E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను తీసుకుని వచ్చిన రాజు

Nindu Noorella Saavasam Serial Today February 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను తీసుకుని వచ్చిన రాజు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

రాజు, బుజ్జమ్మను తీసుకుని అమర్‌ ఇంటికి వస్తాడు. మనోహరి, చంభా చూస్తారు.. ఆశ్చర్యంగా మనోహరి ఇదేంటి చంభా ఆ ముసలోడు ఆ పిల్లను తీసుకుని ఇక్కడికి వస్తున్నాడు అని అడగ్గానే.. చంభా వెటకారంగా తల్లి ఎక్కడుంటే పిల్ల అక్కడే కదా ఉంటుంది అని చెప్పగానే.. మనోహరి కోపంగా నువ్వు ఆపుతావా..? వాళ్లు తల్లీపిల్లలు అని అమర్‌కు తెలియకూడదు.. అంటుంది. దీంతో చంభా నాకో విషయం అర్థం కావడం లేదు. ఆ పిల్లే తన కూతురు అని భాగీ, అమర్‌ కు ఎందుకు చెప్పడం లేదంటావు.. అని అడగ్గానే.. మనోహరి కోపంగా భాగీ ఇక్కడకు వచ్చింది నన్ను అమర్‌ను కలపడానికి తండ్రీ కూతుళ్లను కలపడానికి కాదు అని చెప్తుంది. నన్ను అమర్‌ను కలపగానే.. భాగీ ఆ పిల్లను తీసుకుని దూరంగా వెళ్లిపోతుంది అని మనసులో అనుకుంటుంది.

చంభా కూడా మనసులో వాళ్ల వలలో బాగా చిక్కుకుపోయావు అని అనుకుంటుంది. ఇంతలో దగ్గరకు వచ్చిన బుజ్జమ్మ హాయ్‌ అంటీ అంటూ మనోహరిని పలకరిస్తుంది. దీంతో మనోహరి కూడా హాయ్‌ పాప.. ఏంటి రాజు గారు పాపను తీసుకుని ఇక్కడికి వచ్చారు అని అడగ్గానే.. దీంతో రాజు మీకు తెలిసిదే కదా మేడం భాగీ గారు పాపను వదిలి ఎక్కువ రోజులు ఉండలేరు కదా..? అని చెప్తాడు. దీంతో మనోహరి అనుమానంగా ఈ పాప తన కూతురు అని అమర్‌కు తెలియకూడదని భాగీ చెప్పింది కదా..? అనగానే.. బుజ్జమ్మ వెంటనే నేను మా అమ్మ ఎవరో తెలియనట్టు నటిస్తాను ఆంటీ అంటుంది. దీంతో చంభా మనసులో తల్లి మూడు ఆకులు చదివితే పిల్ల ఆరు ఆకులు చదివినట్టు ఉంది. ఈ వయసుకే ఇన్ని తెలివితేటలేంటే నీకు అనుకుంటుంది. అప్పుడే మనోహరి సరే జాగ్రత్తగా మ్యానేజ్‌ చేయాలి. సరే పదండి లోపలికి వెళ్ధాం అంటూ అందరూ లోపలికి వెళ్తారు.

Advertisement

లోపలికి వచ్చిన బుజ్జమ్మను చూసి పిల్లలు వెళ్లి ప్రేమగా పలకరిస్తారు. అప్పుడే అమర్‌ కూడా పై నుంచి వచ్చి బుజ్జమ్మ అంటూ పలకరిస్తాడు. రాజ్‌ అమర్‌ను పలకరించి సార్‌ బుజ్జమ్మ కొన్ని రోజులు మీ దగ్గరే ఉంటానంది అందుకే తీసుకొచ్చాను అని చెప్పగానే.. అమర్‌ బలే వారే రాజు గారు కొన్నాళ్లేంటి ఎన్నాళ్లైనా బుజ్జమ్మ మా దగ్గరే ఉండొచ్చు అని చెప్పగానే.. రాజు థాంక్యూ సార్‌ అంటాడు. బుజ్జమ్మ కూడా థాంక్యూ సార్‌ అని చెప్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన మిస్సమ్మ ఈ పాప ఎవరు…? అని అడుగుతుంది. అందరూ షాక్‌ అవుతారు. బుజ్జమ్మ కూడా మీరు ఎవరు..? అని అడుగుతుంది. దీంతో చంభా మరింత షాక్‌ అవుతుంది. అప్పుడే రాథోడ్‌ కల్పించుకుని ఈ పాప సారుకు చాలా ఇష్టమైన పాప మిస్సమ్మ.. ఈవిడ ఒకప్పుడు ఈ పిల్లలకు కేర్‌ టేకర్‌ బుజ్జమ్మ అని చెప్పగానే.. బుజ్జమ్మ ఏమీ తెలియనట్టు ఓ అలాగా అంటుంది.

చంభా మాత్రం షాకింగ్‌ గా నేను ఇక్కడ ఉండలేను మనోహరి నేను వెళ్లిపోతాను అంటూ మనోహరికి చెవిలో చెప్తుంది. మనోహరి కోపంగా ఏయ్‌ ఎక్కడికి వెళ్తావు నోరు మూసుకుని ఇక్కడే ఉండు అని చెప్తుంది. ఇంతలో రాజు, మిస్సమ్మను చూస్తూ.. నమస్కారం మేడం బాగున్నారా..? అని అడగ్గానే.. మిస్సమ్మ కూడా బాగున్నాను రాజు గారు మీరు ఎలా ఉన్నారు.. ఆశ్రమం పిల్లలు ఎలా ఉన్నారు అని అడగ్గానే.. రాజు మీ దయ వల్ల బాగున్నాము మేడం.. మీరు ఊరెళ్లారు అని చెప్పారు.. ఎప్పుడొచ్చారు మేడం అని అడగ్గానే.. రాథోడ్‌ నవ్వుతూ.. మిస్సమ్మ ఈ రోజే వచ్చింది రాజు గారు.. ఈ ఇంటికి కల వచ్చింది. మా అందరి కళ్లల్లో వెలుగు వచ్చింది. అంటూ రాథోడ్‌ నవ్వుతుంటే.. అమర్‌ కోపంగా రాథోడ్‌ ఆపుతావా..? అంటాడు. మనోహరి కూడా అనవసరంగా అమర్‌ కు కోపం తెప్పించకు రాథోడ్‌.. అనగానే.. మిస్సమ్మ కోపంగా నేను మాట్లాడుతుంటే అంత కోపం ఎందుకు..? అయినా ఈ పాప ఎందుకు వచ్చింది అంటుంది. అమర్‌ కూడా కోపంగా తను ఎందుకు వస్తే నీకు ఎందుకు..? అంటాడు.

Advertisement

దీంతో మిస్సమ్మ కోపంగా నలుగురు పిల్లున్నారు సరిపోలేదా..? మళ్లీ ఈ పాప ఎందుకు అని అనగానే.. అమర్‌ కోపంగా అది నీకు అనవసరం.. ఇదిగో మనోహరి నీకు ఇప్పుడే చెప్తున్నాను.. తను బుజ్జమ్మ జోలికి వెళ్లకూడదు.. అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే.. పిల్లలు కూడా మిస్సమ్మను తిట్టినట్టు యాక్టింగ్‌ చేస్తారు.. దీంతో చంభా ఎవ్వరూ తగ్గట్లేదు కదా.. అనుకుంటుంది.  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×