E-Paper
Advertisement

శ్రీముఖి చేసిన పని ఎప్పటికీ మర్చిపోను.. జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్!

శ్రీముఖి చేసిన పని ఎప్పటికీ మర్చిపోను.. జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్!
Advertisement

Sree Mukhi:సినిమా అయినా సీరియల్ అయినా షో అయినా రియాల్టీ షో అయిన ఏదైనా సరే సెలబ్రిటీలు తెరపై కలగోలుపుగా కనిపించడమే కాదు నిజ జీవితంలో కూడా ఒకరి కోసం ఒకరు అండగా నిలుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తన జీవితంలోకి దేవతలా వచ్చి తనను కాపాడింది అని, ఆమె లేకపోతే ఈరోజు ముక్కు అవినాష్ మీ ముందు నిలుచుండేవాడు కాదు అంటూ శ్రీముఖి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు అవినాష్ . మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మేడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా -ముక్కు అవినాష్

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్ బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో తో కూడా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం టీవీ ప్రోగ్రాంలో.. సినిమాలతో బిజీగా ఉంటున్న ఈయన.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు
అవినాష్ మాట్లాడుతూ..” హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొన్నాను. అయితే అదే సమయంలో కరోనా లాక్ డౌన్ వచ్చి పడింది. పని లేక ఇంటికి ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాను. ఇక ఆ నరకం నుంచి బయటపడడానికి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. అంతలోనే బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. రియాల్టీ షోలో పాల్గొనమన్నారు.అది పెద్ద అవకాశం అనిపించింది.

ఆమె వల్లే సాధ్యం.. అప్పులన్నీ తీర్చేశా – ముక్కు అవినాష్

Advertisement

వెంటనే జబర్దస్త్ టీంని సంప్రదిస్తే బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉందని , మేనేజ్మెంట్ కి చెబితే అగ్రిమెంట్ ఉంది కాబట్టి రూ.10 లక్షలు ఫైన్ కట్టాలని చెప్పారు. అప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాలను చెబితే యాజమాన్యం కొంతైనా తగ్గుతుందనుకున్నాను కానీ పూర్తిగా పదిలక్షలు కట్టాల్సిందే అన్నారు. ఇక వాళ్ళనేమి నేను తప్పు పట్టడం లేదు. వాళ్ళ రూల్స్ అలా ఉన్నాయి. ఎనిమిదేళ్లు చేశాను కదా కాస్త దయ చూపిస్తారు అనుకున్నాను. కానీ అలా జరగలేదు. 10 లక్షల కోసం చాలా చోట్ల అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, శ్రీముఖి నాకు సహాయపడ్డారు. అలా మొత్తం పది లక్షలు కట్టి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను.. దానికంటే ఎక్కువ డబ్బే వచ్చింది. మంచి రెమ్యూనరేషన్ ఇవ్వడంతో నా అప్పులు కూడా తీర్చేశాను” అంటూ తెలిపారు.

శ్రీముఖి కెరియర్..

ఇకపోతే ముఖ్యంగా శ్రీముఖి తనకు ఆర్థికంగా అండగా నిలిచిందని.. ఆమె లేకపోతే నేడు ఇలా ఉండేవాడిని కాదు అంటూ తెలిపారు అవినాష్. ఇక ప్రస్తుతం అవినాష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరొకవైపు శ్రీముఖి, అవినాష్ ఇద్దరు కలిసి ఆదివారం విత్ స్టార్ మా పరివార్ షోలో యాంకర్లుగా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక శ్రీముఖి ఒకవైపు కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూనే.. మరొకవైపు పలు బుల్లితెర షోలలో సందడి చేస్తోంది. ఇప్పుడు సమంత హీరోయిన్ గా నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న మా ఇంటి బంగారం సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది.

Advertisement

 

Also read: పోలింగ్ డ్యూటీలో జననాయగన్ సినిమా చూసిన ఆఫీసర్.. అధికారులు ఏం చేశారంటే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×