E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today May 16th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టిన మను –  వినోద్‌ను కొట్టబోయిన అమర్‌

Nindu Noorella Saavasam Serial Today May 16th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టిన మను –  వినోద్‌ను కొట్టబోయిన అమర్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode : రణవీర్‌తో కలిసి ట్రస్ట్‌ కు వెళ్లిన అమర్‌ అక్కడి ఫైల్స్‌ అన్ని చెక్‌ చేస్తుంటాడు. ఇంతలో రణవీర్‌కు మనోహరి ఫోన్‌ చేస్తుంది. రణవీర్‌ తన ఫ్రెండ్‌తో మాట్లాడినట్టు కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అంటాడు. మనోహరి ఎక్కడున్నారు అని అడుగుతుంది. అమర్‌ ను ఆఫీసుకు వెళ్లకుండా ఆపమని చెప్పాను ఆపావా..? అని మనోహరి అడుగుతుంది. దీంతో రణవీర్‌ చెప్పా కదరా..? నా ఫ్రెండ్‌ హైదరాబాద్‌ నుంచి వస్తే.. ఆఫీసు వరకు వెళ్తానని ఇప్పుడే ఇక్కడికి వచ్చాము అంటాడు. మనోహరి భయపడుతూ ఆఫీసులో ఉన్నారా..? ఫ్లీజ్‌ రణవీర్‌ ఏదో ఒకటి చేసి అమర్‌ ఆ నిజం తెలుసుకోకుండా చేయ్‌ అంటుంది. దీంతో రణవీర్‌ ఏంట్రా ఎన్ని సార్లు చెప్పాలి.. నాకు చేతనైనంత సాయం చేస్తున్నాను. అలా అని నువ్వు అన్నింటికీ నా మీదే ఆధారపడితే ఎలా చెప్పు అంటాడు. దీంతో మనోహరి ఫ్లీజ్‌ రణవీర్‌ ఈ ఒక్కసారికి హెల్ప్‌ చేయ్‌.. నాకు నీకు పెళ్లి జరిగిపోయిందని అమర్‌కు తెలిస్తే. ఇక  అమర్‌ నన్ను ఎప్పటికీ నమ్మడు అంటూ భయపడుతుంది. దీతో రణవీర్ నీ ప్రాబ్లమ్‌ నాకు అర్థం అవుతుందిరా కానీ నేను ఇప్పుడు ఏమీ చేయలేను.. నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను.. నన్ను డైవర్ట్‌ చేయకు.. అర్థమైందా..? నన్ను డైవర్ట్‌ చేయకు బై అంటూ కాల్ కట్‌ చేస్తాడు రణవీర్‌.

మనోహరి భయంతో ఎదో ఒకటి చేయాలని అమర్‌ కు నిజం తెలిస్తే ఇప్పుడు ఎలా ఆపాలి… అమర్‌ను డైవర్ట్ చేయాలి. ఇక్కడ ఇంట్లో ప్రమాదం జరిగితే అక్కడ అమర్‌ పరుగెడతాడు.. ఇంట్లో ఎవరి ప్రాణాల మీదకు వస్తే అమర్‌ పరుగెడతాడు.. అని ఆలోచిస్తుంటే టెర్రస్‌ మీద బట్టలు ఆరేస్తున్న మిస్సమ్మ కనిపిస్తుంది. దీంతో మిస్సమ్మను చంపాలనుకుంటుంది మనోహరి. భాగీ నా ప్రేమ కోసం నువ్వు ప్రాణ త్యాగం చేయక తప్పడం లేదు అని మనసులో అనుకుంటుంది. మరోవైపు ఆఫీసులో తమకు పెళ్లి అయిన డ్యాకుమెంట్‌ను రణవీర్‌ మార్చేస్తాడు. అమర్‌ ఎంత వెతికినా డ్యాకుమెంట్‌ దొరకదు.  ఇంతదూరం వచ్చినా కూడా ఒక్క ఆధారం దొరకలేదు అంతా వృథా అయింది కదా సార్‌ అంటాడు రాథోడ్‌.

Advertisement

అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. అమర్‌ కు అనుమానం వచ్చి మళ్లీ ఆగిపోతాడు. సామూహిక వివాహాలు జరిగినప్పుడు వీడియో తీస్తారు కదా.. అది ఉందా అని అడుగుతాడు. ఉందని చెప్తాడు ట్రస్ట్‌ చెందిన వ్యక్తి. అయితే అది చూపించండ అని అమర్‌  అడగ్గానే సరే చూపిస్తాను కూర్చోండి సార్‌ అంటాడు. అతను వీడియో ప్లే చేస్తుంటాడు. అమర్‌ వాళ్లు అందరూ కూర్చుని వీడియో చూస్తుంటారు. ఇంతలో రణవీర్‌ లాయర్‌ దగ్గరకు వెళ్లి మెల్లగా రణవీర్‌ మీ పెళ్లి వీడియో వచ్చేస్తుంది. ఈలోపు ఏదో ఒకటి చేయ్‌ అని చెప్తాడు. దీంతో రణవీర్‌ ఏం చేసినా.. అమర్‌కు అనుమానం వచ్చేస్తుంది. మనోహరే ఏదో ఒకటి చేయాలి అని చెప్తాడు. మరోవైపు మనోహరి.. మిస్సమ్మ డాబా మీద బట్టలు ఆరేస్తుంది. అక్కడికి వెళ్లి దూరం నుంచి కింద ఆయిల్‌ పోస్తుంది. అక్కడ నడుస్తూ వచ్చిన మిస్సమ్మ స్టెప్స్‌ మీద నుంచి కింద పడిపోతుంది. గార్డెన్‌లో ఉన్న యముడి యమపాశం ఆ ఇంటిలోకి వెళ్తుంది. అది చూసిన గుప్త, విచిత్రగుప్త షాక్‌ అవుతారు.

కిందపడిపోయిన మిస్సమ్మ గట్టిగా అరుస్తుంది. భాగీ అరుపులా ఉందేంటి అని పరుగెత్తుకుని వెళ్లిపోతుంది. మరోవైపు కోల్ కతాలో ఉన్న అమర్‌కు నిర్మల ఫోన్‌ చేస్తుంది. అమర్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేసి అమ్మ ఎందుకు కంగారు పడుతున్నావు.. ఏమైంది అమ్మా.. హలో నాన్నా ఏమైంది..? అవునా..? ఎప్పుడు జరిగింది..? అని అడుగుతుంటే రణవీర్‌ సిస్టమ్‌ను పార్వార్డ్‌ చేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది అంటూ మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము.. రాథోడ్‌ మనం వెంటనే ఇంటికి వెళ్లాలి టికెట్స్‌ బుక్‌ చేయ్‌ అంటాడు. రణవీర్‌ ఏమైంది అమరేంద్ర గారు ఏం జరిగింది అని అడుగుతాడు. ఏమీ మాట్లాడకుండా అమర్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Advertisement

హైదరాబాద్‌ వచ్చిన అమర్‌ మిస్సమ్మకు హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. డాక్టర్లు అవుటాప్‌ డేంజర్‌ అని చెప్తారు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచిస్తారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. తర్వాత వినోద్‌ హాల్ లో కూర్చుని ఉండగా.. నిర్మల, శివరాం వస్తారు. ఇంట్లో పెద్ద ప్రమాదం జరిగింది నాన్నా అని నిర్మల చెప్పగానే వినోద్‌ ఉలిక్కిపడి లేస్తాడు.  అవునా పిల్లలు ఎక్కడ..? అన్నయ్యకు ఏం కాలేదు కదా..? అంటూ అడగ్గానే నిర్మల అందరూ బాగానే ఉన్నారు నాన్నా..? మీ వదినే కాలు జారి పడిపోయింది అని చెప్తుంది. శివరాం కూడా ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా వెళ్లి వదినతో మాట్లాడిరా..? అని చెప్తాడు.

దీంతో వినోద్‌ నెగ్లెక్ట్‌ గా తర్వాత మాట్లాడతానులే నాన్నా అంటాడు. దీంతో నిర్మల కోపంగా అసలు భాగీ ఏం చేసిందనిరా అంత కోపంగా ఉన్నావు అని అడుగుతంది. దీంతో వినోద్‌ కోపంగా అన్నయ్యను మోసం చేసి పెళ్లి చేసుకుంది. వదిన స్థానాన్ని తీసేసుకుంది. కొన్ని రోజులు ఉంటే అందరూ  వదినను అన్నయ్య మర్చిపోయేలా చేసి పిల్లలను అన్నయ్యకు దూరం చేస్తుంది. ఇదే కదా ఆవిడ ప్లాను అంటాడు. అంతా విన్న అమర్‌ కోపంగా వినోద్‌ అంటూ వెళ్లి కొట్టబోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×