E-Paper
Advertisement

Telangana Roads: 2028 నాటికి రాష్ట్రంలో కల్లు చెదిరేలా అద్భుతమైన రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి!

Telangana Roads: 2028 నాటికి రాష్ట్రంలో కల్లు చెదిరేలా అద్భుతమైన రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి!
Advertisement

Telangana Roads: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో 2028 జూన్‌ నాటికి దేశంలో రోడ్లు అంటే అందరూ తెలంగాణ వైపునకు తిరిగి చూసేలా అద్భుతమైన రోడ్లను నిర్మిస్తామని తెలంగాణ రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ వేదికగా ప్రస్తుతం జరగుతున్న సమావేశాల్లో భాగంగా బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి ప్రతిపక్ష శాసన సభ్యులకు సమాధానమిస్తూ.., తాము పునరుద్ధరిస్తున్న అభివృద్ధి పనులకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధన్యవాదాలు తెలపాలని సూచించారు. తమ సాధారణ బడ్జెట్‌ తక్కువగా ఉందని, దీనికి తోడు తమ శాఖకు ఉన్న రూ.4,600 కోట్ల బకాయిలను కొద్దికొద్దిగా చెల్లిస్తూ వస్తున్నామన్నారు. కొంచెం ఆలస్యమైనా సరే కానీ ఎవరూ ఉహించనంత నాణ్యమైన రోడ్లను నిర్మించి తీరుతామని మంత్రి హామీ ఇచ్చారు.

కేంద్రానికి అనుసంధానం

జనగామతో పాటు శాసన సభ్యుడు హరీశ్ రావు సూచించిన సిద్దిపేట రింగు రోడ్డుతో పాటు గజ్వేల్‌ రింగురోడ్లు పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసినా.. తాము వాటిని పూర్తి చేస్తామన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించామని, ఈ ప్రణాళికలకు సంబంధించి టెక్నికల్‌ ఎవల్యూషన్‌ పూర్తయిపోయిందని తెలిపారు. అవి రాగానే ఫైనాన్స్ బిడ్‌ ఓపెన్‌ చేసి పనులు ప్రారంభిస్తామని మంత్రి స్పష్టంచేశారు. తప్పకుండా ప్రతీ రోడ్డు మండల కేంద్రానికి అనుసంధానం చేసేలా, సీఆర్‌ఎంలో రూ.35 కోట్లు కేటాయించామన్నారు. సిద్దిపేట, జనగామ రోడ్డుతో పాటు మధ్యలో దుబ్బాక లింక్‌ రోడ్లు సైతం ఇందులో భాగమేనని తెలిపారు. ఈ పనులకు సంబంధించిన ప్రైస్‌ బిడ్‌ ఈ నెలాఖరులోగా మొదలుపెట్టి అన్ని రోడ్లు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement

Also Read: Minister Sridhar Babu: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో మాటల యుద్ధం.. కేటీఆర్‌కు శ్రీధర్ బాబు కౌంటర్

మిగిలిన రోడ్లకు కూడా టెండర్లు

రూ.4 వేల కోట్లు ప్రొవిజన్‌లో ఉందని, అవి కూడా ఇందులో వినియోగిస్తామన్నారు. 8 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన హ్యామ్‌ మోడల్‌లోనే, అవే గైడ్‌ లైన్స్‌తోనే ఈ రోడ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణే అడ్వాన్స్‌గా ఉందని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. మిగిలిన రోడ్లకు కూడా టెండర్లు పిలుస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోడ్లు రెండు, మూడేళ్లకోసారి మళ్లీ, మళ్లీ రిపేర్లు చేసేలా కాకుండా దాదాపు 15 ఏళ్ల మెయింటెనెన్సుతో శాశ్వత పరిష్కారంలా రూపొందిస్తున్నామని వెల్లడించారు. అమోదించిన 15 రోజుల్లో పనులు మొదలు పెడుతామని, ఈ పనుల్లో చిట్యాల నుంచి భువనగిరి రోడ్డు కూడా ఉంటుందని, దీని కోసం హ్యామ్‌లో రూ.300 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

Advertisement

Also Read: Crime Thriller OTT: 36 ఎపిసోడ్లు ఆరు సీజన్లతో దుమ్ములేపిన సిరీస్… బ్లేడ్ బ్యాచ్ నుంచి గ్యాంగ్స్టర్ దాకా

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×