E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమరేంద్ర ఇంటికి వచ్చిన బుజ్జమ్మ

Nindu Noorella Saavasam Serial Today January 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమరేంద్ర ఇంటికి వచ్చిన బుజ్జమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

అనాథ ఆశ్రమానికి వెళ్లిన అమర్‌. అక్కడి పిల్లలకు కొత్త బట్టలు ఇచ్చి తిరిగి వెళ్తుంటే.. కిటీకి దగ్గర మిస్సమ్మ నిలబడి లోపలి నుంచి అమర్‌ను చూస్తుంది. అమర్‌ కూడా ఆ కిటీకి దగ్గరకు వచ్చేసరికి అలాగే ఆగిపోతాడు. ఎమోషనల్‌ అవుతూ చూస్తుంటాడు. మిస్సమ్మ మాత్రం తను కనిపించకుండా అమర్‌ ను చూస్తుంటుంది. ఇంతలో రాథోడ్‌ ఏమైంది సార్‌..? ఆగిపోయారు.. ఏమైనా మర్చిపోయారా..? చెప్పండి సార్‌ ఎందుకు ఆగిపోయారు అని అడగ్గానే.. అమర్‌ లేదు రాథోడ్‌ ఎందుకో గుండె భారంగా ఉంది నాకు సంబంధించింది ఏదో ఇక్కడ వదిలేసి వెళ్తున్నట్టుగా ఉంది అని చెప్పగానే..

సార్‌ అరుంధతి మేడం ఇక్కడే పెరిగారు కదా..? ఆ ఫీలింగ్‌ మిమ్మల్ని వెంటాడుతుందేమో అని రాథోడ్‌ చెప్పగానే.. అమర్‌ పద అంటూ ఇద్దరూ వెళ్లిపోతారు. లోపలి  నుంచి మిస్సమ్మ ఏడుస్తూ వాళ్లనే చూస్తుంటుంది. బయటకు కారు దగ్గరకు వెళ్లిన అమర్‌ మళ్లీ ఆశ్రమం వైపు చూసి బాధగా వెళ్లిపోతాడు. రూంలో ఏడుస్తున్న మిస్సమ్మ దగ్గరకు బట్టలు తీసుకుని రాజు వస్తాడు. అమ్మ సార్‌ ఇది మీకు ఇమ్మన్నారు అమ్మ అని బ్యాగ్‌ ఇచ్చి వెళ్తాడు. ఆ బ్యాగ్‌ తెరచి చూసిన మిస్సమ్మ అందులో శారీ తీసుకుని హత్తుకుంటుంది. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధపడుతుంది.

Advertisement

తర్వాత మనోహరి, చంభా కలిసి అంజు వాళ్ల స్కూల్‌ దగ్గరకు వెళ్తారు. చంభా కారు దిగగానే మన ఇంటికి రావడానికి ఆ పిల్ల ఒప్పుకుంటుందో లేదో మనోహరి అని చెప్పగానే.. అంజుతో చెప్పి ఒప్పిస్తాను కదా అంటుంది మనోహరి. ఇంతలో స్కూల్‌ లోంచి బయటకు వస్తారు అంజు, బుజ్జమ్మ. బుజ్జమ్మ అక్కడ ఉన్న సెక్యూరిటీ అతనికి బై చెప్తుంది. అది చూసిన మనోహరి చూశావా చంభా దాని జన్మ మారినా బుద్ది మాత్రం మారలేదు అందరితో కలుపుగోలుగా ఉంటుంది అని చెప్పగానే.. అందుకే అరుంధతి ఆ జన్మలో అందరి బంధువు అయింది. ఈ జన్మలో కూడా అదే కొనసాగిస్తుంది అని చంభా చెప్పగానే.. సరే దగ్గరకు వెళ్లి మాట్లాడుదాం పదా అంటూ ఇద్దరూ కలిసి అంజు వాళ్ల దగ్గరకు వెళ్తారు. వాళ్లను చూసిన అంజ మీరు వచ్చారేంటి..? రాథోడ్‌ రాలేదా..? అని అడగ్గానే.. రాథోడ్ కొంచెం బిజీగా ఉన్నాడు.. అందుకే నేను వచ్చాను అని చెప్తుంది మనోహరి.

ఇంతలో బుజ్జమ్మ ఈవిడ ఎవరు అక్కా అని అంజును  అడుగుతుంది. తను మనోహరి ఆంటీ మిస్సమ్మ తర్వాత మాకు కేర్‌టేకర్‌ అయింది అని చెప్పగానే.. మనోహరి మాత్రం ఏమీ తెలియనట్టు ఎంత బాగా అడుగుతున్నావే అని మనసులో అనుకుంటుంది. బుజ్జమ్మ మాత్రం మిస్సమ్మ ఎవరు..? అని అడగ్గానే.. అంజు మా అమ్మ తర్వాత అమ్మ చాలా మంచిది అని చెప్తుంద. దీంతో బుజ్జమ్మ తను ఎక్కడ ఉంది..? అని అడుగుతుంది.. మనోహరి మాత్రం ఆశ్చర్యంగా నీ దగ్గరే ఉంది కదా అరుంధతి అని చెప్పగానే.. మరింత ఆశ్చర్యంగా బుజ్జమ్మ నా దగ్గర ఉందా..? అని అడుగుతుంది. అంటే ఐ మీన్‌ నువ్వు అంజు పక్కన ఉన్నావు కదా..? అంటే మిస్సమ్మ నీ దగ్గర ఉన్నట్టే అని చెప్తుంది. ఇంతలో అంజు ఓకే బుజ్జమ్మ ఇక నేను బయలుదేరనా..? అని చెప్పగానే.. మనోహరి అదేంటి అంజు నీ ఫ్రెండ్‌ను మన ఇంటికి పిలువు అని చెప్తుంది. దీంతో అంజు అవును బుజ్జమ్మ ఈరోజు నువ్వు మా ఇంటికి రావాలి అని అడుగుతుంది.

Advertisement

బుజ్జమ్మ మాత్రం ఈరోజా… వద్దులే అక్కా తర్వాత ఎప్పుడైనా వస్తాను అని చెప్తుంది. మనోహరి మాత్రం అంజు అంతలా అడుగుతుంది కదా..? అరుంధతి ఈ ఒక్క రోజు రా అరుంధతి అని చెప్తుంది. అంజు కూడా ఈవెనింగ్‌ కల్లా మళ్లీ నిన్ను పంపిచేస్తానులే రా బుజ్జమ్మ అనగానే.. మనోహరి మాత్రం నేను పంపించాలి కదా..? అంటుంది. అంజు అర్థం కానట్టు ఏంటి అంటీ ఏదో అంటున్నారు అంటుంది. దీంతో మనోహరి అదే నేను దగ్గరుండి పంపిస్తాను అంటున్నాను అని చెప్తుంది. దీంతో అంజు రా బుజ్జమ్మ వెళ్దాం.. అని బతిమాలుతుంది. బుజ్జమ్మ మాత్రం తాతయ్యతో అమ్మతో చెప్పకుండా నేను రాకూడదు.. తప్పు అవుతుంది అని చెప్పగానే.. ఏం కాదులో అరుంధతి మీ తాతయ్యకు అంజు ఫోన్‌ చేసి చెప్తుందిలే.. అనగానే.. అంజు కూడా అవును బుజ్జమ్మ ఫ్లీజ్‌ రా అని అడుగుతుంది. మనోహరి, అంజు బుజ్జమ్మను కన్వీన్స్‌ చేసి ఇంటికి తీసుకెళ్తారు.

ఇంటికి వెళ్లగానే.. గార్డెన్‌ లోకి చూసిన బుజ్జమ్మ గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి.. అది గుర్తు చేసుకుంటే బుజ్జమ్మ బయటే నిలబడిపోతంది. ఇంతలో మనోహరి ఇక్కడే నిలబడ్డావేంటి..? అరుంధతి లోపలికి వెళ్దాం పద అని చెప్పగానే.. బుజ్జమ్మ లోపలికి నడుస్తుంటే.. లోపల ఉన్న అమర్‌కు హర్ట్‌ లో వైబ్రేషన్స్‌ స్టార్ట్‌ అవుతాయి. ఇంతలో బుజ్జమ్మ ఇంట్లో అడుగుపెడుతుంది. హాల్లో మిస్సమ్మ ఫోటోకు ఉన్న దండ కింద పడిపోతుంది. అమర్‌, రాథోడ్‌, పిల్లలు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×