E-Paper
Advertisement

Podarillu Today Episode : హారిక పై ఆదికి అనుమానం.. మహా మాటతో చక్రీ షాక్.. మహాను బూతులు తిట్టిన తాగబోతు..

Podarillu Today Episode : హారిక పై ఆదికి అనుమానం.. మహా మాటతో చక్రీ షాక్.. మహాను బూతులు తిట్టిన తాగబోతు..
Advertisement

Podarillu Today Episode April 17th : శైలు అలాగే కేశవ చేసిన వీడియో మాత్రం బాగా ట్రెండ్ అవ్వడంతో తన ఫ్రెండ్ కీర్తి మీరిద్దరూ ఒక్కసారిగా సెలబ్రిటీలు అయిపోయారు. మిలియన్లలో వ్యూస్ వెళ్తున్నాయి అని అంటుంది.. ఆ తర్వాత ఎన్ని వీడియోలు చేసినా కూడా మీరిద్దరూ కలిసి చేస్తే బాగుంటుందని నా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు వాడితో నేను ఎలా చేస్తాను అని శైలు అంటుంది.. ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే శైలుకి ఒక ఫోన్ వస్తుంది. మీరు ఒక యాడ్ చేస్తే 20వేలు ఇస్తామని అంటారు.. ఆ మాట వినగానే శైలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది..

మహా కోసం హారిక ప్లాన్..

హారిక ఇంట్లో ఎవరు లేరు కదా.. మహా ఆధార్ కార్డు అడిగింది కదా.. ఒకసారి తన కార్డు ఎక్కడ ఉందో అ కార్డు ని మహాలక్ష్మికి పంపించాలి అని అనుకుంటుంది హారిక.. ప్రతాప్ రూమ్ లోకి వెళ్ళిన హారిక అక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటిని తిరగేసి వెతుకుతూ ఉంటుంది.. అప్పుడే ఇంటికొచ్చిన ఆది నాన్న వాళ్ళ రూంలో హారిక ఏం చేస్తుంది దేని గురించి వెతుకుతుందే అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు ఏం చేస్తుంది చూద్దామని ఆది దొంగతనంగా హారిక ఏం చేస్తుందో చూస్తాడు. లక్ష్మి ఫైల్ లో ఉన్న ఆధార్ కార్డు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే హారిక రాసిన నెంబర్ ని చూసి ఆది షాక్ అవుతాడు.. అయితే హారిక రాసుకున్న నెంబర్ ని తప్పుగా రాసి మహాలక్ష్మికి ఎలాగైనా ఆ నెంబర్ వెళ్లకుండా చేయాలి అని ప్లాన్ చేస్తాడు..

మహాను ఇంప్రెస్ చేసేందుకు చక్రీ ప్లాన్..

Advertisement

చక్రి మహాలక్ష్మి నేను మాత్రమే ఇంట్లో ఉన్నాం కదా.. అయినా సరే ఇవాళ తనని ఇంప్రెస్ చేయాలనీ అనుకుంటాడు. మహాలక్ష్మి ముందు పని చేస్తున్నట్టు నటించి తన దగ్గర మార్కులు కొట్టేయాలి తన మనసులో చోటు సంపాదించుకోవాలి అని చక్రి ప్లాన్ చేస్తాడు.. అయితే చక్రి చీపురు పట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసి మహాలక్ష్మి దగ్గర మార్కులు కొట్టేయాలని అనుకుంటాడు. ఎంతగా పనిచేస్తున్న సరే మహాలక్ష్మి ఇంకా రాకపోవడంతో చక్రి నడుమును విరిగిపోయేలా ఉన్నాయని అనుకుంటాడు అప్పుడే మహాలక్ష్మికి కెవ్వుమని కేకలు పెడుతుంది. ఇది చూసి చక్రి షాక్ అవుతాడు..

మహా గుడ్ న్యూస్..

మహాలక్ష్మి లోపల నుంచి కేకలు పెట్టుకుంటూ బయటికి వస్తుంది. ఏంటి మీరు ఈ పని చేస్తున్నారు అని చక్రిని అడుగుతుంది. అయితే ఇంట్లో ఈ పని చేస్తే ఏమన్న ప్రాబ్లమా అని చక్రి అంటాడు. కానీ మీరిలా ఊడుస్తూ ఉండడం నాకు కొత్తగా అనిపిస్తుంది అని మహాలక్ష్మి అంటుంది.. లేదు నాకు మా వదిన ఆధార్ కార్డు నెంబర్ పంపించింది వెళ్లి డౌన్లోడ్ చేసుకుంటాను అని అనగానే.. నేను కూడా అక్కడికి వస్తాను అని చక్రి ఎంతగా చెప్తున్నా సరే మహాలక్ష్మి మాత్రం వినదు. ఇక చక్రి మొత్తానికి మహాలక్ష్మిని తీసుకొని ఆధార్ సెంటర్ కి వెళ్తాడు. కానీ అక్కడ ఆధార్ కార్డు నెంబర్ చెప్పగానే ఓటిపి వస్తుందని అనగానే మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఆ నెంబర్ పోవడానికి చక్రిని కారణమని మహా తనని తిట్టుకుంటుంది..

తాగుబోతు దెబ్బకు మహా షాక్..

Advertisement

మహాలక్ష్మి ఆ నెంబర్ ఎక్కడుందో ఎవరో ఒకరికి దొరికింటుంది కదా అని ఫోన్ చేయాలని అనుకుంటుంది. అయితే మహాలక్ష్మి ఆ నెంబర్ కి ఫోన్ చేయడానికి చక్రి ఫోన్ తీసుకోమని చెప్తున్న సరే వినకుండా ఎవరో ఒకరికి దొరికింటుందని ధీమాగా ఫోన్ చేస్తుంది. అక్కడ తాగుబోతు ఫోన్ లిఫ్ట్ చేసి మొదట దేవత మహాలక్ష్మి అని అనుకుంటాడు.. కానీ ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మ అని చెప్పగానే బూతులు తిడతాడు అది విన్న మహాలక్ష్మి ఒకసారిగా షాక్ అయిపోతుంది. అయితే చక్రి కి ఫోన్ ఇవ్వగానే చక్రి కూడా మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.

హారికకు ఆది స్ట్రాంగ్ వార్నింగ్..

హారిక దగ్గరికి వచ్చిన ఆది.. ఏం చేస్తున్నావు అని అడుగుతాడు.. నువ్వు ఆ మహాలక్ష్మికి ఆధార్ కార్డు ఇవ్వాలని అనుకున్నావు కదా అది మా ఇంటి పరువు ని తీసేసి పోయిందన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి లేదు అని హారికను అడుగుతాడు ఆది.. అయితే నేను ఏమి ఇవ్వలేదు అని ఎంత చెప్తున్నా సరే నువ్వు ఇవ్వడం నేను చూశాను. అందుకే నీ నెంబర్ రాసి అక్కడ పెట్టాను అని ఆది అంటాడు. అయితే ఆ మాట వినగానే మహా కు తప్పుడు నెంబర్ ఇచ్చాను అని హారిక ఫోన్ చేస్తుంది. మా ఆయన చేసిన పనికి నేను సారీ చెప్తున్నాను మహా ఇంకొకసారి ట్రై చేస్తాను అని హారిక అనగానే మహాలక్ష్మి ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లు ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episode: నర్మదకు షాకిచ్చిన రామరాజు.. చందు పై అనుమానం.. భాగ్యంకు మైండ్ బ్లాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×