E-Paper
Advertisement

విమానం ఎక్కకపోయినా భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ ను చూడొచ్చా? ఇలా వెళ్తే సరిపోతుంది!

విమానం ఎక్కకపోయినా భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ ను చూడొచ్చా? ఇలా వెళ్తే సరిపోతుంది!
Advertisement

Bhogapuram Airport Visit: భోగాపురంలో తాజాగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ప్రధాన ఆకర్షణగా మారింది. ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయం రావడం పట్ల ప్రజలు సంతోష పడుతున్నారు. ఈ ప్రాంత వ్యాపారంగంతో పాటు పర్యాటక రంగానికి కూడా బిగ్ బూస్టింగ్ వస్తుందని భావిస్తున్నాయి. అయితే, ఈ ఎయిర్‌ పోర్ట్‌ ను సామాన్యులు సైతం చూసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సాధారణ ప్రజలు కూడా కొన్ని నిబంధనలు పాటిస్తూ విమానాశ్రయాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

భోగాపురం ఎయిర్ పోర్టుకు ఎలా వెళ్లాలంటే?

భోగాపురం విశాఖపట్నం-శ్రీకాకుళం జాతీయ రహదారి (NH-16)పై ఉండటంతో ఈజీగా వెళ్లే అవకాశం ఉంటుంది.  విశాఖపట్నం నుంచి సుమారు 45 కిలోమీటర్లు, విజయనగరం నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, టాక్సీలు, క్యాబ్‌ లు, సొంత వాహనాల్లో సులభంగావెళ్లవచ్చు.

ఎయిర్ పోర్టులో ఏ ప్రదేశాలు చూడవచ్చు?

Advertisement

విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత భద్రతా నిబంధనల కారణంగా ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉన్న ప్రాంతాల్లోకి సాధారణ సందర్శకులను అనుమతించరు. ముఖ్యంగా బోర్డింగ్ ఏరియా, సెక్యూరిటీ చెక్ తర్వాత ఉండే ప్రదేశాల్లోకి వెళ్లే అవకాశం ఉండదు. అయితే, బయట ఉన్న పబ్లిక్ పోర్టికో, డ్రాప్-ఆఫ్ జోన్, ల్యాండ్‌ స్కేపింగ్ గార్డెన్లు, విమానాశ్రయం వెలుపలి నిర్మాణం, ఆధునిక టెర్మినల్ డిజైన్‌ ను చూసి ఆస్వాదించవచ్చు. ఫోటోలు తీసుకోవడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో అనుమతి ఉంటుంది. అయితే, భద్రతా సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలి.

విజిటర్ పాస్ తో మెయిన్ హాల్ వరకు వెళ్లే అవకాశం

కొన్ని సందర్భాల్లో విమానాశ్రయ మెయింటెనెన్స్ సంస్థలు విజిటర్ పాస్ లు ఇచ్చే అవకాశం ఉంది. వాటిని తీసుకుని టెర్మినల్‌ లోని మెయిన్ హాల్ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ లోపలి ఆర్కిటెక్చర్, విశాలమైన వెయిటింగ్ ఏరియాలు, కెఫేలు సహా పలు ఇతర సౌకర్యాలను కూడా చూడవచ్చు. అయితే, ఈ పాస్ అందుబాటులో ఉండటం పూర్తిగా విమానాశ్రయ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. విజిటర్ పాస్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, లేదంటే ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లడం మంచిది.  ఆ తర్వాత అక్కడి అధికారులు సూచించే విధానాన్ని ఫాలో కావాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, విమానాశ్రయం ప్రజలకు అందుబాటులో ఉండే సమయాలు, సందర్శకుల అనుమతి లాంటి విషయాలు మారే అవకాశం ఉంటుంది. అందుకే వెళ్లే ముందు పూర్తి సమాచారం తెలుసుకోవడం మంచిది.

Advertisement

మొత్తానికి, విమానం ఎక్కకపోయినా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బయట నుంచి సందర్శించి అక్కడి ఆధునిక నిర్మాణాన్ని, అందమైన పరిసరాలను చూడవచ్చు. సరైన అనుమతులు ఉంటే టెర్మినల్‌ లోని కొన్ని లోపలి ప్రాంతాలను కూడా వీక్షించే అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్రలో కొత్తగా రూపుదిద్దుకున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం పర్యాటకులకు కూడా ఆకర్షణీయమైన ప్రదేశంగా మారుతోంది.

నోట్: ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమే ఈ వివరాలు ఇచ్చాం. దయచేసి అక్కడికి వెళ్లే ముందు ఎయిర్ పోర్ట్ అధికారులను సంప్రదించి.. రూల్స్ గురించి తెలుసుకుని కన్ఫార్మ్ చేసుకోగలరు.

Read Also: ‘భోగాపురం’ అంటే ఏంటీ? ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ఊరికి ఇంత చరిత్ర ఉందా?

Tags

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×