E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ ను మోసం చేసిన గాయత్రి.. తాయారు ప్లాన్ సక్సెస్.. మాధవ్ పరిస్థితి దారుణం..

Podarillu Today Episode : మాధవ్ ను మోసం చేసిన గాయత్రి.. తాయారు ప్లాన్ సక్సెస్.. మాధవ్ పరిస్థితి దారుణం..
Advertisement

Podarillu Today Episode April 12th : నువ్విలా భయపడుతూ ఉంటావు కాబట్టే నేను ఏది వద్దని అన్నాను.. నువ్వు చెప్పావని మా వదిన చెప్పడంతోనే మేము మీ ఇంటికి వరకు వచ్చాము.. ఇప్పటికైనా నువ్వు ఓకే అను.. నేను తీసుకెళ్లి మా అన్నయ్యతో పెళ్లి చేస్తామని ఎంత చెప్తున్నా సరే గాయత్రి మాత్రం మౌనంగానే ఉంటుంది.. ఇంకొకసారి మా అన్నయ్య కోసం కానీ మా కోసం ఇంటికి కానీ వచ్చావంటే నేనే చంపేస్తాను అని కేశవ వార్నింగ్ ఇస్తాడు.. ఇక మహాలక్ష్మి కూడా నువ్వు ఇంకొకసారి ఆ ఇంటికి వచ్చినా పెద్ది వైపు చూసిన తన జీవితంలోకి రావాలని అనుకున్న సరే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది..

గాయత్రి కోసం మాధవ్ ఎదురుచూపులు..

వాళ్లందరూ వెళ్లగానే లోపలికి వెళ్లి తలిపేసుకున్న గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నాకోసం వాళ్ళు వచ్చారు నేను వెళ్తాను అని గాయత్రి చెప్పగానే తాయారు నేను చచ్చిన తర్వాతే వెళ్ళు అని అనగానే భయపడిపోతుంది.. నేను చస్తాను అని బెదిరించడంతోనే తను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఆగిపోతుంది.. అటు మాధవ్ గాయత్రి ఇంకా రాలేదు ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటాడు..

తాయారు ఇంత ప్లాన్ చేసిందా..?

Advertisement

మాతో పెళ్లి చేసుకోవాలి అని ఎంతో ఆశతో వెళ్తున్నా గాయత్రిని ఆపడానికి తాయారు మాస్టర్ ప్లాన్ చేస్తుంది. నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నావంటే నా శాపం నా కూతురు వల్లే తీరిపోయింది అని అందరూ అనుకుంటారు. ఆ మహాలక్ష్మి లేచిపోయి వచ్చింది కాబట్టి నిన్ను కూడా లేచిపోవాలని చెప్తుందా ఏంటి అని అంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్లి నా పరువు తీయడం కంటే నేను చచ్చిపోతాను అని తాయారు గాయత్రీ ని బెదిరిస్తుంది.. నాకీ పెళ్లి ఇష్టం లేదని వాళ్లతో చెప్తావా లేదా అని గాయత్రీ కి చెప్పగానే చెప్తాను అమ్మా అని అంటుంది.. గాయత్రి లోపలికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంది..

బాధపడ్డ మాధవ్..

గాయత్రి ఎక్కడ ఇంకా రాలేదా గుడి మూసే టైం కూడా అయింది అని మాధవ్ కంగారు పడిపోతూ ఉంటాడు. తను వస్తాను అంటేనే నేను ఇన్ని ఏర్పాట్లు చేశాను మిమ్మల్ని కూడా ఒప్పించాను.. ఇప్పుడు తను రాను అని చెప్తుంది అని అనగానే మాధవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. నువ్వు చెప్తుంది ఏంటమ్మా మహాలక్ష్మి నాకు అర్థం కావడం లేదు అని అనగానే.. గాయత్రి పెళ్లికూతురు గారు రెడీ అయింది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ లాస్ట్ మినిట్ లో నేను రాను అనింది. నాకు తెలుసమ్మా మేమిద్దరం ఎప్పటికీ కలవము అని మాధవ్ చాలా బాధపడిపోతాడు.

కొడుకును ఓదార్చిన తండ్రి..

Advertisement

ఒంటరిగా ఉన్న మాధవ్ని నారాయణ ఎలాగైనా సరే ఓదార్చాలి అని అనుకుంటాడు.. అయితే మాధవ్ ఎంత చెప్తున్నా వినకుండా నీ బాధ మర్చిపోయే ముందు ఒకటి నా దగ్గర ఉంది అని అంటాడు. ఈ మందు తాగితే నువ్వు ఎలాంటి బాధనైనా మత్తుతో మర్చిపోతావు అని నారాయణ అంటాడు.. ఏంటి నాన్న మీరు మాట్లాడేది.. నేను మందు తాగడం ఏంటి అని మాధవ్ ఎంత చెప్తున్నా సరే.. నారాయణ మాత్రం ఒక్కసారి తాగు నీకే అర్థమవుతుంది అని అంటాడు.. ఇక మందు తాగిన మాధవిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.

Also Read :‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ప్రేమ ప్లేస్ లోకి వచ్చేది ఈమెనేనా..?

అన్నయ్య కోసం కన్నీళ్లు పెట్టుకున్న తమ్ముళ్లు.. 

ఎప్పుడు లేని విధంగా మాధవ్ తాగి రావడం చూసిన తమ్ముళ్లు చాలా బాధపడిపోతారు. ఏంటి అన్నయ్య ఎప్పుడు లెండి ఇలా మందు తాగావు అని అడగగానే మాధవ్ చాలా బాధపడి పోతాడు.. నాకు లేని కొత్త అలవాటు వచ్చిందని బాధపడాలో.. ఉన్న బాధని మర్చిపోలేక ఇంకా బాధపడాలో అర్థం కావడం లేదు.. కానీ గాయత్రీ ని మాత్రం అస్సలు మర్చిపోలేక పోతున్నాను అని మాధవ అంటాడు. లేదు అన్నయ్య నువ్వు ఇంత బాధ పడుతున్నావు అంటే మాకు కన్నీళ్లు వస్తున్నాయి అని అందరూ కూడా ఎమోషనల్ అయిపోతారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×