// // Podarillu Maha : పెళ్లి పీటలు ఎక్కబోతున్న 'పొదరిల్లు' మహా.. -->
E-Paper
Advertisement

Podarillu Maha : పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘పొదరిల్లు’ మహా.. ఇదేం ట్విస్ట్ సామి..

Podarillu Maha : పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘పొదరిల్లు’ మహా.. ఇదేం ట్విస్ట్ సామి..
Advertisement

Podarillu Maha : ప్రస్తుతం తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ విషయానికి వస్తే.. కొత్త సీరియల్స్ రేటింగ్ విషయంలో వెనకడుగు వేయట్లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే దూసుకుపోతున్నాయి. ప్రతి సీరియల్ కూడా పోటీపడి నువ్వా నేనా అంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈమధ్య స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ మాత్రం రోజురోజుకీ పాపులారిటీని పెంచుకుంటూ వస్తుంది. గత వారం నుంచి ఈ సీరియల్ రేటింగ్ మాత్రం రాకెట్ కన్నా స్పీడ్ గా పెరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సీరియల్ కి అంత క్రేజ్ రావడానికి హీరోయిన్ మహాలక్ష్మిని కారణం అని నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అలాంటి మహాలక్ష్మి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ మహాలక్ష్మి పెళ్లికూతురు గెటప్ లో దిగిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. ఇంతకీ ఆ ఫోటోల వెనకున్న కథ ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

పెళ్లికూతురు గెటప్ లో మహా.. 

పొదరిల్లు సీరియల్ లో హీరోయిన్ మహాలక్ష్మి పాత్రలో కన్నడ ముద్దుగుమ్మ కృతిగా ఉమా శంకర్ నటించింది.. ఇందులో ఆమె పాత్ర హైలెట్ అనే చెప్పాలి. నలుగురు మగాళ్ళు ఉన్న ఒక ఇంటికి ఆ అమ్మాయి కోడలుగా వెళ్తే ఆ తర్వాత ఆమె ఆ ఇంట్లో ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఈ సీరియల్ స్టోరీ. కృతిక గతంలో మగువ ఓ మగువా సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకుల మనసుని దోచుకుంటుంది.. ఈమె సీరియల్స్ తో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్గానే ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది. తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ లో పెళ్లికూతురు గెటప్ లోని కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది. ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది.. అచ్చం పెళ్లికూతురు లాగే మహాలక్ష్మి ఉంది అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరి మహాలక్ష్మి నిజంగానే పెళ్లి పీటలు ఎక్కువ పోతుందా? లేదా కేవలం ఫోటోషూట్ నా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైన కూడా ఆ వీడియోలో మహా లక్ష్మీ చాలా అందంగా కనిపిస్తుంది. మీరు ఇటు ఓ లుక్ వేసుకోండి.

Advertisement

?igsh=MXZkbmtsdHR5ZW9kNQ==

Also Read : గొప్ప మనసు చాటుకున్న బాలు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా..?

పొదరిల్లు స్టోరీ.. 

Advertisement

ప్రస్తుతం ఈ సీరియల్ జనాలకి కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సెంటిమెంట్ డైలాగులు కన్నీరు తెప్పించే సీన్లు ప్రేక్షకులను బాగా కట్టిబడిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. నారాయణ ఇంటి పెద్ద కొడుకుగా ఉన్న మాధవ్ పెళ్లి గురించి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే తనకు ఆశ్రయమిచ్చి తనని సొంత బిడ్డ లాగా చూసుకుంటున్న పెద్దికి పెళ్లి చేయాలి అని సంబంధం కోసం మాట్రిమోనీలో ప్రొఫైల్ ని యాడ్ చేస్తుంది.. తనకు సంబంధం వచ్చిన మాధవ్ మాత్రం గాయత్రీ ని మర్చిపోలేక పోతాడు.. ఇక మహాలక్ష్మి ఎలాగైనా సరే గాయత్రీని ఇచ్చి పెళ్లి చేయాలని గాయత్రీ కి ధైర్యం చెప్పి పెళ్లికూతురుగా రమ్మని చెప్తుంది. కానీ గాయత్రి మాత్రం తయారుకి అడ్డంగా దొరికిపోతుంది. తనని పెళ్లి చేసుకోను అని చెప్పేస్తుంది. ఇక సోమవారం ఎపిసోడ్లో మాధవ్ గాయత్రీ ని మర్చిపోలేక తన అన్నదమ్ములతో కలిసి ఎమోషనల్ అవుతాడు. ఆ డైలాగులు ప్రేక్షకుల్ని గుండెలు పిండేసేలా ఉంటాయి.. మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×