E-Paper
Advertisement

10 గంటలు ప్రభుత్వాన్ని అల్లాడించే అరాచకం… మస్ట్ వాచ్ మలయాళం పొలిటికల్ థ్రిల్లర్

10 గంటలు ప్రభుత్వాన్ని అల్లాడించే అరాచకం… మస్ట్ వాచ్ మలయాళం పొలిటికల్ థ్రిల్లర్
Advertisement

Malayalam political thriller: ప్రభుత్వాన్ని కదిలించాలి అంటే అంత ఈజీ కాదు. కానీ నలుగురు ఆటవికులు మాత్రం గవర్నమెంట్ ను అల్లాడించి అదరగొట్టారు. ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి సైతం కదిలేలా వాళ్ళు వేసిన ప్లాన్ గురించి తెలిస్తే బుర్ర గిర్రున తిరిగపోతుంది. మరి మీకు కూడా ఇలాంటి సినిమాను చూడాలని ఉందా ? అయితే 2022లో విడుదలైన మలయాళ సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ Pada మీ కోసమే. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే… 

కథ పూర్తిగా ఒక్క రోజులోనే, కేరళలోని పాలక్కాడ్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సాగుతుంది. 1975లో ఆదివాసీల భూములను రక్షించడానికి తెచ్చిన చట్టాన్ని 1996లో ప్రభుత్వం సవరిస్తుంది. ఈ సవరణ ద్వారా గిరిజనుల సొంత భూములు కార్పొరేట్ సంస్థలు, శక్తివంతులు లాక్కోవడానికి దారి తీస్తుంది. దీంతో వందలాది ఆదివాసీ కుటుంబాలు తమ భూములు, జీవనాధారాలు కోల్పోయి రోడ్డున పడతాయి. ఈ అన్యాయాన్ని సహించలేక ‘అయ్యంకాలి పద’ అనే విప్లవాత్మక సంస్థకు చెందిన నలుగురు సామాన్యులు రాకేష్, బాలు, అరవిందన్, నారాయణన్‌కుట్టి కలిసి ఒక డేరింగ్ ప్లాన్ వేస్తారు.

Advertisement

బాంబులు, గన్‌లతో పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ అజయ్ శ్రీపాద్ డాంగే ఛాంబర్‌లోకి చొరబడతారు. అక్కడ కలెక్టర్‌ను బందీగా పట్టుకుంటారు. అతని శరీరాన్ని బాంబులతో చుట్టి, కుర్చీకి కట్టేసి గవర్నమెంట్ ను హెచ్చరిస్తారు. వారి డిమాండ్లు ఏంటో బయట పెడతాడు. ఆదివాసీల భూములను కాపాడే చట్ట సవరణను తక్షణం రద్దు చేయాలని, ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి తమతో మాట్లాడాలని, గిరిజనుల సమస్యను గుర్తించాలని కోరుతారు. ఈ సంఘటన కేరళ రాజకీయాల్లో భారీ అలజడి సృష్టిస్తుంది. ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో వందలాది పోలీసులు కలెక్టరేట్ చుట్టూ మోహరిస్తారు.

మీడియా, రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు… అందరి దృష్టి ఈ ఘటనపై పడుతుంది. దాదాపు 10 గంటల పాటు ఉత్కంఠభరితమైన చర్చలు, టెన్షన్ నిండిన సంభాషణలు సాగుతాయి. ఈ సమయంలో కలెక్టర్ అజయ్ కూడా ఆ నలుగురి నిస్వార్థమైన పోరాటం, ఆదివాసీల నిజమైన బాధలను అర్థం చేసుకుంటాడు. చివరికి ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చిన తర్వాత కలెక్టర్‌ను విడిపిస్తారు. కానీ అప్పుడు వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తుంది. మరి ఆ ట్విస్ట్ ఏంటి ? ప్రభుత్వం ఆ నలుగురిని ఏం చేసింది ? కోర్టు వీళ్ళకు ఎలాంటి శిక్షను విధించింది ? అన్నది తెలియాలంటే ఈ మలయాళం మూవీపై ఒక లుక్కేయండి.

తెలుగులో ఉందా ?

Advertisement

సినిమా క్లైమాక్స్ లో నిజమైన ‘అయ్యంకాలి పద’ ఉద్యమకారుల ఫోటోలు, ఆదివాసీల ప్రస్తుత దుస్థితిని చూపిస్తూ దర్శకుడు ఇచ్చే మెసేజ్ ను అస్సలు మిస్ అవ్వొద్దు. ‘పడ’ సినిమా ఎక్కడా అనవసరమైన డ్రామా లేకుండా, రియలిస్టిక్‌గా సాగే సీరియస్ సినిమా. కమల్ కె.ఎమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ లో లేదు. మలయాళం ఒరిజినల్‌తో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. 1996లో కేరళలో నిజంగా జరిగిన ఒక సంచలనాత్మక రాజకీయ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా వయొలెన్స్, యాక్షన్ లేకుండానే ప్రేక్షకులను ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో కూర్చోబెడుతుంది.

Read Also: ఇండియన్ మైథాలాజి మిక్సయ్యి ఉన్న హాలీవుడ్ హర్రర్ మూవీ… లాస్ట్ ట్విస్ట్ డోంట్ మిస్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×