E-Paper
Advertisement

బిగ్ బాస్ దశావతారంలో కొత్త రూల్స్.. అలా చేస్తే భారీ జరిమానా!

బిగ్ బాస్ దశావతారంలో కొత్త రూల్స్.. అలా చేస్తే భారీ జరిమానా!
Advertisement

Bigg Boss 10: పాశ్చాత్య దేశాలలో బిగ్ బ్రదర్ పేరిట ప్రారంభమైన ఈ రియాలిటీ షో హిందీలో బిగ్ బాస్ పేరిట ప్రారంభమై అన్ని భాషల ఆడియన్స్ ను మెప్పించింది. ప్రస్తుతం ఒక్కో భాషలో 9కి పైగా సీజన్లను పూర్తి చేసుకుంటూ.. ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ రియాల్టీ షోలలో సెలబ్రిటీలకే కాదు సామాన్య ప్రజలకి కూడా అవకాశం కల్పిస్తూ ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తోంది. ఇకపోతే మిగతా భాషలతో పోల్చుకుంటే ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 10 అని కాకుండా “బిగ్ బాస్ దశావతారం” అంటూ సరికొత్త స్ట్రాటజీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

బిగ్ బాస్ దశావతారంలో కొత్త రూల్స్..

ఎప్పటిలాగే కింగ్ నాగార్జున ఈసారి కూడా హోస్ట్ గా ఈ కార్యక్రమానికి వ్యవహరించబోతున్నారు. పైగా బిగ్ బాస్ దశావతారం అంటూ ప్రకటిస్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. ఈ వీడియో అటు ఆడియన్స్ లో ఇటు బిగ్ బాస్ లవర్స్ లో అంచనాలు పెంచేసింది. పైగా సామాన్యులకు అవకాశం కల్పిస్తూ అగ్నిపరీక్షకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. సరిగా ఇలాంటి సమయంలో తాజాగా బిగ్ బాస్ దశావతారం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అలా చేస్తే కచ్చితంగా లక్షల్లో జరిమానా కట్టాల్సిందే అంటూ షరతు పెట్టినట్లు కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

also read:అనిల్ నీ మాస్టర్ ప్లాన్ ఏంటయ్యా?

బ్రేక్ చేస్తే రూ.10 లక్షలు జరిమానా..

తెలుగులో త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ దశావతారం లో కొత్త రూల్స్ అంటూ ఒక లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లిస్ట్ విషయానికి వస్తే.. సీజన్ 10 లో పాల్గొనే కంటెస్టెంట్స్ మధ్య బూతులు తిట్టుకోడాలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడితే ఫైన్ కట్టాల్సిందే. మతం, భాష పేరుతో కంటెస్టెంట్స్ ను రెచ్చ కొడితే రూ.10లక్షల వరకు జరిమానా విధించబడుతుంది. అలాగే పారితోషకం నుంచే డైరెక్ట్ గా కట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎనిమిది మంది కామన్ పీపుల్స్ 12 నుండి 14 మంది సెలబ్రిటీలు ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారట. మొత్తానికైతే గత కొంతకాలంగా బిగ్ బాస్ రియాల్టీ షోలో వ్యక్తిగత దూషణలు, మతం, భాష పేరుతో రెచ్చగొట్టడాలు వంటివి ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలోనే ఈ దశావతారంలో అలాంటి విమర్శలకు చోటు ఇవ్వకుండా ఇలాంటి కఠిన రూల్స్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే హౌస్ లో ఉండబోయే సెలబ్రిటీలు, కామన్ పీపుల్స్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కెమెరాల ముందు జీవించాల్సి ఉంటుంది.

హోస్ట్గా నాగార్జున రెమ్యూనరేషన్..

Advertisement

హోస్ట్ నాగార్జున విషయానికి వస్తే.. వారానికి రెండుసార్లు కనిపించే నాగార్జున.. వారంలో జరిగే మొత్తం విషయాలను ఆ రెండు రోజుల్లో చూపిస్తూ కంటెస్టెంట్స్ తప్పొప్పులను బయటపెడుతూ పర్ఫెక్ట్ హోస్ట్ అని నిరూపించుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుండి హోస్ట్ గా కొనసాగుతున్న ఈయన తన అద్భుతమైన వాక్చాతుర్యంతో పర్ఫెక్ట్ హోస్టింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఈసారి ఏకంగా రూ .35 నుండి 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×