E-Paper
Advertisement

Brahmamudi Serial Today September 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించేందుకు రాజ్‌ కొత్త ప్లాన్‌

Brahmamudi Serial Today September 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించేందుకు రాజ్‌ కొత్త ప్లాన్‌
Advertisement

Brahmamudi serial today Episode: మీ నిర్ణయం మీరు తీసుకున్నప్పనుడు నా నిర్ణయం నేను తీసుకుంటాను.. నాకు మీ కన్నా నా బిడ్డే ముఖ్యం అంటూ కరాకండిగా చెప్పేస్తుంది కావ్య. నా బిడ్డ కోసం మిమ్మల్నే కాదు ఆ దేవుడిని కూడా ఎదురించడానికి సిద్దంగా ఉన్నాను అంటూ చెప్పి కావ్య వెళ్లిపోతుంది. రాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అపర్ణ ఏడుస్తూ.. ఏంటండి ఇదంతా వీడు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నాడంటే వీడు చెప్పేది నిజమైన కారణం కాదేమో అనిపిస్తుంది వేరే ఏదో కారణం ఉందేమో అంటుంది. ఇలాంటి కొడుకు మన కడుపున పట్టాలని రాసి పెట్టి ఉన్నప్పుడు మనం ఏం చేయగలం అపర్ణ అంటూ బాధపడతాడు.

గార్డెన్‌ ఉన్న రాజ్‌ దగ్గరకు కళ్యాణ్‌ వెళ్తాడు. అన్నయ్యా ఫ్లీజ్‌ ఇప్పటి వరకు జరిగింది చాలు. అందరినీ బాధపెట్టి అందిరి చేత మాట అనిపించుకుని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు.. ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదన్నయ్యా.. ఇంక నీ మౌన వ్రతాన్ని వదిలేసి ఇప్పటికైనా వదినకు నిజం చెప్పేసెయ్‌.. అంటాడు కళ్యాణ్‌. చెప్పేస్తే.. మీ వదిన ఒప్పుకుంటుందా..? తన కడుపులో పెరుగుతున్న బిడ్డను వద్దనుకుంటుందా..? ఇందాక తను ఎలా మాట్లాడిందో విన్నావు కదా..? కారణం చెప్పకుండానే అలా రియాక్ట్ అయిన కళావతి.. నిజం చెబితే ఇంకెలా రియాక్ట్‌ అవుతుందో ప్రాణం పోయినా పర్వాలేదు నా బిడ్డకు ప్రాణం పోస్తాను అంటుంది అని రాజ్‌ చెప్పగానే..

Advertisement

కానీ అన్నయ్యా వదినకు నిజం చెప్పకుండా ఇంకెంత కాలం అలాగే ఉండగలం చెప్పు.. సూదిని మూట కట్టినంత మాత్రాన అది దాగుతుందా..? అది ఏదో ఒకలాగా బయటకు వస్తుంది. నిజం బయటపడక ముందే.. నువ్వే నిజం చెప్పడం బెటర్‌ అన్నయ్యా.. అంటూ కళ్యాణ్‌ చెప్పగానే.. లేదు కళ్యాణ్‌ ఎట్టి పరిస్థితుల్లో కళావతికి నిజం తెలియకూడదు.. కనీసం ఇప్పుడు ఏదో ఒక రకంగా అయినా తనను కాపాడుకోగలను అన్న ధైర్యం ఉంది. కానీ నిజం తెలిస్తే అసలు కాపాడుకోలేము అంటాడు రాజ్‌. కానీ అన్నయ్య పరిస్థతి చూస్తుంటే వదిన మాట వినడం లేదు.. ఇప్పుడు ఎలా అన్నయ్య.. అంటూ కళ్యాణ్‌ అడగ్గానే.. దానికి నేను ఒక ప్లాన్‌ చేశాను. పద వెళ్దాం అంటూ ఇద్దరూ కలిసి మెడికల్‌ షాపు దగ్గరకు వెళ్తారు. అక్కడకు వెళ్లి నీకు మెసేజ్‌ చేసిన టాబ్లెట్స్‌ తీసుకురా అని రాజ్‌ చెప్తాడు. దీంతో భయం వేస్తుంది అన్నయ్య.. పైగా ఇలా చేయడం చట్టరీత్యా నేరం.. వదినకు ఈ నిజం తెలిస్తే.. మనల్ని జీవితాంతం క్షమించదు.. అంటూ బాధపడతాడు. రాజ్‌ కోప్పడగానే మెడికల్‌ షాపులోకి వెళ్తాడు కళ్యాణ్‌.

అపర్ణ కోపంగా రాజ్‌ను తిడుతూ ఎక్కడ తాళి బంధానికి బెండ్‌ అవుతావేమోనని అనుకున్నాను కానీ బిడ్డ కావాలని చెప్పావు. వాడిప్పుడు అబార్షన్‌ ఎలా చేయిస్తాడో చూస్తాను నా పుల్‌ సపోర్ట్ నీకే అని చెప్తుంది. దీంతో ఇంద్రాదేవి కోపంగా అపర్ణ పెద్ద దానివై ఉండి సర్ది చెప్పాల్సింది పోయి అలా మాట్లాడతావేంటి..? అని అడుగుతుంది. మరి లేకపోతే ఇంకెలా మాట్లాడాలి అత్తయ్యా ఆకలితో అలిగాడంటే తల్లిగా బుజ్జగించేదాన్ని.. కానీ ఒక తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డనే వద్దు అంటున్నాడు అంటే ఇలా కాకుండా ఎలా మాట్లాడాలి అత్తయ్యా.. కొడుకుగా తప్పు చేస్తానంటే క్షమిస్తాను అత్తయ్యా.. కానీ ఇంకొక తల్లికి అన్యాయం చేస్తానంటే మాత్రం అసలు క్షమించను అత్తయ్య అంటుంది.

Advertisement

దీంతో ఇంద్రాదేవి అపర్ణ వాడు తన భర్త ఆ విషయం మర్చిపోతున్నావు.. అనగానే.. భర్త అయినంత మాత్రాన దాని మీద అన్ని హక్కులు  వాడికే ఉంటాయా..? భార్యగా దానికి ఏ హక్కు అధికారం ఉండదా..? వాడేం చెప్తే దానికి సరే అంటూ గంగిరెద్దులా తలూపాలా.? అయినా వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా అత్తయ్యా.. ఈ విషయంలో వాడు ఏం చేసినా సరే నువ్వు మాత్రం నీ నిర్ణయాన్ని మార్చుకోకు కావ్య అని చెప్పి అపర్ణ వెళ్లిపోతుంది. అమ్మా కావ్య ఈ విషయంలో నా మనవడు చెప్పినట్టు నడుకో అని చెప్పను.. తల్లిగా ఆ బిడ్డ విషయంలో పూర్తి హక్కులు నీకే ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో నీ ఇష్టం.. అంటూ ఇంద్రాదేవి చెప్పగానే..

లేదు అమ్మమ్మ గారు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కాదు.. ఈ విషయంలో ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలి అని చెప్తుంది. దీంతో ఇంద్రాదేవి ఏటి కావ్య నువ్వు చెప్పేది.. అని అడుగుతుంది. దీంతో అవును అమ్మమ్మ ఆయన ఎలాంటి వారో మనకు తెలుసు.. ఆయనది చీమకు కూడా అపకారం చేయని మనస్తత్వం. అలాంటి తను ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే.. కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అమ్మమ్మ. అదేంటో తెలుసుకుంటే.. ఆయనెందుకు ఇలా బిహేవ్‌ చేస్తున్నారో తెలిసిపోతుంది అమ్మమ్మ అని చెప్తుంది కావ్య.

మెడికల్‌ షాపులోకి వెళ్లిన కళ్యాణ్‌ అతి కష్టం మీద అబార్షన్‌ టాబ్లెట్స్‌ తీసుకుని వస్తాడు. బయటకు వచ్చి రాజ్‌కు టాబ్లెట్‌ ఇస్తూ చెడు చేసి శత్రువు అయితే పర్వాలేదు అన్నయ్యా ఇలా మంచి చేసి శత్రువు అయితేనే బాధపడాల్సి వస్తుంది అంటాడు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు.

రూంలో కావ్య పసిపిల్లల ఫోటోలు మొత్తం పేస్ట్‌ చేస్తుంది. ఇంతలో ఇంద్రాదేవి వచ్చి ఏం చేస్తున్నావో నా మనవడు ఎందుక అలా చేస్తున్నాడో తెలుసుకోమంటే రూం అంతా పోస్టర్లు వేస్తున్నావేంటి..? అంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×