E-Paper
Advertisement

సీఎం రేవంత్‌‌రెడ్డితో ఏపీ రాజకీయ మహిళా నేతలు.. మొన్న రోజా, నిన్న ఏపీ టీడీపీ మహిళా నేతలు

సీఎం రేవంత్‌‌రెడ్డితో ఏపీ రాజకీయ మహిళా నేతలు.. మొన్న రోజా,  నిన్న ఏపీ టీడీపీ మహిళా నేతలు
Advertisement

Delhi: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టీడీపీకి చెందిన పలువురు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు మర్యాద పూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను పరిటాల సునీత ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సీఎం రేవంత్‌‌రెడ్డితో ఏపీ రాజకీయ మహిళా నేతలు

Advertisement

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఏపీకి చెందిన అధికార పార్టీకి చెందిన మహిళా నేతలు హస్తినకు వెళ్లారు. ముఖ్యంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, ఆపై సవరణ జరగనుంది. ఈ క్రమంలో ముందుగానే టీడీపీకి చెందిన మహిళా నేతలు, ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారు. అక్కడే మహిళా ఎంపీలు కూడా ఉన్నారు.

ప్రత్యేక సమావేశాల కోసం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అక్కడే ఉన్నారు. అదే సమయంలో పార్లమెంట్ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో గిరగిరా తిరిగేస్తున్నాయి.

Advertisement

 మొన్న రోజా.. నిన్న ఏపీ టీడీపీ మహిళా నేతలు

ఎన్డీఏ కూటమిలో టీడీపీ ప్రధాన భాగస్వామి. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషిస్తోంది. భిన్న రాజకీయ ధ్రువాలకు చెందిన నేతలు కలవడంపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా రేవంత్‌రెడ్డి కొనసాగిన నేపథ్యంలో పాత పరిచయాల కారణంగా ఈ భేటీ జరిగిందని అంటున్నారు.

కేవలం టీడీపీ మహిళా నేతలు మాత్రమేకాదు రీసెంట్ వైసీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి రోజా కూడా ఢిల్లీలో సీఎం రేవంత్‌ని కలిశారు. ఈ నేపథ్యంలో తెర వెనుక ఏదో జరుగుతోందని అనే చర్చ లేకపోలేదు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ భేటీలపై ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

ALSO READ: న‌వ్వుతూ.. వెక్కిరిస్తూ… ! ప్రియాంక ప్ర‌సంగానికి పార్ల‌మెంటు ఫిదా…

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×