E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode June 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌ – బుజ్జమ్మకు అతీత శక్తులు

Nindu Noorella Saavasam Serial Today Episode June 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌ – బుజ్జమ్మకు అతీత శక్తులు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: బర్తుడే పార్టీలో సరస్వతి వార్డెన్‌ ను చూసిన అమర్‌ తనను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందని చెప్తాడు. దీంతో మనోహరి తాను సరస్వతి వార్డెన్‌ అని అమర్‌కు బాగా తెలుసుని చెప్తుంది. అమర్‌ అవునా.. అంటూ చెప్పగానే.. ఆవిడ నీతో ఏదో చెప్పాలట పర్సనల్‌గా మాట్లాడాలి అంటుంది అమర్‌ అంటూ మనోహరి చెప్పగానే.. అమర్‌ అయితే పక్కకు వెళ్దాం పదండి అంటూ అమర్‌ వెళ్లబోతుంటే.. మిస్సమ్మ కల్పించుకుని అందరూ వెయిట్‌ చేస్తున్నారు.. ముందు కేక్‌ కట్‌ చేసిన తర్వాత మాట్లాడండి అని చెప్తుంది. దీంతో అమర్‌ సరే అంటాడు.

అందరూ కలిసి బుజ్జమ్మ చేత కేక్‌ కట్‌ చేయిస్తారు. అమర్‌, మిస్సమ్మ కేక్ తీసి బుజ్జమ్మకు తినిపిస్తారు. పిల్లలు కూడా విష్‌ చేసి కేక్‌ తినిపిస్తారు. అప్పుడే మనోహరి వెళ్లి విష్‌ చేస్తూ కేక్‌ నోట్లో పెట్టబోతూ కింద పడేసి బుజ్జమ్మను కోపంగా చూస్తుంటుంది. బుజ్జమ్మ మాత్రం అమాయకంగా చూస్తుంటుంది. తర్వాత ఎవరి బిజీలో వాళ్లు ఉంటే బుజ్జమ్మకు గుప్త కనిపిస్తుంటాడు. బుజ్జమ్మ గుప్తను దగ్గరకు పిలుస్తుంది. గుప్త షాక్‌ అవుతాడు. నారదుడితో మహర్షి మనం ఆ బాలికకు కనిపిస్తున్నామా అని అడగ్గానే.. మనం కాదు విచిత్ర గుప్త నువ్వు ఒక్కడివే కనిపిస్తున్నావు.. వెళ్లు వెళ్లి ఆ బాలిక ఏం చేస్తుందో చూడు అంటాడు నారదుడు. నారదుడు చెప్పగానే.. గుప్త, బుజ్జమ్మ దగ్గరకు వెళ్తాడు. గుప్తకు కేక్‌ తినిపిస్తుంది బుజ్జమ్మ. దీంతో గుప్త ఎమోషనల్‌ అవుతాడు. గుప్త కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. గుప్తను ఆలా చూసిన నారదుడు ఆశ్చర్యపోతాడు. ఎప్పుడూ నరకంలో పాపులతో కర్షషంగా ఉండే నువ్వేనా విచిత్రగుప్త ఇలా ఉన్నది అంటూ అడగ్గానే.. గుప్త ఎమోషనల్ అవుతూనే.. ఆ బాలిక ప్రేమను వెలకట్టలేము కదా మహర్షి అంటాడు.

Advertisement

మరోవైపు సరస్వతి వార్డెన్‌ ను కోపంగా చూస్తున్న మనోహరి అమర్‌కు నిజం చెప్పు అంటూ సైగ చేస్తుంది. లేదంటే పిల్లలను చంపేస్తామని బెదిరిస్తుంది. దీంతో వార్డెన్‌ అమర్‌ను పిలుస్తుంది. అమర్‌ అవును మేడం ఇందాక మీరు ఏదో చెప్పాలన్నారు.. చెప్పండి మేడం అని అడుగుతాడు. దీంతో సరస్వతి తడబడుతూ నిజం చెప్పబోతుంది. మనోహరి కల్పించుకుని చెప్పండి మేడం త్వరగా చెప్పండి ఆయన దగ్గర మీకు మెహమాటం ఎందుకు..? అనగానే.. అమర్‌ కూడా మీరు ఏ విషయం అయినా ధైర్యంగా చెప్పొచ్చు అనగానే.. సరస్వతి అది సార్‌ భాగీ ఉంది కదా..? అలాగే బుజ్జమ్మ.. అంటూ ఆగిపోగానే.. అమర్‌ ఆగిపోయారు ఏంటి..? మేడం భాగీ, బుజ్జమ్మ ఏంటి..? అనగానే.. సరస్వతి మేడం బుజ్జమ్మ ఎవరో కాదు సార్‌ భాగీ కూ.. అని చెప్పబోతుండగానే.. ఆశ్రమం పిల్లలు అందరూ రాజుతో కలిసి వచ్చి బుజ్జమ్మకు బర్తుడే విషెష్‌ చెప్తారు.

పిల్లలను చూసిన సరస్వతి మేడం ఆశ్చర్యపోతుంది. రణవీర్‌, మనోహరి షాక్‌ అవుతారు. భయంతో వణికిపోతుంటారు. అప్పుడే అమర్‌ ఇందాక భాగీ, బుజ్జమ్మ అని ఏదో అంటున్నారు చెప్పండి మేడం అని అడగ్గానే.. వార్డెన్ అదేం లేదు సార్‌ భాగీ, బుజ్జమ్మ ఆశ్రమం పిల్లలను పార్టీకి పిలిచారు. వాళ్లు వస్తున్నారు అని చెప్పబోతుంటే.. వాళ్లే వచ్చేశారు అని సరస్వతి చెప్తుంది. ఇంతలో రాథోడ్‌ హ్యాపీగా అందరం డిన్నర్‌ చేద్దాం అంటాడు . అక్కడి నుంచి బయటకు వెళ్లిన రణవీర్‌ వెనకాలే మనోహరి వెళ్లి తిడుతుంది. నువ్వు కాపలా పెట్టిన రౌడీలు ఏం చేస్తున్నారు అంటూ తిడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×