// // Podarillu Today Episode : మాధవ్ కాళ్ళు పట్టుకున్న పురుషోత్తం.. పెళ్లి -->
E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ కాళ్ళు పట్టుకున్న పురుషోత్తం.. పెళ్లి వద్దనుకున్న మాధవ్.. గుండెలు పగిలేలా ఏడ్చిన పెద్ది..

Podarillu Today Episode : మాధవ్ కాళ్ళు పట్టుకున్న పురుషోత్తం.. పెళ్లి వద్దనుకున్న మాధవ్.. గుండెలు పగిలేలా ఏడ్చిన పెద్ది..
Advertisement

Podarillu Today Episode April 28th : గాయత్రీ నేను చేసుకుంటే బావనే పెళ్లి చేసుకుంటాను అని తెగేసి చెప్పేస్తుంది.. మహాలక్ష్మి కూడా గాయత్రి పెళ్లి మాధవ్ తోనే జరుగుతుంది అని చెప్పడంతో అందరూ కూడా ఒక సరిగా షాక్ అవుతారు.. గాయత్రి నిర్ణయాన్ని మార్చుకోదని తెలుసుకున్న పురుషోత్తం మాధవ్ ని లోపలికి తీసుకొని వెళ్లి మాట్లాడాలి అని అనుకుంటాడు. అందరూ వద్దంటున్నా సరే మాధవ్ మాత్రం లోపలికి వెళ్లి మాట్లాడుతాను అని అంటాడు. లోపలికి వెళ్ళగానే మాధవ్ కాళ్లు పట్టుకుంటాడు పురుషోత్తం. తన బాధని చెప్తాడు.. నాకు ఉన్నది ఒకటే కూతురు ఆస్తిని సంపాదించిందంతా తన కోసమే అని పురుషోత్తమంటాడు. నా పరువు పోయేలా చేయదు అని ఎంతగా బ్రతిమలాడుతాడు. నేను మీ అత్త బంధువులకి మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటాము అని బెదిరిస్తాడు. ఆ మాట వినగానే మాధవ్ షాక్ అవుతాడు..

మాధవ్ మాటతో గాయత్రి షాక్..

గదిలోకి వెళ్లిన తర్వాత తాయారు పురుషోత్తం ఇద్దరూ కలిసి మా పరువు పోతే మేము బ్రతకము అని మాధవుని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు. కచ్చితంగా ఈ పెళ్లి జరిగితే మా పరువు పోతుంది మేము బ్రతికున్న ఒకటే చచ్చిన ఒకటే అని తాయారు అంటుంది.. వీళ్ళు లోపలికి వెళ్లి చాలాసేపు అయింది ఏం మాట్లాడుతున్నారు అని అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. కచ్చితంగా అన్నయ్య మనసు మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చక్రి కూడా అంటాడు. అయితే గదిలోంచి బయటికి వచ్చిన మాధవ్ ను చక్రి తాళికట్టమని అడుగుతాడు.. ఆలోచిస్తున్నావ్ ఏంటి అన్నయ్య తాళికట్టు అని ఎంత చెప్తున్నా సరే మాధవ్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు.

ఈ పెళ్లి నాకొద్దన్న మాధవ్..

Advertisement

గాయత్రి మెడలో తాళి కట్టేందుకు తాళిబొట్టును చేతికి తీసుకుంటాడు. కానీ వాళ్ళ అత్తయ్య మామయ్య అన్న మాటలు గుర్తు చేసుకొని కట్టకుండా వెనక్కి వస్తాడు.. నేను ఈ తాళి కట్టలేను అని అనగానే.. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. నాకు ఈ పెళ్లి వద్దు అని మాధవ్ అంటాడు.. మహాలక్ష్మి ఇంట్లోంచి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు అదృష్టం కొద్ది ఆయన బతికాడు. ఒకవేళ ఆయనకేదైనా జరిగి ఉంటే జీవితాంతం మహాలక్ష్మి బాధపడుతూ ఉండేది అని మాధవ్ అంటాడు. గాయత్రిని ఇకనుంచి వెళ్ళిపో అని అంటాడు..

మాధవ్ పై అంతా సీరియస్..

ఏంట్రా అందరు అలానే ఉన్నారు. పక్కన వేసుకొని పడుకోరా ఏంటి అని మాధవ్ అడుగుతాడు. నువ్వు పడుకుంటున్నావా అని చక్రి అంటాడు.. అవును పడుకోక ఏం చేయాలి అని మాధవ్ అంటాడు. నీకు నిద్ర పడుతుందా అని మాధవ్ ని అందరూ అడుగుతారు. వాళ్ళింట్లో శవం లేచిన తర్వాత నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఎలా ఉండాలని అనుకుంటున్నావు అని మాధవ్ అందరిపై సీరియస్ అవుతాడు. నువ్వు సంతోషంగా ఉండాలి అని అనుకున్నావు కదా అలానే ఉండు అని అందరూ మాధవుని తిడతారు కానీ మాధవ్ మాత్రం వాళ్ళందరికీ సమాధానం చెప్తాడు.. మహాలక్ష్మి నువ్వు చేసింది ఏమీ బాగోలేదు పెద్ది అని అంటుంది..

గాయత్రి కాళ్ళు పట్టుకున్న పురుషోత్తం..

Advertisement

గాయత్రి మీ ఇంటికి తీసుకెళ్లిన తాయారు చెంప పగలగొడుతుంది. రేపు పొద్దున్నే పెళ్లి పెట్టుకొని ఇంట్లో బంధువులంతా పెట్టుకొని నువ్వు ఎంత ధైర్యంగా అక్కడికి వెళ్ళావే అని గాయత్రిని అడుగుతుంది. నువ్వు వాన్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళావా? మా పరువు తీయాలనుకున్నావా ఇదంతా కాదు మేమే చచ్చిపోతాము అని గాయత్రీ ని బెదిరించేలా మాట్లాడుతుంది తాయారు. నీకోసం నేను ఎంతో కష్టాలను అనుభవించాను.. రూపాయి రూపాయి కూడా పెట్టి నీ పెళ్లి కోసం దాచాను అని పురుషోత్తం బాధపడతాడు. నీ కాళ్లు పట్టుకుంటానమ్మ నువ్వు మా పరువు పోయేలా ఏమి చేయద్దు అని పురుషోత్తం అంటాడు.

గుండెలు పగిలేలా ఏడ్చేసిన మాధవ్..

గాయత్రి పెళ్లికూతురుగా బయటికి వెళ్లడం చూసిన మాధవ్ బాధపడిపోతూ ఉంటాడు.. అయితే మళ్లీ పెళ్లయి తన భర్త పక్కన వెళ్ళిపోయినా గాయత్రీ ని చూసిన మాధవ్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. గాయత్రి తన భర్త పక్కన కూర్చొని వెళ్ళిపోతుంది అని లోపలికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు. మాధవ్ ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా చూసిన మహా తనని ఓదార్చాలని అనుకుంటుంది. మహాలక్ష్మి చేతులు పట్టుకొని మాధవ్ కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. గాయత్రి వెళ్లిపోయింది అని తన బాధని చెప్పుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తాడు మాధవ్. గాయత్రి బాగుండాలని దేవుని ప్రార్థిస్తాడు అది చూసిన మహాలక్ష్మి ఎమోషనల్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి నిజం చెప్పేసిన భాగ్యం.. ధీరజ్ పంచ్ అదిరిపోలే.. ఆనందారావుకు చెమటలు..ఇదేం ట్విస్ట్.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×