E-Paper
Advertisement

The Protector on OTT : షైన్ టామ్ చాకో థ్రిల్లర్‌ స్ట్రీమింగ్ షురూ… ఈ ఓటీటీలోనే అందుబాటులో

The Protector on OTT : షైన్ టామ్ చాకో థ్రిల్లర్‌ స్ట్రీమింగ్ షురూ… ఈ ఓటీటీలోనే అందుబాటులో
Advertisement

The Protector on OTT : మలయాళం సినిమాలకు ఓటిటిలలో అన్ని భాషల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. కొంతమంది కేవలం మలయాళం సినిమాల కోసమే ఓటీటీలలో సెర్చ్ చేస్తారంటే అతిశయోక్తి కాదు. మాలీవుడ్ మేకర్స్ సినిమాలలో ఉండే సింప్లిసిటీ అలాంటిది మరి. ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారి కోసమే మరో కొత్త మలయాళం మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టింది. మరి ఆ మూవీ పేరేంటి ? ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

మనోరమ మాక్స్ (Manorama Max)లో స్ట్రీమింగ్

మలయాళ థ్రిల్లర్ మూవీ ‘ది ప్రొటెక్టర్’ (The Protector). థియేటర్లలో రిలీజ్ అయిన ఆరు నెలల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్ లో తాజాగా అందుబాటులోకి వచ్చింది. 2025 ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. అయితే ఆకట్టుకునే కథాంశం, సస్పెన్స్ జోనర్లో రూపొందడం అనేది ఈ సినిమాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ మనోరమా మాక్స్ అనే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 13 నుంచి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. కానీ పెద్దగా హడావిడి లేకుండా ఈ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చారు మేకర్స్. థియేటర్లలో ఆశించిన రెస్పాన్స్ దక్కనప్పటికీ ఓటీటీలో మాత్రం ఈ మూవీ ఆడియన్స్ ను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

ఈ సినిమాలో షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించారు. సీఐ సత్య అనే పాత్రలో ఆయన కనిపిస్తారు. హీరోయిన్ గా డయానా హమీద్ నటించింది. బోబన్ అలుమూడన్, ఉన్ని రాజా, కాజల్ జాన్సన్, దేవి చందనా, శాంత కుమారి, సీమ మధు, సుధీర్ కరమణ, మని కుట్టన్, శివాజీ గురువాయూర్, తలైవాసల్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ ఎంజి మను ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటిలో మలయాళం, తమిళం, తెలుగు భాషలలో అందుబాటులో ఉంది. ఉత్తర మలబార్ లోని మనక్కల్ ప్రాంతం నేపథ్యంలో ఈ థ్రిల్లర్ రూపొందింది. మనక్కల్ లో జరిగిన చారిత్రక సంఘటనలను ఇందులో ఆసక్తికరంగా చూపించారు. మరి మీరు కూడా ఈ మూవీని చూడాలంటే ముందుగా స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Also Read : 8.5 IMDb రేటింగ్… 18 శక్తి పీఠాల కథ… ఆదిశక్తి అవతారాలు చూస్తే పూనకాలే

కథలోకి వెళ్తే…

Advertisement

సిఐ సత్య చుట్టు ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఆయన పోలీస్ శాఖలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పని చేస్తారు. మనక్కల్ ప్రాంతంలో జరిగిన ఓ హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుండగా, ఆ విచారణ అతన్ని గతంలోని రహస్యాల వైపు తీసుకెళ్తుంది. మనక్కల్, బ్రిటిష్ కాలంలో విధేయతకు మారుపేరు అని చెప్పుకునే ప్రాంతం. ఈ ప్రాంతం చుట్టూ ఎన్నో గందరగోళాన్ని కలిగించే ఆశ్చర్యకరమైన కథలు అల్లుకుని ఉంటాయి. గతంలో జరిగిన ఓ చారిత్రాత్మక మిస్టరీ చుట్టూ ఉన్న రహస్యాన్ని చేదించడానికి ప్రయత్నిస్తాడు సత్య. హర్రర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో గతం, ప్రస్తుత హత్యల మధ్య ఉన్న లింక్ బయట పడుతుంది. అసలు ఆ ప్రాంతంలో జరిగిన గత సంఘటనలు ఏంటి ? ఇన్వెస్టిగేషన్లో హీరో కనిపెట్టిన షాకింగ్ విషయం ఏంటి ? చివరికి ఏమైంది ? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×