E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode July 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను మెచ్చుకున్న అమర్‌ – ఆరులా ప్రవర్తించిన బుజ్జమ్మ  

Nindu Noorella Saavasam Serial Today Episode July 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను మెచ్చుకున్న అమర్‌ – ఆరులా ప్రవర్తించిన బుజ్జమ్మ  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌ చెప్పినట్టే తీవ్రవాదులు ఉన్న ఇంట్లోకి వెళ్లిన బుజ్జమ్మ వాళ్లను పట్టుకుని బంధీలుగా ఉన్న ఫ్యామిలీని సేవ్‌ చేయడంలో సహయపడుతుంది. దీంతో ఆర్మీ మేజర్‌, అమర్‌ బుజ్జమ్మను మెచ్చుకుంటారు. తమను రక్షించిన మేజర్‌కు బాధితులు థాంక్స్‌ చెబితే అదంతా అమర్‌, ఆయన కూతురు బుజ్జమ్మది అంటాడు మేజర్‌. అక్కడే బంధీగా ఉన్న తీవ్రవాది కోపంగా అమర్‌ నిన్ను నీ ఫ్యామిలీని వదిలిపెట్టనురా..? చిన్న పిల్లలను అడ్డుగా పెట్టుకుని నన్ను పట్టుకున్నావు ఒకవేళ నేను ఆ పిల్లను చంపేసి ఉంటే అని అడగ్గానే.. తాను మిలటరీలో జాయిన్‌ అయిన రోజు తన జీవితం దేశసేవకు అంకితం చేశానని తన ఫ్యామిలీ కూడా దేశ సేవ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దంగా ఉంటుందని చెప్తాడు అమర్‌. మిలటరీ వాళ్లు ఆ తీవ్రవాదిని అక్కడి నుంచి తీసుకెళ్తారు. మిస్సమ్మ కోపంగా బుజ్జమ్మను తీసుకుని బయటకు వెళ్తుంది.

బయటకు వెళ్లిన మిస్సమ్మ కోపంగా బుజ్జమ్మను తిడుతుంది. నీకేమైనా అయ్యుంటే..? అంటూ బాధపడుతుంది. దీంతో బుజ్జమ్మ ఎందుకు డాడీ ఉన్నారు కదా నాకేం అవుతుంది అంటుంది. అప్పుడే అక్కడకు వెళ్లిన రాథోడ్‌ కూడా మిస్సమ్మ.. బుజ్జమ్మను తక్కువ అంచనా వేయకు.. బుజ్జమ్మ అందరి పిల్లల్లాగా కాదు.. తనకు సూపర్‌ పవర్స్‌ ఉన్నాయి.. తను వేరే లెవల్‌ అని చెప్పగానే.. మిస్సమ్మ అనుమానంగా వేరే లెవెల్‌ అంటే ఏంటి..? రాథోడ్‌ అని అడుగుతుంది. దీంతో రాథోడ్‌ అదే మిస్సమ్మ.. బుజ్జమ్మకు ఉన్న తెలివి, చాకచక్యం సూపర్బ్‌ గా ఉంటాయి అని చెప్తున్నాను అంటాడు. అదేం కాదు రాథోడ్‌ బుజ్జమ్మకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అంటూ మిస్సమ్మ బాధపడుతుంటే.. లోపలి  నుంచి అమర్‌ వస్తాడు. థాంక్యూ బుజ్జమ్మ అని చెప్పగానే.. బుజ్జమ్మ మీరెందుకు డాడీ నాకు థాంక్స్‌ చెప్తున్నారు.. అంటుంది.

Advertisement

దీంతో అమర్‌ లేదు బుజ్జమ్మ ఎంతో కష్టమైన ఆపరేషన్‌ను చాలా ఈజీగా చేసేలా చేశావు.. అడుగు బుజ్జమ్మ నీకేం కావాలో అడుగు ఇస్తాను అని చెప్పగానే.. నాకేం వద్దు డాడీ అంటుంది బుజ్జమ్మ దీంతో అమర్‌ లేదు బుజ్జమ్మ మా ఆర్మీ తరపున  నీకేదైనా ఇస్తాను అడుగు అంటాడు. దీంతో బుజ్జమ్మ నీకు గతం గుర్తుకురావాలి డాడీ నీకోసం తపించేవాళ్లను నువ్వు గుర్తు పట్టాలి అంటూ ఇన్‌డైరెక్టుగా మిస్సమ్మను చూస్తూ చెప్తుంది. దానికి అమర్‌ వస్తుందిలే బుజ్జమ్మ ఒకవేళ నాకు గుర్తుకు వచ్చింది అనుకో అప్పుడే ఏం కావాలో కోరుకుంటావా..? చెప్పు ఏం కావాలి అంటూ అడగ్గానే.. బుజ్జమ్మ అప్పుడు కూడా మీ కోసం తపించి వ్యక్తితో మీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను డాడీ అంటుంది బుజ్జమ్మ. బుజ్జమ్మ మాటలకు అమర్‌ ఆరును గుర్తు చేసుకుంటాడు.. బుజ్జమ్మ అచ్చం  నువ్వు ఆరులా ఆలోచిస్తున్నాను. తను కూడా ఎప్పుడు ఎదుటి వాళ్ల ఆనందాన్నే కోరుకునేది అని మనసులో అనుకుంటూ అందరినీ తీసుకుని అక్కడి  నుంచి వెళ్లిపోతాడు అమర్‌.

అమర్‌ ఇంట్లో అర్ద్రరాత్రి దెయ్యం శబ్దం వినిపిస్తుంది. చంభా రూంలోకి అంజు వెళ్లి జుట్టు విరబోసుకుని చంభాను నిద్ర లేపుతుంది. నిద్రమత్తులో ఉన్న చంభా అంజును చూసి భయంతో మనోహరి రూంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి దెయ్యం మనోహరి అంటూ భయపడుతుంది. మనోహరి కోపంగా నువ్వు పెద్ద మంత్రగత్తెవు.. నువ్వు దెయ్యాన్ని చూసి భయపడటం ఏంటి..? అంటూ తిడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×