E-Paper
Advertisement

Kissik Talks: చుట్టూ బ్యాడ్ పీపుల్ ఉన్నారు.. మనం తట్టుకోలేని ఇష్యూ ఇది!

Kissik Talks: చుట్టూ బ్యాడ్ పీపుల్ ఉన్నారు.. మనం తట్టుకోలేని ఇష్యూ ఇది!
Advertisement

Kissik Talks: చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరినైనా సరే ఫిజికల్‌గా ఇబ్బంది పెట్టేవారికి వెంటనే శిక్షపడాలని, అసలు బెయిల్ అనేది ఇవ్వకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నటి లయ (Actress Laya). తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలపై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో బాగా పెరిగిపోతున్న ఇష్యూస్‌పై ఆమె స్పందిస్తూ.. చుట్టూ బ్యాడ్ పీపుల్ చాలా మంది ఉన్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలని జాగ్రత్తగా పెంచాలని, తన పిల్లల విషయంలో కూడా చాలా కేరింగ్‌గా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..

ఇంటికి వచ్చే వరకు తిడుతూనే ఉండేది

‘‘అలాంటి పనులు చేసే వాళ్లని తిట్టలేను.. తిట్టినా వాళ్లకి అర్థం కాదు. అదే టైమ్‌లో అయ్యో బాధపడకండి అని బాధితులకు చెప్పలేను. అది మనకే అయ్యిందా అనిపించేంత బాధేస్తుంది.. చాలా బాధేస్తుంది. ఇంత ఘోరంగా చంపుకోవడాలు అవసరం లేదు. ఎవరినైనా హేట్ చేస్తే.. నువ్వు వెళ్లిపో అక్కడి నుంచి. నిన్ను ఎవరు బంధించలేదు కదా. నా చిన్నప్పుడు మా అమ్మ పేపర్లో ఇలాంటి వార్తలు చూసి భయపడిపోయేది. నేను స్కూల్ నుంచి రావడం 5 నిమిషాలు ఆలస్యమైనా, పరుగెత్తుకుంటూ వచ్చేది. ఎందుకు ఆలస్యమైందని కూడా అడిగేది కాదు.. అక్కడ మొదలు పెట్టి, ఇంటికి వచ్చే వరకు తిడుతూనే ఉండేది. కారణం ఏంటంటే.. తను పేపర్‌లో చూసిన న్యూసే. అందుకే ఇలాంటివి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తాయి.

Advertisement

Also Read- Vijay Deverakonda : కొండన్నకు కార్లంటే ఎంత ప్రేమో.. ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయంటే..?

తట్టుకోలేని ఇష్యూ ఇది.

ఇలాంటివి జరగకుండా ఉండాలంటే లా కఠినంగా ఉండాలి. లా ఫాస్ట్‌గా ప్రాసెస్ అవ్వాలి. నా బాధే అది. ఇప్పుడున్న లా నే ఫాలో అవుతూ ప్రాసెస్ ఫాస్ట్‌గా ఉండాలి. వాళ్లకి బెయిల్ అంత ఈజీగా రాకూడదు. వెంటనే జస్టిస్ రావాలి. ఒక 10, 15 సంవత్సరాల తర్వాత జస్టిస్ అంటే చాలా టైమ్ వేస్ట్ అయినట్టే. జస్టిస్ వచ్చినా, అప్పటికే వాళ్లు సగం జీవితం బతికేశారు. మన పిల్లలనే కాదు, ఎవరి పిల్లలైనా అసలు మనం తట్టుకోలేని ఇష్యూ ఇది. ఇప్పుడు ఎక్కడైనా సరే బ్యాడ్ పీపుల్ ఉన్నారు. అమ్మాయి పేరేంట్స్ అయినా, అబ్బాయి పేరేంట్స్ అయినా సరే.. నేను చెప్పేది ఏంటంటే.. చుట్టు పక్కల బ్యాడ్ పీపుల్ ఉన్నారు. అది ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు, పక్కన ఉండే ఆంటీ, అంకుల్ కావచ్చు.. స్కూల్‌లో టీచర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు.. ఎవరైనా సరే.. చుట్టూ బ్యాడ్ పీపుల్ ఉన్నారు.

Advertisement

Also Read- Laya Kissik Talks: బ్లైండ్ పాత్ర చేస్తే.. ఫస్ట్ వీక్ కోటి లాస్ అన్నారు.. థర్డ్ వీక్ కోటి లాభం అన్నారు

నచ్చినా, నచ్చకపోయినా చెప్పాల్సిందే

అందుకే పిల్లలకి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి.. ఎప్పుడూ ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే. అది వాళ్లకి నచ్చినా, నచ్చకపోయినా చెప్పాల్సిందే. మా పిల్లలకు కూడా చెప్తాను. వాళ్లు బయటకు వెళ్తుంటే లొకేషన్ పెట్టమని అడుగుతాను.. ఎక్కడికి, ఎవరితో వెళ్లారు అని తెలుసుకుంటాను. ఆ రూల్స్ అన్ని ఫాలో అవుతాను అంటేనే వెళ్లమంటాను. ఇది మీ సేఫ్టీ కోసమే.. మీ మీద నమ్మకం లేదని కాదు. మీ సేఫ్టీని చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ అని చెబుతాను.

Also Read- Raashii Khanna : ట్రెడిషినల్ లుక్ లో రాశి ఏముంది మావా.. రెండు కళ్లు చాలట్లేదు…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×