E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode July 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను సేఫ్‌గా ఇంటికి తీసుకొచ్చిన అమర్‌   

Nindu Noorella Saavasam Serial Today Episode July 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను సేఫ్‌గా ఇంటికి తీసుకొచ్చిన అమర్‌   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: బుజ్జమ్మను చంపేందుకు ప్రచండ బయటకు తీసుకెళ్తాడు. ఇంట్లో బుజ్జమ్మ, అంజు కనిపించకపోయే సరికి మిస్సమ్మ కంగారు పడుతుంది. కింద హాల్లో ఉన్న మనోహరిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుంది. దీంతో మిస్సమ్మ కోపంగా మనోహరిని తిడుతుంది. అలాగే పిల్లలను చూసుకోకుండా ఎప్పుడూ మనోహరి వెనకాలే తిరుగుతున్న చంభాను మిస్సమ్మ తిడుతుంది. వెంటనే బయటకు వెళ్లి అంజు, బుజ్జమ్మలను వెతకాలనుకుని ఆనంద్‌, ఆకాష్‌లను తాను తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎక్కడికి వెళ్లొద్దని చెప్పి మిస్సమ్మ వెళ్లిపోతుంది.

మిస్సమ్మ పరుగెత్తుకుంటూ వెళ్లగానే.. మనోహరి.. కంగారుపడుతూ.. చంభా ఆ భాగీ ఇప్పుడు బుజ్జమ్మను రక్షిస్తుందేమో.. అంటుంది. అందుకు చంభా అంత లేదు.. అక్కడ ఉన్నది ప్రచండ ఎలాగైనా ఇవాళ ఆ పిల్ల పిశాచీ ప్రాణం తీస్తాడు అంటూ చెప్తుంది. బుజ్జమ్మను తీసుకుని వెళ్తున్న అంజు ఈరోజు నిన్ను చంపేసి నీ ఆత్మకు ఉన్న శక్తులు వశం చేసుకుంటాను అని మనసులో అనుకుంటుంటే.. బుజ్జమ్మ మాత్రం అక్కా చాట్‌ బండి అటువైపు ఉంటుంది కదా..? నువ్వెందుకు ఇటువైపు తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. అందుకు అంజులో ఉన్న ప్రచండ ఇటువైపు కొత్తగా పెట్టారట.. చాట్‌ చాలా బాగుంటుందని నా ఫ్రెండ్‌ చెప్పింది బుజ్జమ్మ అందుకే ఇటు తీసుకెళ్తున్నాను.. అని చెప్పగానే.. అయితే సరే వెళ్దాం పద అంటూ బుజ్జమ్మ ఫాలో అవుతుంది. కొద్ది దూరం వెళ్లాక చాట్‌ బండి కనిపిస్తుంది ఆ బండిని చూపించిన ప్రచండ అదిగో అక్కడే చాట్‌ బండి ఉంది బుజ్జమ్మ మనం రోడ్డు దాటి వెళ్దాం పద అనగానే.. బుజ్జమ్మ సరే అక్కా అంటూ రోడ్డు దాటుతుంటే..

Advertisement

అంజు అలియాస్‌ ప్రచండ అలాగే ఆగిపోతాడు. లారీ స్పీడుగా బుజ్జమ్మను చంపడానికి వస్తుంటుంది. పిల్లలిద్దరినీ వెతుక్కుంటూ వచ్చిన మిస్సమ్మ రోడ్డు దాటున్న బుజ్జమ్మను చూస్తుంది. బుజ్జమ్మ వైపు స్పీడుగా వస్తున్న లారీని చూసి గట్టిగా బుజ్జమ్మ అంటూ కేకలేస్తుంది. ఆ కేకలకు ప్రచండ తిరిగి చూస్తాడు. మిస్సమ్మ రావడం గమనించి వెంటనే తాను బుజ్జమ్మను కాపాడాలని లేదంటే అంజును అనుమానిస్తారని మనసులో అనుకుంటూ బుజ్జమ్మ ఆగు అంటూ బుజ్జమ్మ వైపు పరుగెడుతుంది. దూరం నుంచి పరుగెత్తుకుంటూ వస్తున్న మిస్సమ్మ అంజు, బుజ్జమ్మ ఆగండి అంటూ పిలుస్తుంది. అప్పుడే అటువైపు వెళ్తున్న అమర్‌ వాళ్లను గమనించి కాపాడటానికి వెళ్తాడు. అప్పటికే మిస్సమ్మ వెళ్లి అంజు, బుజ్జమ్మలను పక్కకు తోసేసి రోడ్డు మధ్యలో పడిపోతుంది మిస్సమ్మ. అమర్‌ వెళ్లి మిస్సమ్మను సేవ్‌ చేస్తాడు. కోపంగా బుజ్జమ్మ, అంజులను తిడతాడు. అందరినీ తీసుకుని ఇంటికి వెళ్తాడు.

ఇంటి బయటే నిలబడి చూస్తున్న మనోహరి.. అమర్‌ రావడం చూసి షాక్‌ అవుతుంది. కారులోంచి మిస్సమ్మ దిగడం చూసి మరింత షాక్‌ అవుతుంది. చంభాతో ఇదేంటి ఇది కూడా కారులో వచ్చింది అని అడగ్గానే.. ఏం ఉంటుంది మనోహరి ఆ ప్రచండ, బుజ్జమ్మను చంపేసి ఉంటాడు. ఆ విషయం తెలియక బుజ్జమ్మ కోసం ఊరంతా తిరుగుతున్న భాగీని వీళ్లు తీసుకుని వచ్చి ఉంటారు అని చెప్తుంది. అప్పుడే కారులోంచి బుజ్జమ్మ, అంజు దిగడం చూసి మనోహరి, చంభా షాక్‌ అవుతారు. మనోహరి భయంగా ఏంటి చంభా మనం ఒకటి అనుకుంటే మరోటి జరిగింది. ప్రచండ మళ్లీ ఫెయిల అయ్యాడా..? అనగానే.. చంభా కోపంగా బుజ్జమ్మ బతికి వచ్చిందంటే అదేగా అని అర్థం అంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×