E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ పై మీనాకు అనుమానం.. డైటీషన్ దెబ్బకు ప్రభా షాక్.. బాలు కౌంటర్స్ హైలెట్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ పై మీనాకు అనుమానం.. డైటీషన్ దెబ్బకు ప్రభా షాక్.. బాలు కౌంటర్స్ హైలెట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode జూలై 3rd: స్కూల్ నుంచి బయటికి వచ్చే ముందు అక్కడ బాలు వాళ్ళు ఉండడం చూసి.. చింటూ వాళ్ళకి తన తల్లి గురించి నిజం చెప్తాడు.. బాలు మీనాకు ఆమె ఎవరు అని అనుమానం మొదలవుతుంది.. ఇక ప్రభావతిని చూసుకోకుండా గుద్దేసినా శృతి నాలుగు రౌండ్లు గిర్రును తిరిగి కింద పడుతుంది.. మిమ్మల్ని గుద్దుకున్నందుకు నేనే కింద పడ్డాను అని అనడంతో ప్రభావతి నేను డైట్ చేస్తున్నాను త్వరలోనే తగ్గిపోతాను అని అంటుంది.. అప్పుడే ఇంటికి వచ్చిన సత్యం చింటూ వాళ్ళ అమ్మ గురించి ఇంట్లో వాళ్లకి చెప్తాడు.. అయితే ఆమె మాస్క్ పెట్టుకోవడం ఏంటి అని అందరూ అనుమానపడతారు.. మనోజ్ మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో మీనా బాలుకి మనోజే చింటూ తండ్రి అని అనుమానం మొదలవుతుంది.. అది నిజమో కాదో నేను కనిపెడతాను అని బాలు అంటాడు..

మనోజ్ సెకండ్ సెటప్ పెట్టాడా..?

రోహిణి గెటప్ పై ఇంట్లో పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఆ గెటప్ లో ఉన్నది ఎవరు? ఎందుకు కొడుకుకి కూడా మొహం చూపించలేదు అని అందరూ పెద్ద చర్చలు జరుపుతారు.. బాలు మీనా కోసమని పాలును తీసుకొని వస్తాడు.. పాల సంగతి పక్కన పెట్టండి మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి అని అంటుంది.. ఏదాని గురించి చెప్పాలి ఎందుకు అని బాలు అంటాడు.. నాకు మనోజ్ మీద కాస్త అనుమానంగా ఉంది.. ఆ అమ్మాయి కల్పనా అని నాకు అనుమానంగా ఉంది అని నేను అనగానే బాలు నీకెందుకు అనుమానం వచ్చింది అని అంటాడు.. వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఉందని నాకు అర్థమైంది.. ఆ చింటూ ని కానీ వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెట్టి ఆమె కెనడాలో ఉందని నాకు అనుమానంగా ఉంది అని మీనా అనగానే.. సరే అని బాలు అంటాడు.. చింటూ వాళ్ళ అమ్మ గురించి ముందుగా తెలుసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు కదా అని బాలు అదిరిపోయే ప్లాన్ చేస్తాడు..

ప్రభా కోసం డైటీషన్..

Advertisement

తర్వాత రోజు ఉదయం మనోజ్ ప్రభావతి కోసం ఒక డైటీషన్ ను తీసుకొని వస్తాడు.. ప్రభావతి కాఫీ తాగుతుండగా ఆ కప్పుని లాగేసుకుంటుంది ఆవిడ.. ఏంటి ఎందుకు నేను తాగుతున్న కప్పుని లాగేసుకున్నావు అని ప్రభావతి కోపంగా అడుగుతుంది.. అయితే మనోజ్ నీకోసం తీసుకొచ్చిన డైటీషియన్స్ సునీత ఈవిడ అని చెప్తాడు. మరి కాఫీ కప్పు నెల లాగేసుకున్నావ్ ఏంటి అని ప్రభావతి అనుమానంగా అడుగుతుంది.. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారు కదా కాఫీలు టీలు ఎక్కువగా తాగకూడదు అని ఆమె చెప్పకనే ప్రభావతి షాక్ అవుతుంది.. అది చూసిన బాలు సెటైర్ల వర్షం కురిపిస్తాడు.. ఇక డైటీషన్ సునీతపై కూడా బాలు వదలకుండా కామెంట్లు చేయడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ప్రభావతి గురించి తెలుసుకోవాలి అని అడగ్గానే బాలు తనకి తెలిసిన భాషలోనే ప్రభావతి గురించి వెటకారంగా చెప్తాడు.. బాలు మాటలు ఉన్న అందరూ కడుపుబ్బ నవ్వుకుంటారు..

అమ్మో.. ప్రభావతి గుండె గుబేలు..

ఇక ఆ డైటిషియన్ అడుగుతాడు.. వారానికి ఎనిమిది వేలు.. సరుకులు కూడా నేనే ఇస్తాను అని చెప్పగానే.. వామ్మో వారానికి ఎనిమిది వేల నెలకి 32000 అని బాలు షాక్ అవుతాడు.. ఏంటి 32వేల దేవుడా రోజుకి 1500 అని బాలు లెక్కలు వేసి చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది.. ఇకపోతే మనోజ్ రోహిణి కూడా అదే డైట్ ను ఫాలో అవొచ్చునా అని అడగ్గానే అత్తయ్య గారికి నేను చేసి పెడతాను. కానీ వాళ్ళిద్దరికీ చేసి పెట్టాలంటే ఖర్చు అవుతుంది అని నేను అనడంతో మనోజ్ రోహిణి షాక్ అవుతారు.. ఇక అంత తక్కువ తీసుకుంటే ఎలా.. రోజుకి 500 అయినా తీసుకోకపోతే బాగోదు అని బాలు ఇంకా మీనాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు.. నీకు ఆ తర్వాత రోహిణి నాకు పని ఉంటుంది అని ఎంత చెప్తున్నా సరే మీనా మాత్రం నాకు పని ఉంటుంది అని అంటుంది.. మీనా కి సపోర్టుగా సత్యం బిజినెస్ కూడా చేస్తుంది కదా ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి అని అంటాడు..

చింతామణిని చూసి మీనా షాక్..

Advertisement

తర్వాత డాన్స్ క్లాస్ కి వెళ్ళిన ప్రభావతి అక్కడ చింతామణి సరిగ్గా డ్యాన్స్ వేయకపోవడంతో సీరియస్ అవుతుంది.. కామాక్షి కూడా ఆ డాన్స్ స్టెప్పులేంటి అసలు ఏదో సీరియస్గా చేస్తున్నారు అని చింతామణిని అనడంతో ఏదో గతిలేక ఇక్కడ తైతక్కలాడుతున్నాను అని చింతామణి మనసులో అనుకుంటుంది.. ఇక పిల్లలందరికీ బ్రేక్ ఇవ్వడంతో వాళ్ళు బయటికి వెళ్లి స్నాక్స్ తింటూ ఉంటారు.. ఇక డైటీషన్ గురించి చింతామణికి చెప్పడంతో… మీనా వాటిని చేసి తీసుకొని వస్తుంది అని చెప్తుంది.. మీనా అక్కడికి రాగానే తింటామని తో ప్రభావతి కలిసి కూర్చుని ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఓ నన్ను తొక్కడానికి మీరు చేసిన ప్లాన్ ఇదేనా అని అనుకుంటుంది. చింతామణికి ప్రభావతికి ఇద్దరికీ కలిపి మీనా దిమ్మ తిరిగిపోయే క్లాసు ఇస్తుంది.. నన్ను తొక్కడనికి నా ఇంట్లోనే శత్రువు తయారయ్యిందన్నమాట అని ప్రభావతిని దారుణంగా అనేసి వెళ్ళిపోతుంది మీనా.. ప్రభావతి మాత్రం చాలా కోపంగా ఉంటుంది.. ఇక చింతామణి ప్రభావతిని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడి తన ప్లాన్ ని సక్సెస్ అయ్యేలా చేసుకుంటుంది.. మరి ప్రభావతి మీనాపై ఎలా రివెంజ్ తీసుకుంటుంది అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : ఇంట్లో అడ్డంగా బుక్కయిన శైలు..ఇంట్లో బాంబ్ పేల్చిన చక్రీ.. మహా కోసం పెద్ది త్యాగం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×