E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలుకు నిజం చెప్పిన మీనా.. దిష్టి ఫోటోను చూసి మనోజ్ షాక్.. రచ్చ చేసిన ప్రభా..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు నిజం చెప్పిన మీనా.. దిష్టి ఫోటోను చూసి మనోజ్ షాక్.. రచ్చ చేసిన ప్రభా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 23rd: బాలు మీనా గుడికి వెళ్లొచ్చిన తర్వాత శృతిని లాప్టాప్ తీసుకొని రమ్మని బాలు అడుగుతాడు. ఇప్పుడే ప్రభావతి మనోజ్ రోహిణి ముగ్గురు కూడా గుడి నుంచి ఇంటికి వస్తారు. అయితే ఆ వీడియోని చూసిన సత్యంతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నవ్వుకుంటారు.. అది ఏంటి అని అడిగితే వీడే ఏదో పూజ అని తీసుకెళ్లాడు అని ప్రభావతి అంటుంది. ఇక అప్పుడే మనోజ్ షాప్ లోని ఒక వ్యక్తి అక్కడికి వచ్చి అసలు నిజాన్ని చెప్పడంతో అందరూ మనోజ్ కి ప్రభావతికి వెర్రి అని నవ్వుకుంటారు. పిచ్చి పనులు చేస్తారు కాబట్టి అందరు మిమ్మల్ని ఇలా అనుకుంటున్నారు అని అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటారు..

మీనా వెంటపడ్డ మనోహర్..

మీనా వెంట ఓ వ్యక్తి పడుతూ తనను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. నేను మీతో మాట్లాడాలి మీ గురించి నేను చాలా అనుకున్నాను అని.. ఎంత చెప్పినా సరే అతను మాత్రం ఏం మాట్లాడినా మౌనంగా ఉంటుంది మీనా.. మీరు నాకు బాగా నచ్చారు అని మీనా ను అతను విసిగిస్తాడు. మీనా ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సరే అతను మాత్రం వినకుండా తన వెంట పడుతూ ఉంటాడు. వీడికి ఏమైనా పిచ్చా నా వెంట పడుతున్నాడు అని మీనా ఈ విషయాన్ని బాలుకి వెంటనే చెప్పాలని అనుకుంటుంది.. ఆ వ్యక్తి గురించి బాలుకు చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు..

మీనాకు భరోసా ఇచ్చిన బాలు..

Advertisement

ఏవండీ మీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను.. ఓ వెధవా నా వెనకాల పడుతూ విసిగిస్తున్నాడండి అని మీనా చెప్పగానే బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఓ వెధవ నీ వెనకాల పడుతూ విసిగిస్తున్నాడా ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అని బాలు అంటాడు. వాడితో మాట్లాడితే సరిపోతుంది అనుకున్నాను కానీ వాడు మాట్లాడిన ఆగే రకం లాగా కనిపించడం లేదు అని చెప్పగానే.. ఈసారి వాడు నీ వెనకాల పడితే నాకు చెప్పు వాడి సంగతి నేను చూసుకుంటాను అని బాలు అంటాడు.. ముందు నువ్వు ఒక పెప్పర్స్ పై తీసుకొని పెట్టుకో ఈసారి నీ వెనకాల వాడు పడితే వాడి కళ్ళల్లో కొట్టు అని సలహా కూడా ఇస్తాడు.

సుమతికి నిజం చెప్పిన మీనా..

మీనా ఎక్కడ పువ్వులు ఇవ్వడానికి వెళ్తే అక్కడికి ఆ మనోహర్ రావడంతో మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. వీడి పీడ ఎలాగైనా వదిలించుకోవాలి అని పెప్పర్ స్ప్రే తీసుకొని వాడి దగ్గరికి వెళ్ళగానే వాడు అక్కడి నుంచి పారిపోతాడు. ఎదురుగా సుమతి రావడంతో తనకు తన వెంట పడుతున్న వ్యక్తి గురించి నిజం చెప్తుంది మీనా.. వాడు ఎందుకు వెంట పడుతున్నాడో తెలుసుకొని వాడికి బుద్ధి వచ్చేలా చేయాలి అని సుమతి అంటుంది. ఈసారి వెంటపడితే వారిని కచ్చితంగా దుమ్ము దులిపేస్తాను అని మీనా అంటుంది.

ప్రభా దిష్టిబొమ్మను చూసి షాక్..

Advertisement

మనోజ్, రోహిణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండదా ఓ వ్యక్తి దిష్టిబొమ్మల ఫోటోలను తీసుకొని లోపలికి వస్తాడు.. ఆ దిష్టిబొమ్మలను చూసి ఎక్కడో చూసినట్లు ఉంది అని అనుకుంటారు. అయితే ఆ దిష్టిబొమ్మ దగ్గరనుంచి చూసిన రోహిణి ఎవరో కాదు అత్తయ్య అని అనగానే మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. ఆ ఫోటోలు ఎక్కడ అమ్మడానికి వీల్లేదని అతని దగ్గర ఉన్న ఫోటోలు అన్నిటిని తీసుకుంటాడు మనోజ్. ఇక ఒక ఫోటోని ఇంటికి తీసుకెళ్లగానే అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు. ఇదంతా మీనా వల్లే జరిగింది అని ప్రభావతి ఇల్లంతా పీకి పందిరి చేస్తుంది..

బాలు దెబ్బకు మైండ్ బ్లాక్..

మా అమ్మ గురించి ఇన్ని రోజులు తెలీదు ఇలా కూడా మా అమ్మని వాడుకోవచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది. 100 ఫోటోలు అమ్మితే 20,000 సంపాదించుకోవచ్చు. మా అమ్మ ఇలా కూడా ఉపయోగపడుతుందని అనగానే ప్రభావతి ఇంకాస్త రెచ్చిపోయి మీనా అని తిడుతుంది. ఆరోజు ఇది నా మీద పిండి వేయడం వల్లే ఇదంతా జరిగింది అని అంటుంది. ఇక సత్యం కూడా వీళ్ళకి తోడవడంతో అందరూ కలిసి ప్రభావతిని ఒక ఆట ఆడుకుంటారు. బాలు సెటైర్లకి ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది..

మనోజ్ కు గుడ్ న్యూడ్..

ప్రభావతి దిష్టి ఫోటోని మనోజ్ షాప్ లోని వ్యక్తి అక్కడ పెట్టి పూలు వేసి పూజిస్తూ ఉంటాడు. అది చూసిన మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ ఫోటోని మా అమ్మ గనుక చూస్తే నన్ను చంపేస్తుంది. ఇకనుంచి తీయు అని అంటాడు కానీ అప్పుడే ముఖేష్ తనకి లాభాలు వచ్చిన విషయాన్ని చెప్పడంతో చాలా సంతోషంగా ఉంటాడు. అంతేకాదు ఆ దిష్టిబొమ్మ ఉండడంతో ఇల్లు కూడా కొనాలన్నా ఆలోచన కూడా వచ్చింది అని చాలా సంతోషంగా ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : కేశవ, చక్రీలకు మహా స్ట్రాంగ్ వార్నింగ్.. కన్నా ఎమోషనల్.. మాధవ్ కు నిజం చెప్పిన కవిత..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×