E-Paper
Advertisement

పూరి గుడిసెలో ఉండేవాళ్లం.. తన కష్టాలు చెప్పుకొని భావోద్వేగానికి గురైన నూకరాజు!

పూరి గుడిసెలో ఉండేవాళ్లం.. తన కష్టాలు చెప్పుకొని భావోద్వేగానికి గురైన నూకరాజు!
Advertisement

Kissik Talks on Nookaraju: పటాస్ కామెడీ షోలో ప్రేక్షకులను తనదైన కామెడీతో ఆకట్టుకున్న నూకరాజు(Nookaraju) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఇండస్ట్రీలోకి రావడం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకున్న విషయం తెలిసిందే.అలా విజయవాడలోని పవర్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో జీ తెలుగులో ఒక కామెడీ షోలో అవకాశం లభించింది. అయితే రెండు బ్యాలెన్స్ చేయలేక ఉద్యోగాన్నే పక్కనపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ సమయంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట నూకరాజు. ప్రస్తుతం ఒక్కో మెట్టు ఎక్కుతూ.. బుల్లితెరపై బిజీ ఆర్టిస్టుగా పేరు సొంతం చేసుకున్న నూకరాజు.. తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)షోలో పాల్గొని సందడి చేశారు. ఇదే ఇంటర్వ్యూలో తన ఆస్తుల గురించి కూడా చెప్పుకొచ్చారు.

పూరి గుడిసెలో ఉండేవాళ్ళం – నూకరాజు

ఇంటర్వ్యూలో భాగంగా వర్షా మాట్లాడుతూ..” ఆస్తుల గురించి మీరు బయటపెడతారా? లేక నేనే చెప్పేనా?” అని అడగగా.. “చెప్పడానికి ఏం లేదు..సొంత ఊర్లో ఒక ఇల్లు కట్టుకున్నాను. ఒకప్పుడు మాది పూరి గుడిసె.. వర్షం వస్తే ఒకపక్క మేము.. మరోపక్క వర్షం.. రెండింటికి మా ఇంట్లో స్పేస్ ఉండేది. మా కష్టం ఎలా ఉండేది అంటే అప్పట్లో రూ.4,000 దొరికితే చాలు పడవ కొనుక్కునే వాళ్ళము. ఆ 4వేల కోసం అడగని వ్యక్తి లేదు.. అప్పు చెయ్యని రోజు లేదు. ఇంట్లో జ్వరం వస్తే ఆపిల్స్ అమ్మ తీసుకొస్తుంది అనే కారణంతో మాకు జ్వరం వస్తే బాగుండు అని కోరుకున్న రోజులు కూడా ఉన్నాయి. పండుగల సమయంలో అందరూ ఆడుకుంటుంటే మా బాల్యంలో మేము మాత్రం పనికి వెళ్లే వాళ్ళం “అంటూ తన కష్టాలను చెప్పుకొచ్చారు నూకరాజు.

Advertisement

ALSO READ:సముద్రంలో 10 కిమీలు లోపలికి.. నరాలు కట్ అయ్యి.. నూకరాజు చెప్పింది వింటే!

అలాంటి రోజు మళ్ళీ నా జీవితంలో వద్దు – నూకరాజు

నాన్నకి రోగం వస్తే ఉన్న బంగారం తాకట్టు పెట్టాలి.. లేదంటే అమ్మేయాలి. అలా ఎన్నో కష్టాలు పడ్డాము.. ఇక ముఖ్యంగా అలాంటి రోజు నా జీవితంలో వద్దు. ముఖ్యంగా మా నాన్న మందు తాగకూడదు అనే రోజు మళ్ళీ నా జీవితంలో రాకూడదు. పూరి గుడిసెలో ఉన్నప్పుడు కూడా మేము ఐదుగురం కూర్చుని హ్యాపీగా నవ్వుకుంటూ తినేటోళ్లం. కానీ ఈ డ్రింక్ వల్ల ఏమైందంటే ముద్ద నోట్లోకి పోయేది కాదు.” అంటూ తన కష్టాలను చెప్పుకొచ్చారు..

లైవ్ లోనే తన తండ్రికి కాల్ చేసిన నూకరాజు..

Advertisement

మీ నాన్నది చాలా ఫన్నీ థింగ్స్ ఉంటాయి నాకు తెలిసు అని వర్ష అడగగా.. “మా నాన్న ఏంటంటే మా అమ్మతో మాట్లాడమంటే రెండు నిమిషాల్లోనే చిరాకు వచ్చేస్తుంది. అలా వీధిలోకెళ్ళి ఎవరైనా కనిపించి మాట్లాడమంటే పదినిమిషాలైనా ఓపిగ్గా మాట్లాడుతాడు”. అంటూ తన తండ్రికి లైవ్ లోనే ఫోన్ చేసి మాట్లాడారు నూకరాజు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×