// // Today Horoscope in Telugu: - రాశి ఫలితాలు మే 04: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం - నిరుద్యోగులకు కొత్త అవకాశాలు -->
E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 04: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – నిరుద్యోగులకు కొత్త అవకాశాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 04: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – నిరుద్యోగులకు కొత్త అవకాశాలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  మే 04వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.  ఉద్యోగాలలో ఆశించిన హోదాలు పొందుతారు. 

వృషభం

Advertisement

ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తు వాహన లాభాలు ఉన్నాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. 

మిథునం

పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. 

కర్కాటకం

Advertisement

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ఆలోచనలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

సింహం

సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పని చేసి ప్రశంసలు అందుకుంటారు. 

కన్య

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

వృశ్చికం

వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాలలో కొంత గంధరగోళ పరిస్థితులుంటాయి. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. 

ధనుస్సు

స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. చేపట్టిన పనులు చకచకా పూర్తి అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  

మకరం

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. 

కుంభం

ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఒత్తిడి అధికమైన నిదానంగా పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

మీనం

స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  దూరప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×