E-Paper
Advertisement

Podarillu Madhav : ‘పొదరిల్లు’ మాధవ్ జీవితంలో అన్ని కష్టాలే.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..

Podarillu Madhav : ‘పొదరిల్లు’ మాధవ్ జీవితంలో అన్ని కష్టాలే.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..
Advertisement

Podarillu Madhav: తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న వాటిలలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయి.. ఒక్కో సీరియల్ ఒక్కో డిఫరెంట్ స్టోరీ తో జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఈ మధ్య వస్తున్న ప్రతి సీరియల్ కూడా డిఫరెంట్ స్టోరీలతో రావడంతో జనాలు వీటిని చూసేందుకు బాగా ఆసక్తి కనపరుస్తున్నారు.. గత ఏడాది చివర్లో వచ్చిన సీరియల్స్ విషయానికొస్తే పొదరిల్లు సీరియల్ మాత్రం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్క యాక్టర్ కూడా మంచి ప్రేమున్న యాక్టర్స్ కావడంతో జనాలు కూడా సీరియస్గా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో హీరో హీరోయిన్ల తర్వాత ఎక్కువగా హైలైట్ అయిన క్యారెక్టర్ మాత్రం మాధవ్. ఆ ఇంటి పెద్ద కొడుకుగా తన బాధ్యతను స్వీకరిస్తూ జనాలను తన మాట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. అందులో నటించిన యాక్టర్ పేరు అజయ్ సత్యనారాయణ.. ఈయన గతంలో తెలుగులో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈయన రియల్ లైఫ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. మరి ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కన్నీళ్లు తెప్పించే అజయ్ రియల్ స్టోరీ.. 

పొదరిల్లు సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ లో నటించిన మాధవ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. అబ్బాయి అయి ఉండి కూడా తన ఫ్యామిలీ కోసం తన ఇంటి కోసం ఎంతగా కష్టపడుతున్నాడు అన్నది చూసేవారి గుండెల్ని కదిలిస్తుంది. ఆయన రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవించాడు అన్నది చాలామందికి తెలియదు.. మాధవ్ అసలు పేరు అజయ్ సత్యనారాయణ.. అలియాస్ అజయ్ గౌడ.. ఈయన కన్నడ నటుడు.. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియస్లలో నటించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.. అజయ్ రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేకపోవడంతో పస్తులున్న రోజులను గుర్తు చేసుకున్నాడు అజయ్.. ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ ఆయన చెప్పిన ప్రతి మాట కూడా జనాలను కన్నీళ్లు తెప్పించేలా ఉన్నాయి. నటన పై ఇంట్రెస్ట్ ఉండడంతో ఆయన ఈ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసినట్లు అందులో చెప్పాడు.. ప్రస్తుతం తెలుగులో సీరియల్స్ ఎక్కువగా వస్తుండటం ఫ్యామిలీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.

అజయ్ రెమ్యూనరేషన్..?

Advertisement

బుల్లితెర నటులకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతుంది. తెలుగులో కన్నడ నటులకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. తెలుగు డైరెక్టర్లు ఎక్కువగా కన్నడ వాళ్ళని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం స్టార్ మా లో దూసుకుపోతున్న కొత్త సీరియల్లలో పొదరిల్లు ఒకటి.. ఇందులో నలుగురు అన్నదమ్ములు ఉంటారు. అందులో మొదటి వాడు మాధవ్. ఈయన అసలు పేరు అజయ్ గౌడ. తెలుగులో ఆల్రెడీ పలు సీరియల్స్ లో నటించాడు.. ముఖ్యంగా నువ్వు నేను ప్రేమ అనే సీరియల్ ఆయనకు మంచి క్రేజ్ ని అందించింది.. ఆయనకు తెలుగులో ఇది రెండవ సీరియల్ కావడంతో రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతమైన ఈ సీరియల్ కిగాను దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. నెలలో దాదాపు 25 రోజుల వరకు షూటింగ్ ఉండడంతో ఆయన సంపాదన నెలకు బాగానే ఉన్నట్లు తెలుస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×