E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్ ను అనుమానించిన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today February 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్ ను అనుమానించిన మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: లోపలికి వెళ్లిన రాథోడ్‌ బుజ్జమ్మ ఇక బయలుదేరుదామా అని అడుగుతాడు. బుజ్జమ్మ ఎక్కడికి అంకుల్ అంటుంది. ఇంకెక్కడికి బుజ్జమ్మ ఆశ్రమానికి అంటాడు రాథోడ్‌. దీంతో పక్కనే ఉన్న మనోహరి అదేంటి చంభా భాగీ ఫోన్‌ చేసి బుజ్జమ్మను తీసుకురమ్మన్నట్టు చెప్తున్నాడు.. అనగానే.. భాగీ గురించి రాథోడ్‌కు తెలిసిపోయిందేమో మనోహరి అంటుంది చంభా.. ఇంతలో బుజ్జమ్మ ఈ రోజు ఇక్కడే ఉండమని మేడం చెప్పింది కదా అనగానే.. రాథోడ్‌ లేదమ్మా..నువ్వు వెళ్లి తీరాలి.. కావాలంటే మళ్లీ రేపు పొద్దున్నే వద్దువు కానీ అంటాడు. దీంతో మనోహరి అదేంటి రాథోడ్‌ ఆ పాప ఇక్కడే ఉంటాను అంటుంటే.. తీసుకెళ్తాను అంటున్నావు అనగానే.. రాథోడ్‌ ఆశ్రమం పిల్లలు బయట ఎక్కువ సేపు ఉండకూడదు మేడం.. మళ్లీ రేపు మనకు లేనిపోని ప్రాబ్లమ్స్‌ వస్తాయి అని చెప్పగానే..

మనోహరి మెల్లగా చంభాతో వీడికి భాగీ గురించి తెలియదు చంభా.. ఆశ్రమం పిల్లలు బయట ఉంటే వీడికి ప్రాబ్లమ్‌ వస్తుందని తీసుకెళ్తానంటున్నాడు అని చెప్తుంది. ఇంతలో రాథోడ్‌ రా బుజ్జమ్మ వెళ్దాం అంటూ తీసుకెళ్తూ.. బుజ్జమ్మ చేతిలో ఉన్న ఫోటో చూస్తాడు. ఆ ఫోటో చూడగానే.. రాథోడ్‌ షాక్‌ అవుతాడు. బుజ్జమ్మ అనగానే.. మనోహరి ఫోటో లాక్కుని ఇది మిస్సమ్మ ఫోటో అని మేము చెప్పలేదు రాథోడ్‌.. మిస్సమ్మ గురించి ఆ పాపకేం తెలియదట.. అని చెప్పగానే.. రాథోడ్‌ కోపంగా చూస్తూ.. మనసులో ఓహో నాకు ఇలా కవరింగ్‌ ఇస్తున్నావా..? మనోహరి. బుజ్జమ్మ ఎవరో పిల్లలకు తెలియకూడదనుకుంటున్నావా..? నాకు కావాల్సింది కూడా అదే.. అనుకుని భలే వారండి.. ఆ మాత్రం నాకు తెలియదా..? ఈ ఇంట్లో ఉండే మిస్సమ్మ గురించి ఆశ్రమంలో ఉండే ఆ పాపకేం తెలుస్తుంది. పైగా మిస్సమ్మ ఇప్పుడు మన ఇంట్లో లేదు కదా..?  అని చెప్పగానే..

Advertisement

మనోహరి కోపంగా చూస్తూ.. అది ఆశ్రమంలో ఉందిరా పిచ్చోడా..? కానీ అది నీ కంట పడదు దానికి నేను పెట్టిన భయం అలాంటిది.. అనుకుంటుంది. రాథోడ్‌ మాత్రం బుజ్జమ్మ టైం అవుతుంది. వెళ్దాం మనం అందరికీ బాయ్‌ చెప్పు అనగానే.. బుజ్జమ్మ అందరికీ బై చెప్తుంది. రాథోడ్‌ బుజ్జమ్మను తీసుకుని వెళ్లిపోతాడు. పిల్లలు రూంలోకి వెళ్లిపోతారు. చంభా అనుమానంగా రెండు రోజుల నుంచి రాథోడ్‌ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది మనోహరి వింత వింగా ప్రవర్తిస్తున్నాడు.. అని చెప్పగానే.. మనోహరి అనుమానంగా అంటే రాథోడ్‌కు భాగీ గురించి తెలిసినా కూడా నటిస్తున్నాడు అంటున్నావా..? అంటుంది. దీంతో చంభా అదే కదా నాకు డౌటుగా ఉంది. అనగానే.. సరే పదా చూద్దాం అంటూ ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు.. రాథోడ్‌ బుజ్జమ్మను తీసుకుని బయటకు రాగానే బయటే గార్డెన్‌లో ఉన్న అమర్‌ చూసి రాథోడ్‌ పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావు.. అని అడుగుతాడు.

రాథోడ్‌ ఆశ్రమానికి తీసుకెళ్తున్నాను సార్‌ అని చెప్పగానే.. అమర్‌ ఈ టైంలో ఎందుకు రేపు మార్నింగ్‌ తీసుకెళ్లోచ్చు కదా..? అంటాడు. దీంతో రాథోడ్‌ అంటే ఇందాక రాజు గారు ఫోన్‌ చేసి వార్డెన్‌ మేడం పాపను తీసుకుని రమ్మని చెప్పింది అన్నారు అనగానే.. అమర్‌ ఆలోచికస్తుంటాడు.. లోపల కిటికీలోంచి చూస్తున్న మనోహరి ఈ విషయం ఇందాక రాథోడ్‌ ఇంట్లో ఎందుకు చెప్పలేదు చంభా అంటుంది. దీంతో చంభా అందుకే రాథోడ్‌ మీద నాకు అనుమానం వస్తుంది అంటుంది. అమర్‌ ప్రేమగా బుజ్జమ్మ మళ్లీ రేపు వస్తావుగా అంటాడు. దీంతో బుజ్జమ్మ నేను రాకపోయినా మీరు తీసుకొస్తారు కదండి అంటుంది. దీంతో అమర్‌ తప్పకుండా తీసుకొస్తాను బుజ్జమ్మ నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అంటూ కిస్‌ చేసి బుజ్జమ్మను పంపిస్తాడు.

Advertisement

కిటికీలోంచి చూస్తున్న చంభా ఆ పిల్ల ఏదో సొంత కూతురు అయనట్టు అమరేంద్ ద్ర ఎలా ఫీల్‌ అవుతున్నాడో చూడు మనోహరి అనగానే.. మనోహరి కోపంగా కన్న కూతురేగా చంభా అంటుంది. రాథోడ్‌ మాత్రం బాధగా బుజ్జమ్మ మీ కన్నకూతురు అని తెలియకుండానే.. మీరు ఇంతలా ప్రేమిస్తున్నారు సార్‌.. ఒకవేళ మీకు తెలిస్తే.. ఇంకెంతలా ప్రేమిస్తారో.. అని మనసులో అనుకుంటూ బాధపడతాడు. ఇంతలో బుజ్జమ్మ అమర్‌కు గుడ్‌ నైట్‌ చెప్పి బయలుదేరుతుంది. అమర్‌ లోపలికి వెళ్లిపోతుంటే.. మనోహరి, చంభా కిటికి దగ్గర నుంచి పక్కకు వెళ్తారు.. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×