E-Paper
Advertisement

మాజీ ఎమ్మెల్యేకు పరోక్షంగా చురకలు.. కార్యకర్తలకు సీఎం చంద్రబాబు హితవు, ఓ పార్టీని వెంటాడున్న ఓసీడీ

మాజీ ఎమ్మెల్యేకు పరోక్షంగా చురకలు.. కార్యకర్తలకు సీఎం చంద్రబాబు హితవు, ఓ పార్టీని వెంటాడున్న ఓసీడీ
Advertisement

Amaravati: అధికారం ఉందని ఎవరైనా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరేనని తేల్చేశారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు. ప్రజలు తమను వాచ్ చేస్తున్నారని, వేసే అడుగు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫ్లెక్సీలు, కుర్చీలు, ఫోటోల దగ్గర చిన్నపాటి కలహాలు రావడానికి వీల్లేదన్నారు. ఇలాంటివి చాలా సార్లు చూస్తున్నానని, అందుకే మళ్ళీ మళ్లీ చెప్పాల్సి వస్తుందన్నారు. మీ ప్రవర్తనను దిగువస్థాయి వారికి నేర్చించాలన్నారు. తప్పు చేస్తే మీడియాలో హెడ్‌లైన్స్ వస్తున్నాయని అన్నారు. ఈ విషయాలను గుర్తు పెట్టకుని అడుగులు వేయాలన్నారు.

మాజీ ఎమ్మెల్యేకు పరోక్షంగా సీఎం చంద్రబాబు చురకలు

Advertisement

సరిగ్గా వారం కిందట పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ-జనసేన నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం తారాస్థాయికి చేరింది. అధికార పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఫ్లెక్సీ లేకపోవటంతో కూటమి నేతల మధ్య చిన్నపాటి ఘర్షణకు దారి తీసింది. ఈ విషయమై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఫోటో లేకపోవటంపై టీడీపీ ఇంఛార్జి వర్మ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో జనసేన నేత దొరబాబు జోక్యం చేసుకోవటంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాతోపాటు మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగిన విషయం తెల్సిందే.

బుధవారం అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దీనికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కార్యకర్తలు, నేతలకు కీలక సూచనలు చేశారు. అనుభవం, యువశక్తితో కొత్త కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

ఓ పార్టీని వెంటాడున్న ఓసీడీ.. క్రెడిట్ చోరీ అందులో భాగమే

సీనియర్లను గౌరవిస్తూ, కొత్త వారికి అవకాశం ఇచ్చామన్నారు. కష్టపడ్డ వారికి కమిటీల్లో అవకాశం కల్పించామని, కొత్త టీమ్‌తో పాటు పార్టీకి కొత్త శక్తి రావాలన్నారు. కార్యకర్తే అధినేత అనేది మన సిద్ధాంతమని తేల్చి చెప్పారు.  గొడ్డలి పార్టీ చేస్తున్న చెడును ప్రజలకు పదే పదే చెప్పాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇప్పుడు కుట్రలకు పాల్పడుతున్నారని వివరించారు.

ఈ తరహా పార్టీకి ప్రజాసంక్షేమం పట్టదన్నారు. వారు అభివృద్ధిని ఇష్టపడరని, పెట్టుబడులు వస్తున్నాయంటే విమర్శలు చేస్తారన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అనుకుంటే క్రెడిట్ తీసుకోవాలని భావిస్తున్నారని అన్నారు. నిధులు రాకుండా అడ్డుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడం, ఇలాంటి కుట్రలకు కాలం చెల్లిందన్నారు.

ALSO READ: జగన్ మాజీ సీపీఆర్‌ఓ శ్రీహరి మళ్లీ కష్టాలు.. బెంగుళూరులో అరెస్ట్, ఏపీకి తరలించిన కుప్పం పోలీసులు

వీటిని ఎదుర్కొనే శక్తి కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు. రాష్ట్రంలో ఓ పార్టీకి ఓసీడీ పట్టుకుందన్నారు. ఇదొక వ్యాధి అని, దాన్ని అందరికీ అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇప్పుడు  క్రెడిట్ డిజార్డర్ చోరీగా మారిందన్నారు. మెటల్ ఇన్‌నెస్‌లో భాగమే ఓసీడీ అని అన్నారు. వారి ఆశయాలకు అడ్డంగా ఎవరైనా వస్తే ఎంతకైనా తెగిస్తారన్నారు. వారిని వదిలిపెడితే దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి తాము ఆలోచించామని చెబుతారని, ఆ విధంగా వారి మనతత్వం ఉందన్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×