E-Paper
Advertisement

OTT Movie : సమాధులు తవ్వుకుని బయటకొచ్చే శవాలు… ఇదెక్కడి ఊరురా సామీ

OTT Movie : సమాధులు తవ్వుకుని బయటకొచ్చే శవాలు… ఇదెక్కడి ఊరురా సామీ
Advertisement

OTT Movie : పరానార్మల్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. స్టోరీలు ఎన్ని వచ్చినా, కొన్ని స్టోరీలు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. ఇందులో ఎప్పుడో చనిపోయిన వాళ్ళు, మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తుంటారు. ఈ వెబ్ సిరీస్ చివరివరకూ ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో వచ్చే ట్విస్ట్ లు ఊహకందని విధంగా ఉంటాయి. ఒక్కసారి మొదలు పెడితే , సిరీస్ మొత్తం ఆపకుండా చూస్తూనే ఉంటారు. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే 

Advertisement

విక్టోరియా సిటీలో ఉన్న యూరానా ప్రాంతంలో, ఒక పోలీసు అధికారి జేమ్స్ హేస్ నైట్ డ్యూటి చేస్తుంటాడు. ఒక స్మశానంలో ఆరుగురు వ్యక్తులు నగ్నంగా ఉన్న స్థితిలో తిరుగుతున్నట్లు చూస్తాడు. ఈ వ్యక్తులు అందరూ గతంలో చనిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో బతికి ఉంటారు. వీళ్ళను ‘రైజెన్’లు అని పిలుస్తారని తెలుసుకుంటాడు జేమ్స్. వీరిలో జేమ్స్ భార్య కేట్ కూడా బతికి ఉంటుంది. ఇప్పుడు జేమ్స్ వీళ్ళను గమనిస్తూ గందరగోళ పరిస్థితిలో చిక్కుకుంటాడు. జేమ్స్, స్థానిక డాక్టర్ ఎలిషియా సహాయంతో, ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. రైజెన్‌లు తమ గత జీవితాల గురించి కొన్ని జ్ఞాపకాలను మాత్రమే కలిగి ఉంటారు.

అయితే చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చారు, ఎలా వచ్చారు అనేది మాత్రం జేమ్స్ కి అర్థం కాకుండా ఉంటుంది. వాళ్ళు యూరానా పట్టణం సరిహద్దులను దాటితే మళ్లీ చనిపోతారని జేమ్స్ కి తెలుస్తుంది. అందుకే ‘రైజెన్’లు ఎక్కడికీ పోకుండా, యూరానా పట్టణంలోనే ఉండిపోతారు. ఇంకా కొంతమంది ‘రైజెన్’లు పుట్టుకొస్తుంటారు.  చివరికి జేమ్స్ ఈ రహస్యాలను కనిపెడతాడా ? రైజెన్ గా మారిన తన భార్యను ఏం చేస్తాడు ? దీని వెనుక ఎటువంటి శక్తులు ఉన్నాయి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ పరానార్మల్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : ఒంటిపై నూలు పోగు లేకుండా కుప్పలుగా శవాలు… బ్లాక్ మ్యాజిక్ తో వణుకు పుట్టించే హర్రర్ థ్రిల్లర్

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో

ఈ ఆస్ట్రేలియన్ పరానార్మల్ వెబ్ సిరీస్ పేరు ‘గ్లిచ్’ (Glitch). దీనిని టోనీ ఐరెస్, లూయిస్ ఫాక్స్ కలసి రూపొందించారు. చనిపోయిన ఏడుగురు వ్యక్తులను ఈ సిరీస్ అనుసరిస్తుంది. గ్లిచ్ ABC లో 2015 జూలై లో విడుదలైంది. 2016 AACTA అవార్డ్స్‌లో దీనికి ఉత్తమ టెలివిజన్ డ్రామా సిరీస్ అవార్డు లభించింది. 2015 నుండి 2019 వరకు మొత్తం 3 సీజన్స్ వచ్చాయి. ఈ మూడు సీజన్లు అనేక మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా సాగుతాయి. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులోకి వచ్చింది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×