E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి చిట్కాలు చెప్పిన మిస్సమ్మ 

Nindu Noorella Saavasam Serial Today march 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి చిట్కాలు చెప్పిన మిస్సమ్మ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: పొద్దున్నే నిద్ర లేచిన మనోహరి అద్దంలో తనను తాను  చూసుకుంటూ పొగుడుకుంటుంది. ఎంత అందంగా ఉంటే ఏం లాభం.. ఇంత అందం ఇన్నాళ్లుగా అడవి కాచిన వెన్నెల అవుతుంది. అమరేంద్రతో నీ పెళ్లి ఎప్పుడు అవుతుందో ఏంటో..? అనుకుంటూ ఉండగా మిస్సమ్మ గుడ్‌మార్నింగ్‌ మనోహరి అంటూ వస్తుంది. గుడ్‌ మార్నింగ్‌ భాగీ ఏంటవి గంధమా…? అని అడగ్గానే… అందాన్ని పెంచే సుగంధం.. చర్మాన్ని నిగనిగలాడించే దివ్య ఔషధం.. వయసును తగ్గించే అమృతం అని చెప్పగానే.. మనోహరి నవ్వుతూ వీటిలో అన్ని క్వాలిటీస్‌ ఉన్నాయా.? అని అడగ్గానే.. మిస్సమ్మ ఇవి ఆయుర్వేదంతో చేసినవి.. ఇన్నాళ్లు నేను ఇవే వాడుతున్నాను.. అని చెప్పగానే..

మనోహరి అందుకేనా నీ ఫేస్‌ అంతలా వెలిగిపోతుంది అని అడగ్గానే.. మిస్సమ్మ కూడా మరి నా చర్మం నిగారింపుకు నా అందం రెట్టింపుకు కారణం ఇవే అని చెప్పగానే.. మనోహరి అనుమానంగా అవును ఇవి నా దగ్గరకు ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ ఈ మధ్య నీ ఫేస్‌ బాగా టాన్‌ అయిపోయింది మనోహరి. స్కిన్ కూడా కొంచెం బ్లాక్ అయింది. వీటిని అప్లయ్‌ చేస్తే పాత స్కిన్‌ పోయి కొత్త స్కిన్‌ వస్తుంది. టాన్‌ అంతా పోయి ముఖంలో మెరుపు వస్తుంది. అని చెప్పగానే.. మనోహరి సంతోషంగా థాంక్యూ భాగీ నా మీద నీకు అంత ప్రేమ ఉన్నందుకు.. నీ చేతులతోనే నాకు ఇవి అప్లయ్‌ చేయవా..? అని అడగ్గానే.. మిస్సమ్మ అది నాకు కొంచెం పనుంది యాదమ్మతో చేయించుకో మనోహరి.. యాదమ్మ.. అంటూ పిలవగానే.. యాదమ్మ వస్తుంది. ఏంటండి పిలిచారు అని అడగ్గానే.. ఇదిగో ఈ పొడులతో మనోహరి గారి ఫేస్‌కు ఫ్యాక్‌ పెట్టు.. ఆ లిక్విడ్‌ ను మాత్రం టచ్‌ చేయకే అని చెప్పగానే.. ఫేస్‌ ఫ్యాక్‌లు పెట్టడానికి నేనేం బ్యూటిషియన్‌ కాదమ్మ అని యాదమ్మ చెప్పగానే..

Advertisement

అదేం బ్రహ్మవిద్య కాదమ్మ.. మనోహరి కోసం ఆ మాత్రం చేయలేవా… ఎప్పుడూ తన కూడా ఉంటావు… తన అందంపై నీకు శ్రద్ద బాధ్యత లేదా..? అని ప్రశ్నిస్తుంటే.. మనోహరి కోపంగా యాదమ్మ చేస్తుందిలే భాగీ.. అని చెప్పగానే. యాదమ్మ ఎలా చేయాలి అని అడుగుతుంది. దీంతో ఏముంది..? ఈ పొడి తీసుకుని అంటూ ఎలా చేయాలో చెప్తుంది మిస్సమ్మ. దీంతో మిస్సమ్మ చెప్పేది అర్థం కాక ఇంకొక్కసారి మళ్లీ చెప్పరా..? అని అడగ్గానే.. ఏంటి యాదమ్మ మరీ నీది మట్టిబుర్రనా..? మనోహరి నీకు అర్థం అయిందా..? అని అడగ్గానే.. లేదు నాకు అర్థం కాలేదు భాగీ అంటుంది మనోహరి. దీంతో మిస్సమ్మ మరోసారి చెప్తుంది.. అర్థం కాకున్నా అయినట్టు ఓకే అంటారు.. మనోహరి, యాదమ్మ.. ఇంతలో మిస్సమ్మ అరగంటలో ఆయన రెడీ అయి కిందకు వస్తారు.. ఈ లోపు నువ్వు ఫేస్‌ ఫ్యాక్‌ పెట్టి పది నిమిషాల తర్వాత వాష్‌ చేసి మెరిసిపోయే ముఖంతో ఆయనకు కనిపించు ఇట్టే పడిపోతారు.. అని చెప్పగానే..

మనోహరి హ్యాపీగా థాంక్స్‌ భాగీ.. అవును ఇన్ని రోజులు ఈ ఐడియా నాకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు అని అడగ్గానే.. నిజంగా చెప్పాలంటే.. ఇది నా బ్యూటీ సీక్రెట్‌.. ఎవ్వరికీ చెప్పకూడదు.. కానీ నిన్న నువ్వు బాధపడుతుంటే నైట్‌ నా అంతరాత్మ నా కలలోకి వచ్చి మనోహరికి అసలు నువ్వేం చేశావు అని నిలదీసింది. మనోహరికి ఏం చేయాలో అది చేయమని హెచ్చరించింది అందుకే పొద్దున్నే ఇలా ఇవి తీసుకుని వచ్చాను.. ఆల్‌ ది బెస్ట్‌ మనోహరి.. యాదమ్మ కేర్‌ ఫుల్‌ మనోహరి అందం నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను.. జాగ్రత్త అంటూ వెళ్లిపోతుంది మిస్సమ్మ.. మనోహరి మాత్రం చూశావా చంభా భాగీకి నేను అంటే ఎంత శ్రద్ద నాకు ఇచ్చిన మాట కోసం పిచ్చిది తన భర్తకు నాకు ఇచ్చేస్తుంది అని చెప్పగానే.. యాదమ్మ మనసులో పిచ్చిది తను కాదు నువ్వు అనుకుంటుంది..  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×