E-Paper
Advertisement

Vishnu Vinayasam Twitter Review : ‘విష్ణు విన్యాసం ‘ ట్విట్టర్ రివ్యూ.. శ్రీ విష్ణు హిట్ కొట్టాడా..?

Vishnu Vinayasam Twitter Review : ‘విష్ణు విన్యాసం ‘ ట్విట్టర్ రివ్యూ.. శ్రీ విష్ణు హిట్ కొట్టాడా..?
Advertisement

Vishnu Vinayasam Twitter Review : టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శ్రీవిష్ణు.. ఒకప్పుడు సపోర్టింగ్ రోల్స్ తో ఆకట్టుకున్న ఈయన ఆ తర్వాత సామజవరగమన మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.. ఆ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఇప్పటివరకు శ్రీకృష్ణ నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు మరో కామెడీ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. ఆ మూవీ విష్ణు విన్యాసం.. ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ టాక్ ఎలా ఉంది..? విష్ణు ఖాతాలో హిట్ పడిందా లేదా? అన్నది ట్విట్టర్ రివ్యూలో ఒకసారి చూసేద్దాం..

స్టార్ హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటించిన తాజా చిత్రం విష్ణు విన్యాసం.. సత్య, మురళీశర్మ, బ్రహ్మజీ, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ వంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించారు. కామెడీ, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు సుమంత్ నాయుడు నిర్మాతగా వ్యవహరించారు.. ఫిబ్రవరి 27 న భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చేసింది.. మరి ఈ మూవీ పై నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి…

Advertisement

సినిమా స్టార్టింగ్ కొంచెం డల్ గా అనిపిస్తుంది.. ఆ తర్వాత పక్కా కామెడితో ఉంది. ఫస్ట్ ఆఫ్ అదిరిపోయింది.. క్లైమాక్స్ బాగుంది.. ఓవర్ ఆల్ గా మూవీలో కామెడీ పంచెస్ వర్కౌట్ అయ్యాయి నవ్వుతూనే ఉంటారు. హీరో శ్రీవిష్ణు నుంచి మంచి స్ట్రెస్ ఫ్రీ సినిమా వచ్చేసింది. థియేటర్ కు వెళ్తే రిలాక్స్ అయ్యి రావొచ్చు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు..

Advertisement

శ్రీవిష్ణు కామెడీకి ఎవరైన నవ్వాల్సిందే.. కామెడీ తో ఈ మూవీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఫస్ట్ ఆఫ్ బాగుంది.. సెకండ్ ఆఫ్ మాత్రం ఎమోషనల్ డైలాగులు ఉండటంతో కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. మిగితా అంతా ఒకే.. శ్రీవిష్ణు కామెడితో నవ్వించేసాడు.. ఓవరాల్ గా మూవీ అదిరిపోయింది. వీకెండ్ తప్పక చూడాల్సిన మూవీ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు..

ఈ వీకెండ్ డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ.. శ్రీవిష్ణు కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. మొత్తం కామెడీ… ఇది బాగా వర్కౌట్ అయ్యింది. అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

మొత్తానికి శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ మూవీ పడేలా ఉంది.. ఇప్పటివరకు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.. కామెడీ ఏంటర్టైనర్ వచ్చిన ఈ మూవీ జనాలని బాగా ఆకట్టుకుంటుంది.. అస్సలు మిస్ అవ్వకుండా మీరు చూసేయ్యండి. ప్రస్తుతానికి అయితే జనాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.. ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని వసూలు చేస్తుందో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాలి..

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×