E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ :  అమర్ చంపేందుకు డిసైడ్ అయిన మనోహరి 

Nindu Noorella Saavasam Serial Today Episode May 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ :  అమర్ చంపేందుకు డిసైడ్ అయిన మనోహరి 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  కొడైకెనాల్‌ లో ఉన్న ఎస్సై అమర్‌ దగ్గరకు వెళ్లి అరుంధతిని చంపించింది మనోహరే అని నిజం చెప్తాడు. అయితే ఈ  విషయం నేను మీ ఇంటికి వచ్చి నిజం చెప్పబోతే భాగీ మేడం వద్దని చెప్పారు. అందుకే నేను మీకు నిజం చెప్పకుండా వెనక్కి వచ్చేసి కేసు క్లోజ్‌ చేశాను అని చెప్పగానే.. అమర్ ఎంత పని చేశావు భాగీ నా కోసం మీ అక్కను చంపిన హంతకురాలిని క్షమించేశావా..? నీకు నిజం తెలిసి కూడా ఆ మనోహరిని ఇన్నాళ్లు భరిస్తున్నావా..? అని మనసులో అనుకుంటాడు. పై నుంచి చూస్తున్న గుప్త సంతోషంగా ఎట్టకేలకు అమరేంద్రకు నిజం తెలిసినది మహర్షి. ఆ దుష్టబాలికి గురించి సమస్తము అవగతం అయినది అంటూ హ్యాపీగా ఫీలవుతుంటే..

నారదుడు ఏంటి విచిత్రగుప్త అమరేంద్రుడి కంటే నీవే ఎక్కువ సంతోషిస్తున్నావు అని అడగ్గానే.. గుప్త ఈ క్షణం వరకు మేము ఎన్నో దినములుగా వేచి ఉన్నాము మహర్షి.. ఆ దుష్ట బాలిక చేసిన దురాగతములు అన్నియు ఇన్నియు కాదు. మా ప్రభువుల చేతిలో యమపాశము మా చేతిల్లో పాపుల శిక్షాసృతి ఉన్ననూ మేము నిస్సహాయులమై ఈ దుష్ట బాలిక ఘోర కృత్యములను వీక్షించవలసి వచ్చినది అని చెప్పగానే.. నారదుడు విధి రాతను మీరు మాత్రము ఏం చేయగలరు గుప్త.. అనగానే.. గుప్త కూడా మహర్షి ఇప్పుడు ఈ అమరేంద్రుడు ఏమి  చేయును. ఆ దుష్ట బాలికకు బుద్ది వచ్చేలా చేయునా..? అటులైనచో నరకము కంటే మునుపే ఆ దుష్ట బాలికకు శిక్ష పడును అరుంధతి ఆత్మ సంతోషించును అనగానే.. నారదుడు నవ్వుతాడు. దీంతో గుప్త ఎందులకు మహర్షి నవ్వుతున్నారు అని అడగ్గానే.. నారడుదు నువ్వు ఎంత అల్ప సంతోషివి గుప్త. పాపుల పాపములను లెక్కించి శిక్షలు వేయించే నువ్వు ఒక పాపికి ఈ భూలోకములోనే శిక్ష పడాలని తొందరపడుతున్నావు.. అనగానే..

Advertisement

గుప్త కోపంగా ఆ దుర్మార్గులు చేసిన పాపములు, ఘోర కృత్యములు అటువంటివి మహర్షి. అమరేంద్రకు నిజం తెలిసినది కాబట్టి ఆ బాలికకు శిక్ష తప్పదు అనగానే.. నారదుడు ప్రకృతి ధర్మం తెలిసి కూడా మైమరచి మాట్లాడుతున్నావు విచిత్రగుప్త. నేరానికి శిక్షకు మధ్య వ్యవధి ఉండును అని చెప్పగానే.. అయినచో అమరేంద్రకు నిజం తెలిసినచో ఆ మనోహరిని శిక్షించడా మహర్షి అని గుప్త అడగ్గానే.. నారదుడు వాస్తవానికి అటులనే జరగవలెను కానీ విధి సంకల్పం వేరులా ఉన్నది.. అందుకే మరోలా జరగనున్నది అని చెప్పగానే.. గుప్త ఆత్రంగా మరోలా అనినా..? ఏమి జరుగును మహర్షి అని అడుగుతాడు. దీంతో నారదుడు దుష్టులకు శిక్ష పడవలెనని మనం ఎంతగా కోరుకుంటామో ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలని ఆ దుష్టులు కోరుకుంటారు విచిత్రగుప్త అని చెప్పగానే.. గుప్త ఆశ్చర్యంగా అనినా ఆ మనోహరి తప్పించుకోబోతున్నదా..? అని అడగ్గానే.. నారదుడు కాదు తప్పు చేయబోతున్నది.. అని చెప్పగానే..

గుప్త మరలా తప్పు చేయబోతున్నదా..? ఏంటా తప్పు మహర్షి అని అడగ్గానే.. నారదుడు అవును ఆ తప్పు ఆ అమరేంద్రకు ముప్పు తీసుకురాబోతున్నది అంటూ నారదుడు చెప్పగానే.. గుప్త ఆలోచిస్తుంటాడు. కింద నిజం తెలిసిన అమర్‌ షాకింగ్‌ గా వెళ్లిపోతుంటాడు. అంతా చెట్టు పక్క నుంచి గమనిస్తున్న మనోహరి భయపడుతుంది. అమర్‌ మాత్రం ఇంట్లో జరిగిన అన్ని విషయాలు గుర్తుచేసుకుంటూ నడుచుకుంటూ వెళ్లిపోతుంటాడు. రణవీర్‌ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని స్టేషన్‌కు ఫోన్‌ చేసి రణవీర్‌తో మాట్లాడతాడు. రణవీర్‌ చెప్పు అమరేంద్ర నా వైఫ్‌ ఎవరో కనిపెట్టావా..? అని అడగ్గానే.. అమర్‌.. మనోహరే కదా నీ భార్య అని చెప్తాడు. దీంతో రణవీర్‌, పక్కనుంచి చూస్తున్న మనోహరి షాక్‌ అవుతారు. నువ్వు చాలా స్మార్ట్‌ అమరేంద్ర.. చిన్న క్లూ ఇవ్వగానే.. మొత్తం కనిపెట్టావు. ఆ మనోహరే నా భార్య.. సారీ నా ఎక్స్‌ వైఫ్‌ అని చెప్పగానే.. అమర్‌ షాక్‌ అవుతాడు.

Advertisement

ఇన్నాళ్లు నీ పక్కన ఉండి నన్ను కాపాడింది. తనను తాను కాపాడుకుంది. అంటూ రణవీర్‌ చెప్తుండగానే.. అమర్‌ నాకో విషయం తెలియాలి. మనోహరి ఎందుకు ఇదంతా చేసింది. అని అడగ్గానే.. రణవీర్‌ నిజం చెప్తాడు. సింపుల్‌ మనోహరికి నువ్వుంటే ఇష్టం కానీ నువ్వు అరుంధతిని పెళ్లి చేసుకున్నావు అప్పుడు మొదలైంది తన పగ. అంటూ అంతా చెప్తాడు రణవీర్‌. దీంతో అమర్‌ కోపంగా మనోహరిని తిడుతుంటాడు. పక్కనుంచి చూస్తున్న మనోహరి నా గురించి అంతా తెలిసిపోయింది. ఇక నువ్వు నన్ను బతకనివ్వవు.. నీతో కలిసి నేను బతకలేనప్పుడు నిన్నుఎవ్వరికీ దక్కనివ్వను నిన్ను కూడా అరుంధతి దగ్గరకు పంపిస్తాను..  అనుకంటూ కారుతో అమర్‌ను గుద్దేయడానికి స్పీడుగా వెళ్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×