E-Paper
Advertisement

వరుస హత్యలతో వణికిపోయే రాత్రి… భయానికి అర్థం మార్చే సరికొత్త మిస్టరీ

వరుస హత్యలతో వణికిపోయే రాత్రి… భయానికి అర్థం మార్చే సరికొత్త మిస్టరీ
Advertisement

Horror Comedy OTT : తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ, ఒక హర్రర్ కామెడీ సినిమా విజయం సాధించింది. హర్రర్ సినిమాలంటే ఇష్టపడే వారికి, ఈ సినిమా కావాల్సినంత థ్రిల్ ను ఇస్తుంది కూడా. ఒక ముసుగు ధరించిన వ్యక్తి చేతిలో, కొంత మంది సమ్మర్ క్యాంప్ కు వచ్చిన స్నేహితులు చనిపోతుంటారు. ఈ క్రమంలో స్టోరీ యమ క్రేజీగా సాగుతుంది. క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. హత్యలు చేస్తున్నది ఎవరో తెలిస్తే ఆడియన్స్ కూడా షాక్ అయిపోతారు. ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ స్టోరీ 2017లో ఇద్దరు రచయితల మధ్య ట్విట్టర్ లో సరదాగా జరిగిన ఒక వైరల్ సంభాషణ ఆధారంగా పుట్టింది. అది ఎంత పాపులర్ అయిందంటే, దర్శకుడు బ్రెట్ సిమ్మన్స్ దానిని ఒక పూర్తిస్థాయి హర్రర్ కామెడీ చిత్రంగా తీసేంత వరకు వచ్చింది.

ఎక్కడ చూడచ్చు అంటే

2018లో వచ్చిన ఈ అమెరికన్ స్లాషర్ కామెడీ సినిమా పేరు ‘యూ మే బి ద కిల్లర్’ (You Might Be the Killer). దీనిని బ్రెట్ సిమ్మన్స్ డైరెక్ట్ చేశారు. ఇందులో ‘ద క్యాబిన్ ఇన్ ద ఉడ్స్’ ఫేమ్ ఫ్రాన్ క్రాంజ్, ‘హౌ ఐ మెట్ యువర్ మదర్’ నటి అలీసన్ హానిగాన్ ప్రధాన పాత్రలు పోషించారు. సామ్ పాత్రలో ఫ్రాన్ క్రాంజ్, చుక్ పాత్రలో అలీసన్ హానిగాన్ నటించారు. ఈ సినిమా ప్రస్తుతం Shudder ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సామ్ అనే ఒక యువకుడు ఒక సమ్మర్ క్యాంప్‌ కి సరదాగా స్నేహితులతో వెళ్తాడు. అక్కడ అకస్మాత్తుగా ఒక ముసుగు వేసుకున్న హంతకుడు అందరినీ వరుసగా చంపేస్తుంటాడు. భయపడిపోయిన సామ్, హర్రర్ సినిమాల గురించి బాగా తెలిసిన తన స్నేహితురాలు చుక్‌కి ఫోన్ చేసి సహాయం కోరతాడు. చుక్ అతనికి కొన్ని టిప్స్ ఇస్తూ, అక్కడ ఏం జరుగుతుందో బాగా గమనించమని చెబుతుంది. అయితే చుక్‌తో మాట్లాడుతున్న కొద్దీ సామ్‌కి ఒక షాకింగ్ విషయం అర్థమవుతుంది. ఆ హంతకుడు వేరే ఎవరో కాదు, సామ్ చేతిలో ఉన్న ఒక పాత చెక్క ముసుగు వల్ల అతనే ఆ హత్యలన్నీ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆ ముసుగు పెట్టుకోగానే సామ్‌కి పూనకం వచ్చినట్టు అయిపోయి, ఎదురుగా ఉన్న వాళ్ళని కిరాతకంగా చంపేస్తాడు, కానీ ఆ తర్వాత ఆ విషయం అతనికి అసలు గుర్తుండదు. అసలు ఆ చెక్క మాస్క్ సామ్ దగ్గరికి ఎలా వచ్చింది ? దాని వెనుక ఉన్న శక్తి ఏమిటి ? దీని నుంచి సామ్ ఎలా బయట పడ్డాడు ? అక్కడ ప్రాణాలతో ఎవరైనా మిగులుతారా ? అనే విషయాలను ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : చిన్నపిల్లల అదృశ్యం… ముప్పై ఏళ్లుగా అంతుచిక్కని మిస్టరీ… బుర్ర గిర్రున తిరిగే స్టోరీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×