E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ విషయంలో మిస్సమ్మకు మనోహరి వార్నింగ్‌   

Nindu Noorella Saavasam Serial Today Episode May 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ విషయంలో మిస్సమ్మకు మనోహరి వార్నింగ్‌   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని భోజనం చేస్తుంటారు. అమర్‌కు కూడా భోజనం చేస్తుంటాడు. మిస్సమ్మ అందరికీ వడ్డిస్తుంది. ఇంతలో అమర్‌ మీరెవరు..? నాకు ఏమవుతారు..? ఈ పిల్లలందరూ ఎవరు..? నాకు వీళ్లకు ఏంటి సంబంధం..? అని అడగ్గానే.. అందరూ ఒక్కసారిగా షాక్‌ అవుతారు.. ఏం చెప్పాలో తెలియక మిస్సమ్మ అయోమయంగా చూస్తుంటుంది. రాథోడ్‌ బాధగా మనసులో భగవంతుడా కట్టుకున్న భార్యను కన్నబిడ్డలను కూడా సారు గుర్తు పట్టలేకపోతున్నారు అని బాధపడతాడు. అమర్‌ మాత్రం చెప్పండి నాకు ఈ ఇల్లు కొత్తగా ఉంది. మీరంతా అపరిచితులుగా ఉన్నారు అంతా అయోమయంగా ఉంది అంటూ అడగ్గానే.. మిస్సమ్మ చాలా కూల్ గా ఓ రెండురోజులు అయ్యాక మెల్లగా అన్ని  విషయాలు చెబుతాం. ఇప్పుడు భోజనం చేయండి అంటూ ఏడుస్తుంటే..

అమర్‌ చూసి మీ కళ్లల్లో నీళ్లు ఎందుకు వస్తున్నాయి.. మీరు ఏడుస్తున్నారా..? మీరు అందరూ ఎందుకు బాధపడుతున్నారు ఏం జరిగింది అని అడుగుతాడు. దీంతో మిస్సమ్మ ఏం లేదండి మీరు భోజనం చేయండి అనగానే.. అమర్‌ సరే మీరు కూడా తినండి అంటూ భోజనం చేయబోతుంటే.. మనోహరి వచ్చి అమర్‌ చేయి పట్టుకుని తినడం ఆపేస్తుంది. దీంతో మిస్సమ్మ కోపంగా  ఏం చేస్తున్నావు మనోహరి తింటున్న ఆయన్ని ఆపేస్తావా..? అని అడగ్గానే.. నువ్వు ఏం చేస్తున్నావు భాగీ.. అమర్‌కు ఏం పెడుతున్నావు.. అని మనోహరి అడగ్గానే.. రాథోడ్‌ సార్‌ రోజూ ఈ ఫుడ్డే తింటున్నారు కదా మేడం అంటాడు. దీంతో మనోహరి కోపంగా ఇన్ని రోజులు వేరు ఇప్పుడు అమర్‌ స్పెషల్ ఫుడ్‌ తినాలి అని చెప్పగానే.. అమర్‌ స్పెషల్‌ ఫుడ్డా..? అనగానే.. మనోహరి అవును అమర్‌ నీకోసం స్పెషల్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేశాను. నువ్వు అదే తినాలి. పద అమర్‌ అంటూ అమర్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లబోతుంటే.

Advertisement

అమర్‌ ఒక్కనిమిషం అసలు నేను ఎవర్ని.. నా పేరేంటి..? అని అడగ్గానే.. మనోహరి నీ పేరు అమరేంద్ర నువ్వు ఆర్మీలో పెద్ద ఆఫీసర్‌వి.. అని చెప్పగానే.. మరి ఈ ఇల్లు ఎవరిది..? వీళ్లంతా ఎవరు..? నాకు ఏమవుతారు..? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను..? నా ఇల్లు నా వాళ్లు ఎక్కడ..? అంటూ అడగ్గానే.. మనోహరి నీకు ఏమీ గుర్తు లేదా అమర్‌ అని అడగ్గానే.. అమర్‌ లేదు నాకు అంతా అయోమయంగా ఉంది. అని చెప్పగానే నేను కూడా గుర్తు లేనా..? అమర్‌ అని మనోహరి అడగ్గానే.. మీరు మనోహరి అని నాకు బాగా కావాల్సిన వాళ్లు అని చెప్పారు కదా..? అనగానే.. మనోహరి హ్యాఫీగా ఫీలవుతుంది. ప్రస్తుతానికి నీకు తెలిసిన ఈ రెండు విషయాలు చాలు అమర్‌.. మిగతా విషయాలు తర్వత చెప్తాను అంటూ మనోహరి చెప్పగానే.. అమర్‌ కోపంగా నాకు ఇప్పుడే తెలియాలి. అసలు ఈ ఇల్లు ఎవరిది…? వీళ్లంతా ఎవరు..? నాకు వీళ్లకు ఏంటి సంబంధం…? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను..? నాకు ఏం జరిగింది..? నా తల బద్దలయిపోతుంది. పిచ్చిపట్టినట్టు అవుతుంది. తలలో బాగా నొప్పి.. మెదడులో రక్తం పోటెత్తుతుంది.. అంటూ తల పట్టుకుని కింద పడబోతుంటే..

రాథోడ్‌ పట్టుకుని సార్‌ మీకేం కాదు సార్‌ కాసేపు రెస్ట్ తీసుకోండి.. అంటూ అమర్‌ను తీసుకుని పైన రూంలోకి వెళ్తాడు రాథోడ్‌. దీంతో మనోహరి కోపంగా ఇలా జరుగుతుందనే.. మీరెవరూ..? అమర్‌ దగ్గరకు రాకూడదని చెప్పాను. ఇప్పుడు చూడండి మీవల్ల అమర్‌ నరకయాతన పడుతున్నారు. తలలో నరాలు చిట్లిపోయి చనిపోతే మీరు బాధ్యత తీసుకుంటారా..? అనగానే మిస్సమ్మ కోపంగా మనోహరి అంటుంది. దీంతో మనోహరి కూడా మరింత కోపంగా నా మీద అరవడం కాదు. అమర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్‌ చెప్పారు కదా..? అమర్‌ బాధ్యత నాది తనకు గతాన్ని గుర్తు చేయకండి.. పిల్లలు మీక్కూడా చెప్తున్నాను. మీకు మీ డాడీ కావాలి అనుకుంటే ఆయనకు దూరంగా ఉండండి.. దగ్గరకు వచ్చారో మీకు ఆయన దక్కడు.. జాగ్రత్త అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది మనోహరి. అందరూ బాధగా చూస్తుండిపోతారు.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×