E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  కోమాలోకి వెళ్ళిన మిస్సమ్మ 

Nindu Noorella Saavasam Serial Today November 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  కోమాలోకి వెళ్ళిన మిస్సమ్మ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:    

రణవీర్‌ బ్లాక్‌ మ్యాన్‌ వచ్చి ఇంట్లో స్మోక్‌ బాంబ్‌ వేసి వెళ్లగానే.. మిస్సమ్మ కళ్లు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడే వచ్చిన అమర్‌ మిస్సమ్మను హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. అక్కడ స్ట్రెచర్‌ మీద మిస్సమ్మను లోపలికి తీసుకెళ్తుంటే.. అంజు కంగారు పడుతుంది. మిస్సమ్మ లే మిస్సమ్మ.. అంటుంది. ఇంతలో డాక్టర్‌ వచ్చి ఏమైంది అని అడగ్గానే.. స్మోక్‌ అటాక్‌ జరిగింది డాక్టర్‌.. అన్‌ కాంసెన్స్‌ లోకి వెళ్లిపోయింది. తను ప్రెగ్నెంట్‌ కూడా అని అమర్‌ చెప్పగానే.. డాక్టర్‌ సరే నేను చూసుకుంటాను మీరు ఇక్కడే ఉండండి పేషెంట్‌ను ఐసీయూలోకి తీసుకెళ్లండి అని చెప్పగానే మిస్సమ్మను సిస్టర్స్‌ ఐసీయూలోకి తీసుకెళ్తారు.

బయట నిల్చున్న అమర్, అంజు బాధపడుతుంటే.. మనోహరి, చంభా ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇంతలో అంజు మిస్సమ్మకు ఏం కాదు కదా డాడ్‌.. కడుపులో ఉన్న బేబీకి కూడా ఏమీ కాదు కదా అని అడుగుతుంది. దీంతో అమర్‌ ఎవ్వరికీ ఏమీ కాదమ్మా నువ్వేం భయపడకు అని చెప్తాడు. దీంతో అంజు ఏడుస్తూ అమర్‌ను నాకు మిస్సమ్మ కావాలి డాడ్‌.. అలాగే చెల్లి కూడా కావాలి అని చెప్తుంది. ఇంతలో మనోహరి ఇదంతా ఆ బ్లాక్‌ మ్యాన్‌ వల్లే అమర్‌ నా మీద పగ ఉంటే నన్ను చంపాలి కానీ భాగీ మీద ఎందుకు అటాక్ చేయాలి. వాడి వల్ల భాగీ అన్యాయంగా బలి కాబోతుంది అంటూ ఏడుస్తున్నట్టు నటిస్తుంది. దీంతో అమర్‌ భాగీకి ఏమీ కాదు మనోహరి అని చెప్తాడు. దీంతో మనోహరి ఏమో అమర్‌ నాకైతే చాలా భయంగా ఉంది. పాపం భాగీ వట్టి మనిషి కూడా కాదు. కడుపుతో ఉందన్న జాలి, దయ కూడా లేకుండా చంపాలని చూశాడు. నువ్వు ఎలాగైనా వాణ్ని కనిపెట్టాలి అమర్‌. వాడు ఎవడో తెలిస్తే నేనే వాణ్ని చంపేస్తాను అంటుంది మనోహరి.

Advertisement

పక్కనే ఉన్న చంభా మాత్రం చేసిందంతా చేసి ఏమీ ఎరుగనట్టు ఓవరాక్షన్‌ చేస్తుంది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో మనోహరి ఏడుస్తూ ఒక రకంగా దీనికంతటికీ నేను కూడా ఒక  కారణమే.. నేను మీ ఇంట్లో ఉండటం వల్లే కదా ఆ బ్లాక్‌ మ్యాన్‌ నాకోసం వచ్చి భాగీ మీద అటాక్‌ చేశాడు. అమర్‌  నన్ను క్షమించు అమర్‌. భాగీకి ఏమైనా అయితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. అందుకు నన్ను క్షమించు అమర్‌.. అంటుంటే.. మేడం మీరు ఎక్కువ ఎమోషనల్‌ అవ్వోద్దు మేడం.. భాగీ మేడం గారికి ఏమీ అవ్వదు దేవుడు ఉన్నాడు.. మీరు ఇలా రండి.. రండి మేడం రండి అంటూ చంభా పక్కకు తీసుకెళ్లగానే..

మనోహరి కోపంగా అమరేంద్రను పట్టుకుని ఓదార్పు పొందుదామనుకుంటే.. ఎందుకు నన్ను పక్కకు తీసుకొచ్చావు.. అంని తిడుతుంది .దీంతో మనోహరి నువ్వు చేసే ఓవరాక్షన్‌కు అమరేంద్రకు డౌటు వచ్చిందంటే మొదటికే మోసం వస్తుంది. నువ్వు దొరికిపోతావు.. అని చంభా చెప్పగానే.. అంత ఈజీగా దొరకను ఆ మాత్రం నటించకపోతే..  అమర్‌ దృష్టిలో నేను పడను. కాసేసట్లో ఎలాగూ భాగీ చనిపోతుంది. నా యాక్టింగ్‌ డోస్‌ ఇంకా పెంచుతాను చూడు అని చెప్తూ నవ్వుకుంటుంది మనోహరి.

Advertisement

ఇంతలో డాక్టర ఐసీయూలో రిపోర్ట్స్‌ చూసి బయటకు వస్తుంది. డాక్టర్‌ను చూసిన అమర్‌ తన కండీసన్‌ ఎలా ఉంది డాక్టర్‌ అని అడగ్గానే.. పక్కనే ఉన్న రామ్మూర్తి కూడా చెప్పండి డాక్టర్‌ నా కూతురు పరిస్థితి ఇప్పుడెలా ఉంది అని అడుగుతాడు. దీంతో డాక్టర్‌ తన కండీషన్‌ చాలా క్రిటికల్‌ గా ఉంది. అని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. మనోహరి, చంభా హ్యాపీగా చూస్తుంటారు. పాసిజన్‌ గ్యాస్‌తో తన లంగ్స్‌ నిండిపోయాయి. కోమాలోకి వెళ్లిపోయారు అని డాక్టర్‌ చెప్పగానే.. అమర్‌ బాధతో డాక్టర్‌ ఏంటి మీరు చెప్పేది.. అంటూ అడగ్గానే.. డాక్టర్‌ మీకు ఇంకో విషయం చెప్పాలి. విషవాయువు ఎక్కువ పీల్చడం వల్ల తన కడుపులో ఉన్న బిడ్డలో ఎలాంటి కదలిక లేదు. ఇప్పుడు తల్లీ బిడ్డ ఇద్దరూ ప్రమాదంలో ఉన్నారు. అని చెప్పగానే.. అమర్‌ ఎమోషనల్‌ అవుతుంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×