E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మ ఫోన్ ట్రేస్ చేయమన్న అమర్

Nindu Noorella Saavasam Serial Today Episode April 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మ ఫోన్ ట్రేస్ చేయమన్న అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లో పిల్లలు  హోం వర్క్‌ చేసుకుంటూ ఉంటారు. వారితో రాథోడ్‌ వర్క్‌ చేయిస్తుంటాడు. చూడండి పిల్లలు ఎగ్జామ్స్‌ దగ్గర పడుతున్నాయి. మీరు బాగా చదవాలి అని చెప్పగానే.. అంజు ఇరిటేటింగ్‌ గా నువ్వు ఇలా మా ముందు తిరుగుతూ ఉంటే మాకు కాన్‌సంట్రేషన్‌ రావడం లేదు రాథోడ్‌ అంటుంది. దీంతో ఆనంద్‌ కూడా అవును రాథోడ్‌ నువ్వు అటూ ఇటూ తిరగకుండా ఒక చోట కూర్చోవచ్చు కదా అంటాడు. ఆకాష్‌ కూడా కుదురుగా కూర్చుంటే మాకు కాన్‌సంట్రేషన్‌ వచ్చి చదువుకుంటాం రాథోడ్‌ అని చెప్పగానే.. రాథోడ్‌ నవ్వుతూ కూర్చుంటే నాకు నిద్ర వస్తుంది బాబు అని చెప్పగానే.. అంజు వెంటనే అప్పుడు నిద్రపో రాథోడ్‌ మేము కూడా నిద్ర పోతాం అని చెప్పగానే.. రాథోడ్‌ నేను నిద్రపోను.. మిమ్మల్ని ఎవ్వరినీ నిద్ర పోకుండా  చదివిస్తాను. రాథోడ్‌ ఆన్‌ డ్యూటీ అనగానే..

అంజు మనసులో ఇంట్లో డాడీ లేనప్పుడు బాగానే డ్యూటీ చేస్తావు అని అనుకుంటుంది. దీంతో రాథోడ్‌ ఏంటమ్మా గునుగుతున్నావు ఓసారి డాడీకి ఫోన్ చేయమంటావా..? అనగానే.. అంజు ఏమీ వద్దులే చదువుతాను అంటుంది. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చున్న యాదమ్మ.. నాకు నిద్ర వస్తుంది నేను వెళ్లి పడుకోనా రాథోడ్‌.. అనగానే.. రాథోడ్ కోపంగా పిల్లలు మేల్కొని చదువుతున్నారు నీకు నిద్ర వస్తుందా..? పిల్లలు నిద్ర పోయేంత వరకు నువ్వు నిద్ర పోకూడదు.. అయినా నువ్వు మాకు పనిమనిషివా..? లేక మేము నీకు పనిమనుషులమా..? నోరు మూసుకుని మెలుకువగా ఉండు.. మీరు చదవండి అంటూ పిల్లలకు చెప్తాడు. ఇంతలో మిస్సమ్మ కాల్ చేయగానే.. అంజు కాల్‌ లిఫ్ట్‌ చేస్తుంది. ఏం చేస్తున్నారు అంజు అని అడగ్గానే.. రాథోడ్‌ చండశాసనుడిలాగా మారిపోయి మాతో బలవంతంగా చదివిస్తున్నారు మిస్సమ్మ.. అని చెప్పగానే..

Advertisement

ఎగ్జామ్‌ దగ్గరకు వస్తున్నాయి కదా చదవాలి అంజు అని మిస్సమ్మ చెప్పగానే.. అంజు మాత్రం చదువు విషయలో మీ పెద్ద వాళ్లంతా ఒకేమాట ఉంటారు కదా..? అంటుంది. దీంతో మిస్సమ్మ మీరు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలని మా ఆశ. ఇంతకీ భోజనం చేశారా..? అని అడగ్గానే.. ఇందాకే తిన్నాం.. నువ్వు డాడ్‌ గొడవ పడటం లేదు కదా..? అని అడగ్గానే.. లేదు.. బుజ్జమ్మ ఏం చేస్తుంది అని అడగ్గానే.. నా పక్కనే ఉంది ఇస్తున్నాను.. మాట్లాడు.. అని బుజ్జమ్మకు ఫోన్‌ ఇస్తుంది అంజు. మిస్సమ్మ హలో చిట్టి తల్లి ఎలా ఉన్నావు అంటూ పలకరిస్తుంది. అప్పుడే డోర్‌ తెరచి చూసిన అమర్‌ ఎవరితో ఫోన్‌ మాట్లాడుతుంది  అని అనుకుంటాడు. ఫోన్‌లో మిస్సమ్మ ఐ మిస్‌ యూరా బంగారం అనగానే.. అమర్‌ బంగారమా..? అని అనుమానిస్తాడు. మిస్సమ్మ మాత్రం బుజ్జమ్మతో సారీరా బంగారం నీకు దూరంగా ఉండాలని నాకు మాత్రం ఉంటుందా..? చెప్పు.. తప్పని సరి పరిస్థితుల్లో వచ్చాను అని చెప్తుంది.

దీంతో అమర్ దూరంగా ఉంటున్నాను అంటుందంటే నా కూతురుతో మాట్లాడుతుందా..? అని అనుమానిస్తాడు. మిస్సమ్మ ఫోన్‌లో నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా నాన్న అనగానే.. అమర్‌ కోపంగా దొంగముఖంది.. నాకు తెలియకుండా నా కూతురును ఎక్కడో దాచి పెట్టి ఇప్పుడు నేను అనుకుని దొంగచాటుగా నా కూతురుతో ఫోన్‌ మాట్లాడుతుంది. చెప్తా.. అనుకుంటూ వెళ్లిపోతాడు అమర్‌.  బయటకు వెళ్లిన అమర్‌  రాథోడ్‌కు కాల్‌ చేస్తాడు. రాథోడ్‌ కన్పీజ్‌గా సార్‌ ఫోన్‌ చేస్తున్నారేంటి..? మిస్సమ్మ పిల్లలతో లైన్‌లోనే ఉంది. అంటే సారు మిస్సమ్మ ఒక ప్లేస్‌లో లేరా… అనుకుంటూ పక్కకు వెళ్లి కాల్‌ లిఫ్ట్‌ చేస్తాడు రాథోడ్‌..

Advertisement

చెప్పండి సార్‌ కాశ్మీర్‌ ఎలా ఉంది అని అడగ్గానే.. కాశ్మీర్‌ ఎప్పటిలాగే చల్లగా ఉంది కానీ ఏం చేస్తున్నావు రాథోడ్‌ అని అమర్‌ అడగ్గానే.. పిల్లలను చదివిస్తున్నాను సార్‌ అని రాథోడ్‌ చెప్పగానే.. మనం పిల్లల కోసం ఇంత కష్టపడుతుంటే. ఆ దొంగముఖంది నా కూతురుతో మాట్లాడుతుంది. వెంటనే ఆ ఫోన్‌ ట్రేస్‌ చేయమని ఆఫీసుకు చెప్పు అంటాడు. రాథోడ్‌ నవ్వుకుంటూ సరే సార్‌ అంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×