E-Paper
Advertisement

Jai Hanuman: ‘జై హనుమాన్’ ప్రాజెక్ట్‌లోకి ఆస్కార్ విజేత.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీం..

Jai Hanuman: ‘జై హనుమాన్’ ప్రాజెక్ట్‌లోకి ఆస్కార్ విజేత.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీం..
Advertisement

Jai Hanuman: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ అనే భారీ సోషియో-ఫాంటసీ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ వెలువడింది. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దిగ్గజం ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించబోతున్నారు.

Read also-Naveen Krishna: పవిత్ర లోకేష్ గురించి నరేష్ కొడుకు చెప్పింది వింటే షాక్ అవుతారు!.. ఇంట్లో ఎలా ఉంటారంటే?

ప్రారంభమైన షూటింగ్

Advertisement

ఈ మెగా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రక నగరమైన హంపిలో అత్యంత వైభవంగా జరిగింది. హనుమంతుడి జన్మస్థలంగా భావించే కిష్కింధ (హంపి)లో సినిమాను ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలను నిర్వహించి, షూటింగ్‌ను అధికారికంగా మొదలుపెట్టింది. గత కొద్ది రోజులుగా ఎం.ఎం. కీరవాణి ఈ ప్రాజెక్ట్‌లో చేరబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ చిత్ర యూనిట్ అధికారికంగా ఆయన పేరును ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీరవాణి, ఇలాంటి భక్తిరస, యాక్షన్ చిత్రాలకు ప్రాణం పోయడంలో దిట్ట. ఆయన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, సినిమా స్థాయిని మరింత పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read also-Court Room Darama Series : బాస్ మీద వేధింపుల కేసు… కోర్టులో దద్దరిల్లే వాదనలు… ఓటీటీలోకి బెంగాలీ సిరీస్

తారాగణం

Advertisement

ఈ చిత్రంలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తుండగా, మొదటి భాగంలో కథానాయకుడిగా నటించిన తేజ సజ్జ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా వస్తున్న ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలతో కూడి ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ టి-సిరీస్‌తో కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా భారీ గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్స్‌తో రూపుదిద్దుకుంటున్న ‘జై హనుమాన్’ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా పాన్-వరల్డ్ స్థాయిలో పలు భాషల్లో విడుదల కానుంది. కీరవాణి వంటి దిగ్గజం ఈ ప్రాజెక్ట్‌లో చేరడంతో, అభిమానుల్లో సినీ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రశాంత్ వర్మ మేకింగ్, రిషబ్ శెట్టి నటన, కీరవాణి సంగీతం తోడైతే ఈ సినిమా మరో విజువల్ వండర్‌గా నిలవడం ఖాయం. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×