E-Paper
Advertisement

బామ్మ ఆస్తిపై యువకుడి కన్ను… కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్… ఐయండిబిలో 7.9 రేటింగ్

బామ్మ ఆస్తిపై యువకుడి కన్ను… కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్… ఐయండిబిలో 7.9 రేటింగ్
Advertisement

Feel good Movie OTT : ఓటీటీలో ఒక ఫీల్ గుడ్ సినిమా స్ట్రీమింగ్ లో ఉంది. అయితే ఇది చాలా గొప్ప సినిమాగా ప్రశంసలు అడుకుంటోంది.
ఈ సినిమా చూసి చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై భారీ చర్చ కూడా జరిగింది. కుటుంబాల్లో ఉండే బాధ్యతలు, ప్రేమ, ఆస్తి గొడవలను చాలా రియలిస్టిక్ గా చూపించారు ఇందులో. ఒక బామ్మ ఆస్తిని దక్కించుకోవడానికి మనవడు చేసే ప్రయత్నమే ఈ సినిమా. ఇది థాయ్‌లాండ్ నుండి ఆస్కార్ అవార్డులకు కూడా ఎంపికై సంచలనం అయింది. ఈ సినిమా రచయిత తన సొంత అమ్మమ్మను చూసుకున్నప్పుడు కలిగిన నిజ జీవిత అనుభవాల ఆధారంగానే ఈ స్క్రిప్ట్‌ను రాశారు.  అందుకే ఇందులో ఎమోషన్స్ అంత సహజంగా పండాయి.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ ఫీల్ గుడ్ థాయ్ మూవీ పేరు “How to Make Millions Before Grandma Dies”. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం సృష్టించింది. కేవలం థాయ్‌లాండ్‌లోనే కాకుండా ఇండోనేషియా, సింగపూర్ మరియు ఫిలిప్పీన్స్‌ వంటి దేశాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన థాయ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడం విశేషం. దీనికి తోడు, 2025 ఆస్కార్ అవార్డుల రేసులో ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’ విభాగంలో థాయ్‌లాండ్ తరపున ఈ సినిమా పోటీ పడింది. విమర్శకుల నుండి 100% పాజిటివ్ రేటింగ్స్ సాధించి, ఈ ఏడాది గొప్ప చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక నటీనటుల విషయానికి వస్తే, మనవడి పాత్రలో నటించిన బిల్కిన్, థాయ్‌లాండ్‌లో ఒక స్టార్ సింగర్ గా నటుడిగా మంచి గుర్తింపు ఉంది. అలాగే 78 ఏళ్ల వయసులో అమ్మమ్మ పాత్రలో నటించిన ఉషా సీంఖుమ్ కు ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు తెలుగు ఆడియోతో కూడా దీనిని చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే 

Advertisement

ఎం (M) అనే ఒక కుర్రాడు పనిపాట లేకుండా తిరుగుతుంటాడు. వాడికి వాళ్ళ అమ్మమ్మకి క్యాన్సర్ అని, ఆవిడ ఎక్కువ రోజులు బతకదని తెలుస్తుంది. తన కజిన్ ఒకమ్మాయి ముసలివాళ్ళని కనిపెట్టుకుని ఉండి వాళ్ళ ఆస్తిని ఎలా కొట్టేసిందో చూసి, ఎం కూడా అదే ప్లాన్ వేస్తాడు. ఎలాగైనా అమ్మమ్మని బుట్టలో వేసుకుని, ఆవిడకున్న కోట్లాది రూపాయల విలువైన ఇంటిని తన పేరు మీద రాయించుకోవాలని డిసైడ్ అయి, బ్యాగ్ సర్దుకుని అమ్మమ్మ దగ్గరికి చేరతాడు. అమ్మమ్మేమో మామూలు మనిషి కాదు, చాలా గట్టిపిండం. మనోడు చేసే ఓవర్ యాక్షన్ అంతా ఆవిడకి అర్థమవుతూనే ఉంటుంది. వాడు టీవీ చూస్తూనో, ఫోన్ పట్టుకునో టైంపాస్ చేస్తుంటే ఆవిడ మాత్రం తన పనులు తాను చేసుకుంటూ వాడిని ఒక కంట కనిపెడుతుంటుంది.

కానీ రాను రాను ఆవిడ పడే కష్టం, ఆ వయసులో ఆవిడ ఒంటరితనం చూసి అతనిలో మార్పు మొదలవుతుంది. ఆస్తి కోసం వచ్చిన వాడు కాస్తా, ఆవిడకి నిజంగానే సాయం చేయడం మొదలుపెడతాడు. చివరికి అమ్మమ్మ చనిపోతుంది. ఆవిడ తన ఇంటిని ఎవరి పేరు మీద రాసిందో తెలిశాక ఎం షాక్ అవుతాడు. కానీ ఆవిడ చనిపోయే ముందు వాడికి ఇచ్చిన ఒక గిఫ్ట్ చూసి వాడి కళ్ళు తెరుచుకుంటాయి. చూసేవాళ్లకు కూడా కచ్చితంగా కన్నీళ్లు తెప్పించే సినిమా ఇది.

Advertisement

Read Also : పెళ్ళి రోజే మరొకరిని ఇష్టపడే పెళ్లి కూతురు… భర్తకు దిమ్మతిరిగే షాక్… క్లైమాక్స్ క్రేజీగా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×