E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అంజును కిడ్నాప్ చేసేందుకు రణవీర్ రెడీ

Nindu Noorella Saavasam Serial Today march 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అంజును కిడ్నాప్ చేసేందుకు రణవీర్ రెడీ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్‌ లాయరు కలిసి అమర్‌ ఇంటి ముందు కారు ఆపేస్తాడు. లాయరు నవ్వుతూ ఇందాకే అనాథ ఆశ్రమం పిల్లలు లోపలికి వెళ్లారు సార్‌ కాసేపట్లో హోలీ సంబరాలు స్టార్ట్‌ అవుతాయి అని చెప్పగానే.. సంబరాలు స్టార్ట్‌ అవ్వగానే.. నేను లోపలికి వెళ్లి అంజు పాపను ఎత్తుకొస్తాను అని రణవీర్‌ చెప్పగానే.. లాయరు కంగారుగా ఎలా సార్‌ అమర్ చూస్తే మిమ్మల్ని గుర్తు పడతారు కదా..? అని అడుగుతాడు. దీంతో రణవీర్‌ రంగుల పండుగలో రంగులు పూసుకుని వెళితే ఎవరు గుర్తుపడతారు లాయరు. ఈ హోళీ మనకు బాగా కలిసి వచ్చింది అని చెప్పగానే.. లాయరు భయంగా సార్‌ అమరేంద్రను తక్కువ అంచనా వేయకండి.. బయటి నుంచి ఎవరు వచ్చినా ఈజీగా కనిపెట్టేస్తారు అని చెప్పగానే..

రణవీర్‌ అందుకేగా ఇంకో సెటప్‌ కూడా రెడీ చేసి ఉంచాను అని చెప్పగానే.. లాయరు ఆశ్చర్యంగా ఇంకో సెటపా ఏంటి సార్‌ అని అడగ్గానే..రణవీర్‌ అటు చూడు అక్కడ ఒక వెహికిల్‌ ఉంది కదా..? అది మనదే అందులో కిడ్నాప్‌ కావాల్సిన అసలైంది ఉంది. దాంతోనే అంజును ఎత్తుకురాబోతున్నాను.. అని చెప్పగానే.. లాయరు ఆశ్చర్యంగా ఏంట సార్‌ అది అని అడుగుతాడు. దీంతో రణవీర్‌ ముందే చెప్తే కిక్‌ ఏముంటుంది లాయరు.. నువ్వే చూస్తావుగా అనగానే.. లాయరు ఆత్రం ఆపుకోలేక సస్పెన్స్‌ ఎందుకు సార్‌ అసలు ఆ వెహికిల్ ఓ ఏముందో చెప్పొచ్చు కదా..? అని అడగ్గానే.. రణవీర్‌ నవ్వుతూ నేను చెప్పడం కన్నా నువ్వు చూస్తేనే బాగుంటుంది లాయరు.. జస్ట్‌ వెయిట్ అండ్‌ సీ అనగానే.. లాయరు ఆ వెహికిల్‌ వైపు అనుమానంగా చూస్తుంటాడు.

Advertisement

మరోవైపు లోపల మనోహరి కోపంగా కిందకు వచ్చి మిస్సమ్మను తిడుతుంది. యాదమ్మ చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను భాగీ నీ మీద నాక్కూడా డౌటు వస్తుంది భాగీ అనగానే.. మిస్సమ్మ నన్ను అనుమానిస్తున్నావా..? మనోహరి.. నిప్పు లాంటి నాలో తప్పులు వెతుకుతున్నావా..? ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను.. ఇప్పుడే వెళ్లిపోతాను.. ఏదీ ఎక్కడ నా బ్యాగు.. ఎక్కడుంది నా లగేజీ అంటూ అటూ ఇటూ తిరుగుతుంటే వెంటనే మనోహరి.. ఆగు భాగీ నేను నిన్ను వెళ్లిపోమ్మని చెప్పలేదు.. హెల్ప్‌ చేయమన్నాను.. అనగానే.. మిస్సమ్మ కోపంగా కానీ నువ్వు నన్ను అనుమానిస్తున్నావు.. అవమానిస్తున్నావు ఇలాంటి చోట నేను ఉండలేను మనోహరి ఉండలేను.. నా వల్ల కాదు అంటుంది.

దీంతో చంభా అయితే వెళ్లిపోండి మేడం.. మనోహరి గారు ఆవిడ తిప్పలు ఆవిడ పడతారు.. అనగానే.. మిస్సమ్మ, చంభాన కోపంగా చూస్తూ. నా ఇంట్లోంచి నన్నే వెళ్లిపోమ్మంటున్నావా..? నీకు ఉందే.. అని మనసులో అనుకుంటుంది. ఇంతలో మనోహరి కోపంగా యాదమ్మ నువ్వు నోర్మూయ్‌ మధ్యలో జోక్యం చేసుకోకు అని తిడుతుంది. దీంతో చంభా ఏంటి మేడం.. భాగీ గారు లేకపోతే ఏంటి..? మీ ప్రేమను మీరు సెట్‌ చేసుకోలేరా..? అని అడగ్గానే.. ఇన్ని ఇయర్స్‌ గా ట్రై చేస్తున్నాను.. నా వల్ల అయిందా..? నా లవ్‌ సెట్‌ చేయడం భాగీ వల్లే అవుతుంది అని చెప్పగానే.. చంభా కోపంగా ఆవిడ మీ ప్రేమను సెట్‌ చేయడం లేదు.. తన లైఫ్‌ సెట్‌ చేసుకుంటుంది. అని చెప్పగానే..

Advertisement

మిస్సమ్మ కోపంగా అనేశావా.? యాదమ్మ ఆ మాట కూడా అనేశావా..? అప్పటికే అనుకుంటూనే ఉన్నాను.. నేను ఇక్కడికి వస్తే ఇలాంటి మాటలే పడాల్సి వస్తుందని అనుకున్నాను.. చూశావా..? మనోహరి యాదమ్మ నన్ను ఎంత మాట అనేసింది అంటూ బాధపడుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×