E-Paper
Advertisement

Tirumala Panchami Sare: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి.. తిరుమల శ్రీవారి సారె..!

Tirumala Panchami Sare: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి.. తిరుమల శ్రీవారి సారె..!
Advertisement

Tirumala Panchami Sare: శ్రీవారి ఆలయం నుండి తిరుచానూరులోని.. పద్మావతి అమ్మవారికి పంచమి సారె తుది వైభవంతో బయలుదేరింది. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, రత్నాభరణాలు, శ్రీఫలాలు, ప్రత్యేక ప్రసాదాలు ఉంటాయి. శ్రీవారి ఆశీస్సులు సమర్పణ రూపంలో తిరుచానూరుకు చేరుకోవడంతో అక్కడి మాతృదేవతకు మహాసేవ ప్రారంభమవుతుంది.

Advertisement

సారె ఊరేగింపులో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, బోర్డు సభ్యులు, ఈఓ, అదనపు ఈఓ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద సారెకు హారతులిచ్చి.. ఏనుగు అంబారీ పై వైభవంగా తిరుచానూరు పనుపు మండపం దాకా ఊరేగించనున్నారు.

సారె ఊరేగింపు తిరుచానూరులోని పసుపు మండపం చేరుకునే సరికి.. పండితులు వేద మంత్రాలతో స్వాగత పూజలు చేశారు. మండపంలో సారెకు ప్రత్యేక నైవేద్యాలు, అర్చనలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ ఈ దివ్యశోభ మరింత రమణీయంగా కనిపించింది. సాంప్రదాయ దోళలు, నాదస్వరాలు, తాళాలు ఆలపించే రూపంలో ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక తరంగాలతో నిండి పోయింది.

Advertisement

తర్వాత సారెను తిరుచానూరు ఆలయ సమీపంలోని పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి.. పద్మావతి అమ్మవారికి సమర్పించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12:10 గంటలకు కుంభలగ్నంలో జరగనున్న పంచమి తీర్థం కోసం.. తిరుచానూరులో భారీగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి పవిత్ర తీర్థం ఈ మహోత్సవానికి ప్రధాన ఆకర్షణ.

మేలుకొలుపుల్లో పాల్గొనేరు, అనేక మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి తీర్థప్రసాదం స్వీకరించడానికి వేచి ఉన్నారు. పుష్కరిణి చుట్టూ ప్రత్యేక భద్రత, జనరేటర్లు, తాగునీరు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు.

Also Read: గ్యాస్ ఛాంబర్లా మారిపోయిన ఢిల్లీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

తిరుమల–తిరుచానూరు మధ్య జరుగుతున్న పంచమి సారె ఊరేగింపు ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక. శ్రీవారి పంపే ఈ పునీత సారె అమ్మవారి చేత చేరడం, దేవాలయ సంప్రదాయాలు ప్రకారం దివ్యకల్యాణ మహోత్సవల పురస్కరంగా గొప్ప శుభసూచకం. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా టీటీడీ ఏర్పాట్లు, శోభాయాత్ర ఘన వైభవం తిరుచానూరుని ఆధ్యాత్మిక క్షేత్రంగా మారుస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×