E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లలతో పిచ్చిదానిలా ప్రవర్తించిన మనోహరి 

Nindu Noorella Saavasam Serial Today February 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లలతో పిచ్చిదానిలా ప్రవర్తించిన మనోహరి 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మనోహరి పిల్లలకు ఫ్రీడమ్‌ ఇస్తున్నాను అని చెప్తుంది. దీంతో పిల్లలు ఆశ్చర్యంగా నిజమా ఆంటీ అని అడగ్గానే.. అవును పిల్లలు నిజమే అంటూ చాలా సంతోషంగా చెప్తుంది. చంభా మాత్రం ఈమెను బెలూన్‌ ను చేసి గాల్లోకి ఎగిరేస్తున్నారు. బంతిలా ఆడేసుకుంటున్నారు.. ఈవిడకు మాత్రం తెలియడం లేదు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో రాథోడ్‌ ఏంటి మనోహరి గారు ఏదో గాలిలో తేలిపోతున్నారు అని అడగ్గానే.. మనోహరి అవును రాథోడ్‌ నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండండి బై అంటూ పాట పాడుతూ వెళ్లిపోతుంది. దీంతో రాథోడ్‌ ఎలా ఉన్న మనోహరి గారు ఎలా అయిపోయారు.. ఏంటి యాదమ్మ మీ మనోహరి మేడం అలా అయిపోయారు అని అడగ్గానే.. ఏమో రాథోడ్‌ సార్‌ నాకేం తెలుసు అంటుంది.

దీంతో రాథోడ్‌ నీకు తెలియదా..? అనగానే.. తెలియదు సార్‌ మనోహరి మేడం అంటూ చంభా కూడా లోపలికి వెళ్లిపోతుంది. ఇంతలో అంజు అనుమానంగా రాథోడ్‌ ఎప్పుడూ సీరియస్‌గా ఉండో మనోహరి ఆంటీ ఇంత జోస్‌గా ఉందేంటి..? అని అడుగుతుంది. అమ్ము కూడా అవును రాథోడ్‌ హిట్లర్‌ లా ఉండే మనోహరి ఆంటీ జోకర్‌ లా చేస్తుందేంటి..? అని అడగ్గానే.. రాథోడ్‌ నవ్వుతూ ఇక నుంచి బఫూన్‌లా ఎంటర్‌ టైన్‌ చేస్తుంది అమ్ము అని చెప్పగానే.. ఆనంద్‌ నవ్వుతూ అంటే మనోహరి ఆంటీ కమెడియన్‌ అవుతుందా రాథోడ్‌ అని అడుగుతాడు. రాథోడ్‌ నవ్వుతూనే ఇన్నాళ్లు విలన్‌ అయిందిగా ఇప్పుడు కమెడియన్‌ అవుతుంది అని చెప్పగానే.. ఆకాష్‌ కూడా నవ్వుతూ మనోహరి ఆంటీ కామెడీ చేస్తే చండాలంగా ఉంది రాథోడ్‌ అంటాడు. దీంతో రాథోడ్‌ తప్పదు మరి భరించాలి. ఇక నుంచి ఆ కామెడీయే మనం చూడబోతున్నాం. సరే సరే మనం వెళ్లి బుజ్జితల్లిని చూసొద్దాం పదండి అంటూ అందరూ కలిసి కారు ఎక్కి వెళ్లిపోతారు.

Advertisement

మరోవైపు ఇంట్లోకి వెళ్లిన మనోహరి పాట పాడుతూ సంతోషంగా డాన్స్‌ చేస్తుంది. ఇంతలో అమర్‌ పైనుంచి వచ్చి మనోహరి అని పిలవగానే.. అలాగే చూస్తూ నవ్వుతుంటుంది. అమర్‌ కిందకు వస్తాడు. ఏంటి అమర్‌ అని మనోహరి అడగ్గానే.. అమర్‌ కోపంగా నువ్వు వెళ్లి పాపను తీసుకురా అని చెప్తాడు. మనోహరి అనుమానంగా  ఏ పాపను అని అడుగుతుంది. నా పాపని తను నా పాప నా దగ్గరే ఉండాలి అని చెప్పగానే.. మనోహరి షాక్‌ అవుతుంది. పిల్ల మాత్రమే వచ్చి తల్లి రాకపోతే నా పెళ్లి ఎలా అయ్యేది. అని మనసులో అనుకుంటూ అదేంటి అమర్‌ నీకు పాప మాత్రమే కావాలా..? భాగీ వద్దా అని అడుగుతుంది. అమర్‌ మరింత కోపంగా ఆ పేరే ఎత్తోద్దు మనోహరి. తను అంటే నాకు కోపం ధ్వేషం అసహ్యం అంటాడు. దీంతో మనోహరి మనసులో నాకు కావాల్సింది కూడా అదే అనుకుని అలా అంటావేంటి అమర్‌ ఎంతైనా భాగీ నీ భార్య. అరుంధతికి చెల్లెలు, ఏదో కారణం వల్ల నీకు దూరమైతే నువ్వు కూడా తనను దూరం పెడతావా..? గుడిలో నువ్వు తనతో అలా రాష్ గా మాట్లాడటం నాకు నచ్చలేదు అమర్‌. నాకు చాలా బాధేసింది. నేను చాలా ఫీల్‌ అయ్యాను అమర్‌. పాపం భాగీ ఇంకెంత హర్ట్‌ అయిందో.. అని చెప్తుంది.

చంభా మాత్రం మనోహరి మాటలకు షాక్‌ అవుతుంది. ఓర్నీ మీ వేషాలు ఎంత నటిస్తున్నారండి అని మనసులో అనుకుంటుంది. దీంతో మరింత కోపంగా అమర్‌ తను నన్ను హర్ట్‌ చేసిన దానికంటే నేనేం తనని హర్ట్‌ చేయలేదు అనగానే.. తెలియక తప్పు చేసింది క్షమించొచ్చు కదా అంటుంది మనోహరి. నేను ఎప్పటికీ తనను క్షమించను అంటాడు అమర్‌. దీంతో మనోహరి అలా అంటే ఎలా చెప్పు మీరు ఎంతైనా భార్యాభర్తలు. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా కలిసిపోయి కాపురం చేసుకోవాలి అని చెప్తుంటే.. చంభా మాత్రం మనసులో తెగేదాకా లాగకు మనోహరి. మళ్లీ సార్‌ మనసు మారింది అంటే నీ కొంప కొల్లేరు అవుతుంది అని అనుకుంటుంది. అమర్‌ మాత్రం కోపంగా అది ఎప్పటికీ జరగదు. మళ్లీ మేము కలిసి ఉండేది జరగదు అంటూ అమర్‌ వెళ్లిపోతుంటే.. మనోహరి మనసులో నాకు అదే కావాలి అమర్‌ అని అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×