E-Paper
Advertisement

Mukkupudaka Avani : ‘ముక్కుపుడక ‘ అవని ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Mukkupudaka Avani : ‘ముక్కుపుడక ‘ అవని ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Mukkupudaka Avani : తెలుగు బుల్లితెర ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న వాటిలలో సీరియల్స్ టాప్ లో ఉన్నాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య జనాలు కూడా సినిమాలు కన్నా ఎక్కువగా సీరియల్స్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో జనాలను ఆకట్టుకునే విధంగా బుల్లితెర ఫ్లాట్ ఫామ్ లు కొత్త కొత్త సీరియల్స్ ని ప్రసాదం చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. జీ తెలుగులో ఈ మధ్య వచ్చే ప్రతి సీరియల్ కూడా జనాలను మెప్పిస్తుంది ఇందులో ముక్కుపుడక సీరియల్ హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వార్త హార్ట్ టాపిక్ గా మారింది. జీ తెలుగులో ప్రసారమవుతున్న ముక్కుపుడక సీరియల్ లోని ఐశ్వర్య బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలని జనాలు ఆత్రుత కనబరుస్తున్నారు.. మరి ఐశ్వర్య గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం…

ఐశ్వర్య పిస్సే రెమ్యూనరేషన్..?

తెలుగు బుల్లితెర పై కన్నడ ముద్దుగుమ్మల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది సీరియల్ హీరోయిన్లు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు కన్నడలో వరుసగా సినిమాలు సీరియల్స్ చేసిన ముద్దుగుమ్మలు ఇప్పుడు తెలుగులో సీరియల్స్లలో హీరోయిన్ పాత్రలోను ఘటిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. అలాంటి వారిలో ఐశ్వర్య పిస్సే ఒకరు.. కన్నడ ముద్దుగుమ్మయిన ఈమె తెలుగులో అగ్నిసాక్షి అనే సీరియల్ ద్వారా అడుగు పెట్టింది. ఆ సీరియలు జనాలని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేరుకే కన్నడ అమ్మాయి అయినా కూడా అచ్చం తెలుగమ్మాయిలాగా ఈ ముద్దుగుమ్మ కనిపించడంతో తెలుగు అభిమానులు ఆమెకు నీరాజనం పలికారు.. కేవలం ఒక్క సీరియల్ తోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఈమె వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే.. అయితే ఈమెకు ఒక సీరియల్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. నిజానికి ఈమె ఒకరోజు కు దాదాపు 45 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఎక్కడ చూస్తే ఈ ముద్దుగుమ్మ నెలకి దాదాపు లక్షల్లోనే సంపాదిస్తుందని అర్థమవుతుంది.

ముక్కుపుడకలో అవని.. 

Advertisement

బుల్లితెర నటి, కన్నడ కుట్టి ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో, నటనతో మంచి గుర్తింపు అందుకుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సీరియల్ లో కూడా నటించింది. ఈమె కన్నడలో పలు సినిమాలలో కూడా నటించింది. కస్తూరి సీరియల్ లో కూడా నటించింది. ఇక ఈ సీరియల్ కంటే ముందు అగ్ని సాక్షి సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న ముక్కుపుడక అనే సీరియల్లో నటిస్తుంది. ఈమె నటించిన సీరియల్ అత్యధిక రేటింగ్ తో దూసుకుపోగా.. ఈ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఐశ్వర్య. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోలతో అభిమానులను పలకరిస్తుంది.. ఈమె ఫోటోలకు ఫాన్స్ ఎక్కువే.. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు మరోవైపు బిజినెస్ కూడా చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా కన్నడ ముద్దుగుమ్మలకు తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×