E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్న్సను కొట్టిన సుమిత్ర  

Karthika Deepam 2 Serial Today Episode April 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్న్సను కొట్టిన సుమిత్ర  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: జ్యోత్స్నకు పెళ్లి సంబంధం తీసుకొస్తాడు కార్తీక్‌. ప్లాన్‌ ప్రకారం జ్యోత్స్న చీర కట్టుకుని కిందకు వచ్చేలా చేస్తాడు. దీంతో జ్యోత్స్న షాక్‌ అవుతుంది. కార్తీక్‌ చెప్పిన మాటలు పంతులు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఎంత ప్లాన్‌ చేశావు బావ. మీరంతా కలిసి నన్ను బుక్‌ చేశారా..? చీ మరీ ఇంత పూల్‌ అయిపోయానేం.. చావు దెబ్బ కొట్టావు బావ. ఇప్పుడు నేనేం చేయాలి అని మనసులో అనుకుంటుంది. మీ అందరికీ ముందే తెలుసా అని అందరినీ అడగ్గానే.. మాకు ముందే తెలుసు కానీ కార్తీక్‌ నీకు చెప్తా అన్నాడు అని అందరూ చెప్పగానే.. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. ఉన్నట్టుండి ఈ పెళ్లిచూపులు ఏంటి..? అని కార్తీక్‌ను అడగ్గానే.. మాకు నచ్చాడు అని కార్తీక్‌ చెప్తాడు.

అయితే మా వాళ్లకు నచ్చాలి కదా అని జ్యోత్స్న అడుగుతుంది. దీంతో కార్తీక్‌ అందరినీ అడుగుతాడు. అందరూ అబ్బాయి నచ్చాడు అని చెప్పగానే.. జ్యోత్స్న మాత్రం కోపంగా నాకు నచ్చలేదు అని చెప్తుంది. అందరూ ఎందుకు నచ్చలేదు అని అడుగుతారు. నచ్చలేదు అంతే అంటూ కోపంగా చెప్తుంటే.. శివనారాయణ కూడా కోపంగా ఎందుకు నచ్చలేదు అని అడుగుతుంటే.. కార్తీక్‌ సార్‌ మీరు కోప్పడకండి మన దగ్గర ప్లాన్‌ బీ ఉంది అని చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా ప్లాన్‌ బీ ఏంటి…? అని అడుగుతుంది. దీంతో కార్తీక్‌ మరో సంబంధం రెడీగా ఉంది అని చెప్తాడు. దీంతో జ్యోత్స్న కోపంగా నువ్వెన్ని సంబంధాలు తీసుకొచ్చినా నాకు నచ్చవు బావ అంటూ కోపంగా తిడుతుంది. అందరూ షాక్‌ అవుతారు. నువ్వలా అంటే ఎలా పెద్దమేడం గారు.. మా భుజాల మీద బరువు దించుకునేది ఎప్పుడు అని కార్తీక్‌ ప్రశ్నించగానే.. నువ్వసలు నాకు సంబంధాలే చూడకు బావ. రేయ్‌ నువ్వు బయటకు పోరా అంటూ వినోద్ ను తిడుతుంది.

Advertisement

దీంతో ఏంటి సార్ ఈ అమ్మాయి తిడుతుందేంటి..? ఇలాంటి డైలాగులు సీన్‌ పేపర్‌లో లేవు కదా అంటూ జేబులోంచి పేపర్‌ తీస్తాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటూ దశరథ అడుగుతాడు. జ్యోత్స్న మనసులో ఏముందో మీ అందరికీ తెలియడానికి ఇలా చేశాము అంటూ కార్తీక్‌ చెప్తాడు. అత్తా విన్నావు కదా బాల్‌ ఇప్పుడు నీ కోర్టులో లేదు. నేను కూతురుకు పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ చెప్పగానే.. జ్యోత్స్న మాత్రం మనసులో కోపంగా ఏం ఇరికించావు బావ.. నా చెప్పుతో నన్నే కొట్టుకునేలా చేశావు అనుకుంటుంది. కార్తీక్‌ ఇదే నిజమైన సంబంధం అయి ఉంటే జ్యోత్స్న మాట్లాడిన మాటలకు అందరి పరువు పోయేది.. నేను చెప్పాను కదా అత్త నీ అసలైన కూతురును చూపిస్తానని ఇదే అసలైన నీ కూతురు.. ఇదే అసలైన స్వభావం.. అని చెప్తాడు.  సుమిత్ర కోపంగా జ్యోత్స్నను తిడుతుంది. రెండేసి మాటల పద్దతి కరెక్టు కాదు.. అసలు నీ మనసులో ఏముంది..? అంటూ నిలదీస్తుంది. దీంతో జ్యోత్స్న అందరూ కలిసి నన్ను ముంచేశారు అని మనసులో అనుకుంటుంది. కార్తీక్‌ కూడా మనసులో నీకు వేరే దారి లేదు మరదలా ఇప్పుడు నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు అనుకుంటాడు.

మరోవైపు కావేరీ స్వప్నను తిడుతుంది. దీంతో కాశీని ఓకే అంటే నీకు సంతోషమేనా..? అయినా నాన్న పెద్దమ్మ విషయంలో జరిగింది. నా విషయంలో జరిగితే తప్పు పడుతున్నావేంటి..? అని ప్రశ్నిస్తుంది. జీవితంలో ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని కావేరీ సూచిస్తుంది. దీంతో నాన్న అల్లుడికి డ్రైవర్‌ పోస్ట్‌ ఇచ్చినంత ఈజీ కాదు నా జీవితంలో చోటు ఇవ్వడానికి అంటూ స్వప్న బాధపడుతుంటే.. అంతా విన్న శ్రీధర్ దగ్గరకు వచ్చి కాశీ గొప్పోడు అని నేను చెప్పను.. అలాగని చెడ్డొడని మాత్రం చెప్పను.. వాడు నాకన్నా గొప్పవాడు ఎందుకంటే.. ప్రేమగా చూసుకునే భార్య ఉన్నా నేను రెండో పెళ్లి చేసుకున్నాను.. కానీ వాడు మరో ఆడదాని వైపు అసలు చూడటం లేదు అంటూ చెప్పగానే.. స్వప్న ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

మరోవైపు పెళ్లి గురించి నిలదీస్తున్న సుమిత్రతో జ్యోత్స్న కోపంగా నా మనసులో బావ ఉన్నాడు. బావను తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోను అంటూ కరాకండిగా చెప్పేస్తుంది. బావంటేనే నాకు ఇష్టం.. నేను బావతోనే బతుకుతాను.. అంటుంది. దీంతో కార్తీక్‌ కోపంగా జ్యోత్స్ను తిడతాడు. జ్యోత్స్న మాత్రం తన బాధను చెప్పుకుంటుంది. ఎవ్వరికో నచ్చినట్టుగా నేను బతకను.. నాకు నచ్చినట్టుగా నేను బతుకుతాను నేను బావతోనే బతుకుతాను అంటుంది. దీంతో దీప నీ బావ ఇప్పుడు నా భర్త అంటూ చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా వెళ్లి దీప మెడలో తాళి తెంపి నా మెడలో కట్టించుకుంటాను అని చెప్పగానే.. అందరి ముందు జ్యోత్స్న చెంప పగులగొడుతుంది. దీంతో సుమిత్ర కోపంగా నా ముందే నా కూతురును కొట్టడానికి ఎంత ధైర్యమే నీకు అంటూ దీపను తిడుతూ.. కొట్టే చనువు నువ్వెందుకు తీసుకున్నావు.. ఆ పని చేయాల్సింది నేను కదా అంటూ జ్యోత్స్న చెంప పగులగొడుతుంది సుమిత్ర. దీంతో దశరథ శభాష్‌ సుమిత్ర ఒక తల్లిగా మంచిపని చేశావు అని మెచ్చుకుంటాడు. దీంతో సుమిత్ర, జ్యోత్స్న మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×