E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన అమర్

Nindu Noorella Saavasam Serial Today Episode May 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: కొడైకెనాల్‌లో అరుంధతి చనిపోయిన ప్లేస్‌లో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటే అప్పుడే లారీతో వచ్చిన బాబ్జీ చెట్టును ఢీకొట్టి పడిపోవడంతో అమర్‌ వెళ్లి సేవ్‌ చేయాలని చూస్తాడు. దీంతో అరుంధతి యాక్సిడెంట్‌ వల్ల చనిపోలేదని మర్డర్‌ చేయించారని అది మనోహరి అని చెప్పి స్పృహ కోల్పోతాడు బాబ్జీ. దీంతో అమర్‌ షాక్‌ అవుతాడు. పై నుంచి అంతా గమనిస్తున్న గుప్త, నారదుడితో మహర్షి ఆ దుండగుడు దుష్ట బాలికి పేరు మాత్రమే చెప్పి స్పృహ కోల్పోయినాడు. అరుంధతి బాలికను హతమార్చినది ఆ మనోహరే అని అమరేంద్రకు అవగతం అయ్యేది ఎట్లా అని అడగ్గానే..

నారదుడు విచిత్ర గుప్త నీకు అన్నింటికీ తొందరే ఎప్పుడు ఏం జరగాలని ఉండునో అప్పుడు అలానే జరుగుతుంది అని నీకు మాత్రం తెలియదా ఏంటి..? అనగానే.. గుప్త తెలుసును మహర్షి కానీ అమరేంద్రకు ఆ కాస్త నిజం తెలిసినచో బాగుండునని నా అభిలాష అని చెప్పగానే.. వేచి చూడుము విచిత్రగుప్త అనగానే.. ఇప్పటకే చాలా ఆలస్యం అయినది మహర్షి.. ఇంకనూ ఎన్నాళ్లు వేచి చూడవలెను.. అనగానే.. విచిత్ర గుప్త మన ఆలోచనలతో విధికి ఏమాత్రం అవసరం లేదు కాలానికి గాలము ఏమాత్రం ఎవ్వరునూ వేయలేరు. ప్రవహించే కాలాన్ని అనుసరించడమే మన గమ్యం అని చెప్పగానే.. అయితే ఇంతకు ముందు మీరు చెప్పిన మలుపు ఇదేనన్నా మాట చిత్తం మహర్షి మీ వాక్కు నేను శిరసావహించెదను ఎమి జరుగునో చూచెదను అంటాడు.

Advertisement

కింద బాబ్జీ దగ్గర కూర్చున్న అమర్‌ మాత్రం ఇతను ఆరు యాక్సిడెంట్‌ గురించి మనోహరి పేరు చెప్పాడేంటి..? అసలు యాక్సిడెంట్‌కు మనోహరికి ఏం సంబంధం ఉంది అనుకుంటాడు. పక్క నుంచి అంతా గమనిస్తున్న మనోహరి కూడా ఆరుకు యాక్సిడెంట్ అయిన ప్లేస్‌కు అమర్‌ రావడం ఏంటి.. అదే స్పాట్‌లో ఆరును గుద్దిన రౌడీకి యాక్సిడెంట్‌  అవ్వడం ఏంటి..? వాడు నా పేరు చెప్పడం ఏంటి..? ఇదంతా కాకతాళీయమా..? లేకపోతే నా టైం దగ్గర పడిందా..? అనుకుంటూ మనోహరి భయపడుతుంది. ఇంతలో అమర్‌ కారులో బాబ్జీని హాస్పిటల్‌ కు తీసుకెళ్తాడు.

తర్వాత మిస్సమ్మ ఇంట్లో వెజిటేబుల్స్‌ కట్ చేస్తుంటే.. బయట హాల్లో రాథోడ్‌ పేపర్‌ చూస్తుంటాడు. అప్పుడే మిస్సమ్మ ఫోన్‌ రింగ్‌ అవుతుంది. రాథోడ్‌ మిస్సమ్మ నీకు ఫోన్‌ వస్తుంది అని చెప్పగానే.. ఎవరో చూడు రాథోడ్‌ అంటుంది మిస్సమ్మ. దీంతో రాథోడ్‌ నీ ఫోన్‌ నేను ఎలా చూస్తాను మిస్సమ్మ. అది నీ పర్సనల్ గదా.. అనగానే.. మిస్సమ్మ నాకు పర్సనల్ ఏముంటాయి రాథోడ్‌.. అయినా నాకు పర్సనల్‌ గా ఎవరు చేస్తారు. చేస్తే మా నాన్న చేయాలి. లేదంటే కరుణ చేస్తుంది. అంతే కదా అనగానే.. రాథోడ్‌ బలే దానివి మిస్సమ్మ అప్పుడప్పుడు మా సారు కూడా చేయోచ్చు నీకు ఫోన్‌ అనగానే.. మిస్సమ్మ బయటకు వస్తూ.. ఆయన నాకెందుకు చేస్తారు. చేస్తే ఆ మనోహరికి చేస్తారు కానీ అంటూ వచ్చి ఫోన్‌ చూసి షాక్‌ అవుతుంది. ఆశ్చర్యంగా గట్టిగా  రాథోడ్‌ రాథోడ్‌.. అంటూ పిలవగానే..

Advertisement

రాథోడ్‌ కంగారు పడుతూ ఏమైంది మిస్సమ్మ.. అంటూ దగ్గరకు వెళ్లగానే.. ఫోన్‌ నెంబర్‌ చూడు రాథోడ్‌ అంటూ చూపించగానే.. రాథోడ్‌ సారు నెంబరూ.. అంటాడు. మిస్సమ్మ కూడా ఆయన నాకు ఫోన్‌ చేస్తున్నాడు అని చెప్పగానే.. అదే కదా నేను చెప్పింది. అరుంధతి మేడం జ్ఞాపకాలను తలుచుకోవడానికి వెళ్లిన సారుకు నువ్వు గుర్తొచ్చావు అంటే అబ్బబ్బా ఇది చాలా మంచి విషయం మిస్సమ్మ ఎత్తేయ్‌ ఎత్తేయ్‌ పోన్‌ ఎత్తి మాట్లాడు అంటాడు. మిస్సమ్మ కాల్ లిఫ్ట్‌ చేస్తుంది. అమర్‌ ఎక్కడున్నావు భాగీ అని అడగ్గానే.. ఇక్కడే ఇంట్లో ఉన్నానండి మీరు ఎక్కడున్నారు.. మీరు, అక్క పిల్లలు ఉన్న ఇంట్లో ఉన్నారా..? అని అడగ్గానే.. అమర్‌ లేదు మీ అక్కకు ప్రమాదం జరిగిన స్పాట్‌కు వచ్చాను. తను ఆఖరి క్షణాలు గడిపింది.. చివరి క్షణాలు ఇక్కడే కదా..? ఇందాక ఇక్కడే ఒక డ్రైవర్‌కు ప్రమాదం జరిగింది. అంటూ అరుంధతికి జరిగిన యాక్సిడెంట్‌ గురించి చెప్తుంటాడు అమర్‌. అమర్ మాటలకు మిస్సమ్మ షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

 

 

 

 

 

Image Credit By: ZEE5

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×