E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  తన కడుపులో బేబీ మాటలు విన్న మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today November 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  తన కడుపులో బేబీ మాటలు విన్న మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:         

పిల్లలు గార్డెన్‌లో పుట్‌బాల్‌ ఆడుకుంటుంటే మిస్సమ్మ వెళ్లి కూర్చుని చూస్తుంటుంది. ఇంతలో అంజు ఆడుకోకుండా మిస్సమ్మ దగ్గరకు వస్తుంది. అంజు వచ్చి మిస్సమ్మ నీ కడుపులో బేబీ నాకు హాయ్‌ చెప్పింది తెలుసా..? అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ ఆశ్చర్యపోతుంది. నాక్కూడా నిన్న జాగ్రత్త అని చెప్పినట్టు వినిపించింది అది భ్రమ అంటావా..? అంటుంది భ్రమ కాదు నేను హయ్‌ బుజ్జి అని చెప్పగానే.. హాయ్‌ అక్కా అని నాకు చెప్పింది అని అంజు చెప్పగానే.. మిస్సమ్మ నిజమా.. అయితే ఇప్పుడు పిలువు చూద్దాం అంటుంది. నువ్వు పిలువు ఎవరికి పలుకుతుందో చూద్దాం అంటుంది అంజు.. ఓకే అంటూ మిస్సమ్మ హాయ్‌ బంగారం అని పిలుస్తుంది. బేబీ అసలు పలకదు.. ఇప్పుడు నేను పిలుస్తాను హాయ్‌ బంగారం అని పిలుస్తుంది అంజు.. బేబీ పలకదు.

దీంతో ఇది నీ కన్నా అల్లరి పిల్లలా ఉంది అని మస్సమ్మ చెప్పగానే.. ఏం కాదు నా చెల్లి చాలా మంచిది అంని అంజు అంటుంది. ఇంతలో అనంద్‌ బాల్‌ను గట్టిగా కిక్‌ కొట్టగానే.. ఆ బాల్‌ మిస్సమ్మ వైపు వస్తుంది. కడుపులో బేబీ అమ్మా బాల్‌ అంటూ చెప్తుంది. ఇంతలో బాల్‌ను అంజు పట్టుకుంటుంది. విన్నావా అంజు అని మిస్సమ్మ అడగ్గానే.. నీకు వినిపించిందా..? అని అడగ్గానే.. ఇద్దరూ హ్యపీగా ఫీలవుతారు. ఇంతలో పిల్లుల కంగారుగా పరుగెత్తుకుంటూ వస్తారు. ఆనంద్‌ బాధగా సారీ మిస్సమ్మ నీకు బాల్‌ తగల్లేదు కదా అని అడుగుతాడు. మిస్సమ్మ లేదు అనంద్‌ అని చెప్తుంది. అమ్ము కోపంగా చూసుకోవాలి కదరా..? బాల్‌ తగిలి ఉంటే మిస్సమ్మకు ఎంత ప్రాబ్లమ్‌ అయ్యుండేది.. అంటుంది. ఆకాష్‌ కూడా నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను ఇటువైపు బాల్‌ కిక్‌ చేయకురా అని అంటాడు.

Advertisement

అంజు మాత్రం గొడవ పడకండి మిస్సమ్మకు ఏం కాదు పైగా మాకు ఒక క్లారిటీ వచ్చింది అంటుంది. దీంతో అమ్ము క్లారిటీ ఏంటి అని అడగ్గానే.. అది అంటూ అంజు చెప్పబోతుంటే.. అంజు చెప్పొద్దు అంటుంది. ఎందుకు చెప్పొద్దు మిస్సమ్మ అని అంజు అడగ్గానే.. నువ్వు ఇలా చెప్తే వాళ్లు నమ్మరు మనల్ని ఆట పట్టిస్తారు అని చెప్తుంది మిస్సమ్మ. దీంతో ఆనంద్ ఏంటి  ఆ గుసగుసలు మీరు మాతో ఏంటో దాచేస్తున్నారు అంటాడు. ఏంటో చెప్పొచ్చు కదా అంజు అని ఆకాష్‌ అడుగుతాడు. ఏం లేదు మీకు చెప్పేది కాదులే.. ఇదిగో బాల్‌ మిస్సమ్మ నువ్వు ఇంట్లోకి వెళ్లు అని చెప్తుంది. అమ్ము కూడా అవును మిస్సమ్మ మళ్లీ పొరపాటున బాల్‌ తగులొచ్చు.. పైగా డాక్టర్‌ వచ్చే టైం అయింది కదా..? అని చెప్పగానే.. మిస్సమ్మ వెళ్లబోతూ కింద పడబోతుంటే.. పిల్లలు నలుగురు కలిసి మిస్సమ్మను లోపలికి తీసుకెళ్తాడు.

యమలోకంలో నుంచి అంతా చూస్తున్న ఆరు ఆశ్చర్యంగా కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడటమేంటి.. రాజు గారు అని అడుగుతుంది. దీంతో యముడు అలనాడు సుభద్ర గర్భమున ఉన్న అభిమన్యుడు అర్జునుడు చెప్పిన పద్మవ్యూహం గురించి ఆలకించలేదా బాలిక అని చెప్పగానే.. దానికి దీనికి సంబంధ ఏంటి..? అని ఆరు అడగ్గానే.. సంబంధం ఉంది. గర్భవస్త శిశువుగా ఉన్న అభిమన్యుడు పద్మవ్యూహం గురించి సగమే విని తను జన్మిచాక జరిగిన కురుక్షేత్రంలో ఆ పద్మవ్యూహంలో చిక్కకుని పరమపదించారు. నీ సొదరికి పుట్టబోయే బిడ్డ విషయంలో కూడా అదే జరగబోవుతున్నది అని యముడు చెప్పగానే.. ఏం మాట్లాడుతున్నారు రాజు గారు అని ఆరు అడగ్గానే.. ఆ బిడ్డ ఆల్పాయుష్షుతో జన్మించబోతున్నది బాలిక తనకు జీవితం లేదు. మనుగడ లేదు. భవిష్యత్తు లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ బిడ్డ పుట్టగానే గిట్టబోవుతున్నది అని యముడు చెప్పగానే.. ఆరు బాధగా లేదు రాజు గారు అలా జరగకూడదు ఆ బిడ్డ నిండు నూరేళ్లు బతకాలి నా కుటుంబం సంతోషంగా ఉండాలి అంటుంది. కానీ అలా జరగదు అని యముడు చెప్పగానే ఆరు బాధపడుతుంది.

Advertisement

కింద భూలోంకలో మిస్సమ్మను టెస్ట్‌ చేయడానికి డాక్టర్‌ వస్తుంది. డాక్టర్‌తో ఉన్న స్టెతస్కోప్‌ తీసుకుని మిస్సమ్మ తన చెవుల్లో పెట్టుకుని బిడ్డ మాటలు వింటుంది. బిడ్డ అమ్మా అంటూ పిలుస్తుంది. నేను ఉండగా నీకు ఏ కష్టం రానివ్వను అమ్మ.. నా ప్రాణం అడ్డేసైనా నీ ప్రాణం కాపాడతాను. నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలమ్మా అని చెప్తుంది. ఆ మాటలు విని మిస్సమ్మ ఎమోషనల్ అవుతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×