E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  రణవీర్‌కు ఫోన్‌ చేసి నిజం చెప్పిన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today September 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  రణవీర్‌కు ఫోన్‌ చేసి నిజం చెప్పిన మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్‌ నిద్ర లేచిన వెంటనే ఫోన్‌ చూస్తాడు. అందులో మనోహరి మిస్సుడ్‌ కాల్స్‌ ఉంటాయి. వెంటనే రణవీర్‌, మనోహరికి కాల్‌ చేస్తాడు. కాల్‌ లిఫ్ట్‌ చేసిన మనోహరి కోపంగా తిడుతుంది. ఏంటి రణవీర్‌ ఇది ఎన్ని సార్లు ఫోన్‌ చేయాలి నీకు అసలు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దీంతో రణవీర్‌ కూల్‌గా మనోహరి నిద్ర పోతున్నాను.. దెయ్యాలు తిరిగే టైంలో ఫోన్‌ చేస్తే ఎవరు మెలుకువగా ఉంటారు చెప్పు అంటాడు. దీంతో ఇప్పుడు దెయ్యం కథ మొదలవబోతుంది అని మను చెప్పగానే.. రణవీర్‌ అర్థం కాక దెయ్యం కథా ఎమంటున్నావు మనోహరి.. అని అడుగుతాడు. భాగీ, అరుంధతి ఫోటో చూసేసింది.. అని చెప్పగానే రణవీర్‌ షాకింగ్‌ గా ఏంటి..? ఎప్పుడు చూసింది అని అడుగుతాడు.

నిన్న నైట్‌ చూడగానే.. స్పృహ తప్పి పడిపోయింది. ఇంకా నిద్ర లేవ లేదు అని చెప్పగానే.. ఇదేంటి వరుసగా అన్ని ఇలా జరగుతున్నాయి నిన్న భాగీకి నీ గురించి తెలిసిపోవడం.. నైట్‌ అరుంధతి ఫోటో చూడటం అంటూ భయపడుతుంటాడు రణవీర్‌. అదే నాకు అర్థం కావడం లేదు. అది లేవగానే… ఇన్నాళ్లు తను చూసింది, మాట్లాడుతుంది మనిషితో కాదు.. అరుంధతి ఆత్మతో అని అమర్‌తో చెప్తే.. అంటుంది మను. దీంతో కచ్చితంగా చెప్తుంది మనోహరి.. నీది చిన్న విషయం భాగీ అమరేంద్రతో నీ విషయం చెప్పకపోయినా ఈ విషయం చెప్పి తీరుతుంది అంటాడు రణవీర్‌. అమర్‌కు ఆ విషయం తెలిస్తే ఆ తర్వాత వన్‌ బై వన్‌ అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు ఏం చేయాలి రణవీర్‌ అని అడుగుతుంది. దీంతో వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేయ్‌ వాళ్లకు కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అని చెప్తాడు రణవీర్‌. పారిపోవడానికా ఇన్ని చేసింది. ఏదైనా మంచి ఐడియా ఇస్తావని నిన్ను ఐడియా అడిగితే ఇలా చెప్తున్నావేంటి..? అంటుంది మనోహరి.

Advertisement

ఇంత కంటే బెటర్‌ ఐడియా లేదు మనోహరి. అమరేంద్రకు నిజం తెలిస్తే నిన్ను బతకనివ్వడు.. చంపేస్తాడు.. అంటాడు రణవీర్‌. దీంతో మనోహరి కోపంగా రణవీర్‌ ఊరికే నన్ను బయపెట్టకు అసలే నేను టెన్షన్‌లో ఉన్నాను అంటుంది. దీంతో రణవీర్‌ బయపెట్టడం కాదు.. నీ మంచి కోరి చెప్తున్నాను.. ఇంక నువ్వు అక్కడ ఉండటం సేఫ్‌ కాదు మనోహరి అంటాడు రణవీర్‌. అసలు అది ఆత్మ గురించి చెప్తుందో లేదో తెలియాలి కదా..? అప్పుడే నేనెందుకు బయటపడాలి అంటుంది మనోహరి. దీంతో రణవీర్‌ ఇన్ని జరుగుతునాయంటే.. నీకు బ్యాడ్‌ టైం స్టార్ట్‌ అయినట్టే మనోహరి.. నా మాట విని బయటకు వచ్చేయ్‌ అని చెప్పగానే.. లేదు రణవీర్‌ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని ఆ తర్వాత తేల్చుకుంటాను.. అని మను చెప్పగానే.. నేను చెప్పాల్సిన మాట చెప్పాను.. ఇక నీ ఇష్టం అంటాడు రణవీర్‌. దీంతో భాగీ స్పృహలోకి వచ్చాక ఏం జరుగుతుదో చూసి అప్పుడు డిసైడ్‌ అవుతాను అని మనోహరి చెప్పగానే.. ఓకే బట్‌ బీ కేర్‌పుల్‌ అని జాగ్రత్తలు చెప్తాడు రణవీర్‌. సరే అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది మనోహరి.

ఆరు చెట్టు చాటు నుంచి తొంగి తొంగి చూస్తుంటే.. గుప్త వచ్చి ఏమైంది బాలిక ఉదయం నుంచి సింహ ద్వారం వైపే తీక్షణంగా చూస్తున్నావు.. అని అడుగుతాడు. దీంతో భాగీ ఉదయమే లేచి గుమ్మం ముందు ముగ్గు పెట్టేది. ఈరోజు తను ఇంకా బయటకు రాలేదు గుప్త గారు.. ఏమై ఉంటుంది అంటారు అని అడుగుతుంది. ఏమున్నది బాలిక రాత్రి ఆలస్యముగా నిద్రించి ఉండవచ్చును అందులకే నిద్ర లేవలేదేమో.. అని గుప్త చెప్పగానే.. నేను అదే అనుకున్నాను లేండి అంటూ కిటికీ దగ్గరకు వెళ్తుంది ఆరు. వెనకే గుప్త వెళ్తాడు. అప్పుడే అమర్‌ పై నుంచి కిందకు వచ్చి పేపర్‌ చదువుతుంటాడు. ఇంతలో రాథోడ్‌ వచ్చి సార్‌ ఈరోజు ప్రోగ్రాం ఏంటంటే.. అని చెప్పబోతుంటే..

Advertisement

వన్‌ మినిట్‌ రాథోడ్‌ ఈ రోజు అరగంట లేటుగా ఆఫీసుకు వెళ్దాం అంటాడు. ఎందుకు సార్‌ అని రాథోడ్‌ అడగ్గానే.. రాత్రి భాగీ స్పృహ తప్పి పడిపోయింది. ఇంకా నిద్ర లేవలేదు.. అని చెప్పగానే.. రాథోడ్‌ కంగారుగా ఎందుకు సార్‌ ఏమైంది అని అడుగుతాడు. కిటికీ దగ్గర చూస్తున్న ఆరు కంగారుగా అయ్యో నా చెల్లి స్పృహ తప్పి పడిపోయిందట.. అంటూ పైకి పరుగెడుతుంది.  అమర్‌ తెలియదు రాత్రి నేను నిద్ర లేచి చూసే సరికి ఆరు రూంలో స్పృహ తప్పి పడిపోయి ఉంది అని చెప్తాడు. ఇంతలో పై రూం కిటికీ దగ్గరకు వెళ్లిన ఆరు, మిస్సమ్మను చూసి కంగారుగా చెల్లి అని పిలుస్తుంది. మిస్సమ్మ నిద్రపోతూ ఉంటుంది.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×