో మాధవ్ చెప్తాడు. అయితే డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో పెట్టుకుందాం పదండి అని అందరూ కలిసి ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయట వేసి వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో పాత వస్తువులన్నిటిని చూసి నెమ్మరు వేసుకుంటారు. వస్తువులన్నీ చాలా ఇదిగా ఉన్నాయి అని అనగానే వాటిలో మాకు కొన్ని మెమోరీస్ ఉన్నాయి అమ్మ అని మాధవ్ అంటాడు. అయితే ఆ పెట్టెలో ఉన్న ఫోటోలను అందరూ చూసి చాలా సంతోషంగా ఉంటారు. కన్నాకు సంబంధించిన ఒక ఫోటో బయటకు రావడంతో అందులోని వ్యక్తి గురించి కన్నా పదే పదే అడుగుతాడు.

కన్నతల్లి గురించి కన్నాకు నిజం తెలుస్తుందా..? 

కన్నా ని ఎత్తుకొని ఒక ఆవిడ ఫోటో కనిపించడంతో అది చూసినా మహా నార్త్ ఇండియన్ అమ్మాయిలాగా ఉంది అని చెప్పగానే.. కన్నా ఏంటి ఈవిడ నన్ను ఎత్తుకుని ఏంటి అని నారాయణను కాలర్ పట్టుకుని అడుగుతాడు.. ఈవిడ నీ కన్నతల్లి రాని చెప్పగానే ఏంటి వీళ్ళ తల్లి వేరు నా తల్లి వేరా అని కన్నా బాధపడిపోతూ ఉంటాడు. కన్నా మీ సొంత తమ్ముడ్ని కాదా అని ఎమోషనల్ అయిపోతాడు.. నిన్ను వేరుగా ఏ రోజు చూడలేదు రా నా సొంత బిడ్డ లాగా చూసుకున్నాను రా అని మాధవ్ ఎమోషనల్ అవుతాడు.. మొత్తానికి అందరూ కలిసి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: భాగ్యం పై రామారాజుకు అనుమానం.. రచ్చ చేసిన కామాక్షి.. ఆస్తి సాగర్ గొడవ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×