E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode June 29th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఒకే రూంలో అమర్‌, మిస్సమ్మ – మనోహరిని అలెర్ట్‌ చేసిన చంభా   

Nindu Noorella Saavasam Serial Today Episode June 29th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఒకే రూంలో అమర్‌, మిస్సమ్మ – మనోహరిని అలెర్ట్‌ చేసిన చంభా   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: గుడి నుంచి ఇంటికి వచ్చిన మిస్సమ్మ, అమర్‌ ప్రవర్తనను గుర్తు చేసుకుని అనుమానిస్తుంది. అమర్‌కు గతం గుర్తుకు వచ్చినా రానట్టు నటిస్తున్నాడా..? ఏంటి..? అనుకుంటుంది. అప్పుడే అమర్‌ రూంలో బుజ్జమ్మతో కలిసి ఆడుకోవడం చూసి ఆశ్చర్యపోతుంది. ఈయనకు నిజంగానే గతం గుర్తుకు వచ్చినట్టు ఉంది లేకపోతే బుజ్జమ్మతో ఇంత హ్యాపీగా ఎందుకు ఉంటారు అనుకుంటూ కిందకు వెళ్లిపోతుంది.

కిందకు వెళ్లిన మిస్సమ్మ అప్పుడే ఇంట్లోకి కూరగాయలు తీసుకుని వచ్చిన రాథోడ్‌తో అమర్‌ గురించి అడుగుతుంది. ఆయనకు గతం గుర్తుకు వచ్చిందా..? రాథోడ్‌.. గతం గుర్తుకు వచ్చినా కూడా రానట్టు నటిస్తున్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్తుంది. అందుకు రాథోడ్‌ నీకు ఆ  అనుమానం ఎందుకు వచ్చింది మిస్సమ్మ అని అడుగుతాడు. గుడిలో ఆయన ప్రవర్తన చూస్తే.. ఇప్పుడు బుజ్జమ్మతో ఉన్న తీరు చూస్తే అనుమానం వస్తుంది అని చెప్తుంది. దీంతో రాథోడ్‌ అబ్బో ఇంకాసేపు ఉంటే నాతో నిజం చెప్పించేలా ఉంది మిస్సమ్మ. ఎలాగైనా వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని మనసులో అనుకుంటూ.. ఊరికో మిస్సమ్మ సార్‌కు గత గుర్తుకు వస్తే మీకు చెప్పకుండా ఉంటారా..? పిల్లలు, అరుంధతి మేడం గుర్తుకు రాగానే సారే చెప్పారు కదా..? ఇప్పుడు మీరు గుర్తుకు వస్తే ఎందుకు చెప్పరు అయినా మిస్సమ్మ నాకు చాలా టైం అయింది.. వెళ్తాను అంటూ రాథోడ్‌ ఎస్కేప్‌ అవుతాడు. మిస్సమ్మ మాత్రం అనుమానంగా చూస్తూనే ఉంటుంది.  రాథోడ్‌, మిస్సమ్మ మాట్లాడుకున్నదంతా బుజ్జమ్మ బాల్కనీలోంచి వింటుంది. అయ్యో నాన్నకు గతం గుర్తుకు వచ్చిందని అమ్మ తెలిసేలా ఎలా చేయాలి అని ఆలోచిస్తుంది.

Advertisement

అమర్‌ కిందకు వస్తూ.. కిచెన్‌లో ఉన్న మిస్సమ్మను చూసి ఇదివరకు ఇద్దరు రూంలో లాక్‌ అయిన విషయం గుర్తు చేసుకుని భాగీని మరోసారి రూంలో లాక్‌ చేయాలి అనుకుంటాడు. అందుకోసం చిన్న నాటకం ఆడాలని ప్లాన్‌ చేస్తాడు. అనుకున్నట్టుగానే.. అమర్‌ తిరిగి తన రూంలోకి వెళ్లి గట్టిగా భాగీ కాఫీ తీసుకురా అంటూ పిలుస్తాడు. అమర్‌ మాటలకు కిచెన్‌ లో ఉన్న మిస్సమ్మ ఆశ్చర్యపోతుంది. ఆయనేంటి నన్ను పేరు పెట్టి పిలిచారు.. అనుకుంటూ పరుగెత్తుకుంటూ అమర్‌ రూంలోకి వెళ్తుంది. అమర్‌ కూడా రూంలో అయ్యో అలవాటులో పొరపాటు చేశానే..? అనుకుంటూ ఇప్పుడు ఎలాగైనా మేనేజ్‌ చేయాలి అని మనసులో అనుకుంటూ రూంలోకి వచ్చిన మిస్సమ్మతో ఏంటి మిస్సమ్మ కాఫీ తీసుకురాలేదు అంటాడు. దీంతో మిస్సమ్మ ఇప్పుడు మీరు నన్ను ఏమని పిలిచారు అని అడుగుతుంది.. అమర్‌ కంగారుపడుతూ.. మిస్సమ్మ అని పిలిచాను.. అందరూ నిన్ను అలాగే కదా పిలిచేది అయినా కాఫీ ఎందుకు తీసుకురాలేదు.. నేను జాగింగ్‌కు వెళ్లాలి కాఫీ ఇవ్వు త్వరగా అంటాడు అమర్‌. సరే ఇప్పుడే తీసుకొస్తాను అంటూ మిస్సమ్మ కిందుకు వెళ్తుంది.

తర్వాత మిస్సమ్మ కాఫీ తీసుకుని వచ్చి డోర్‌ దగ్గర  నిలబడి సార్‌ కాఫీ అనగానే.. లోపలికి రా అంటూ పిలుస్తూ.. కాఫీ తీసుకుంటాడు. మిస్సమ్మ రూంలోకి వెళ్లగానే.. డోర్‌ లాక్‌ పడిపోతుంది. అంతా బయటి నుంచి గమనిస్తున్న యాదమ్మ డోర్‌ దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్‌ చేయాలని చూస్తుది. ఓపెన్ కాదు. లోపల ఉన్న మిస్సమ్మ కూడా అదేంటి సార్‌ డోర్‌ అలా పడిపోయింది అని అడగ్గానే.. ఏమో గాలికి పడిపోయిందేమోలే అంటాడు. మిస్సమ్మ కంగారుగా డోర్‌ ఓపెన్‌ చేయబోతే రాదు.. బయటి నుంచి డోర్‌ ఓపెన్‌ చేయాలని చూసిన యాదమ్మ డోర్‌ రాకపోయేసరికి వెంటనే ఈ విషయం మనోహరికి చెప్పాలి అనుకుంటూ వెళ్లిపోతుంది.

Advertisement

లోపలి నుంచి డోర్‌ ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన మిస్సమ్మ డోర్‌ రావడం లేదేంటి సార్‌ అంటుంది. నాకేం తెలుసు అంటూ అమర్‌ సమాధానం చెప్పగానే.. మిస్సమ్మ అనుమానంగా మీరు ఏమైనా చేశారా..? అంటూ అడగ్గానే.. అమర్‌ నేనేం చేస్తాను అంటాడు. ఇప్పుడు ఈ డోర్‌ రాకపోతే పరిస్థితి ఏంటి సార్‌ అనగానే.. ఈ పరిస్థితి ఎప్పుడో నాకు ఎదురైనట్టు అనిపిస్తుంది అనగానే.. మిస్సమ్మ ఆశ్చర్యంగా ఎప్పుడు వచ్చింది సార్‌ అంటూ ఆత్రుతగా అడుగుతుంది. అమర్‌ మాత్రం అప్పుడే అంటూ మిస్సమ్మ ను ఆట పట్టిస్తుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×