E-Paper
Advertisement

YSRCP vs TDP: టీడీపీని ఇరికించిన ఎంపీ.. వైసీపీ చేతికి మరో అస్త్రం.. ఔరా హతవిధి!

YSRCP vs TDP: టీడీపీని ఇరికించిన ఎంపీ.. వైసీపీ చేతికి మరో అస్త్రం.. ఔరా హతవిధి!
Advertisement

YSRCP vs TDP: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ పార్టీ కలకలం.. ఏపీలో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. నగర శివారులోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ బయటపడ్డాయి. అయితే ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో ఇది ఒక్కసారిగా విపక్ష వైసీపీకి ఆయుధంగా మారింది. ఇప్పటికే తిరుమల లడ్డులో జంతుకొవ్వు అంశం, పరకామణి బంగారం చోరీ, బీ.ఆర్.నాయుడు వీడియోలతో టీడీపీని ఇరాకటంలో పడేస్తున్న వైసీపీకి మరో సరికొత్త అస్త్రంగా ఈ డ్రగ్స్ కేసు దొరికినట్లైంది.

టీడీపీకి ఆపాదిస్తున్న వైసీపీ!

ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. ఈ అంశాన్ని తన రాజకీయ ఆయుధంగా వైసీపీ మార్చుకుంటోంది. డ్రగ్స్ ఘటన బయటపడినప్పటి నుంచి ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లతో సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ లపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. టీడీపీ ఎంపీ చేసిన పనిని.. కూటమి ప్రభుత్వానికి, టీడీపీ పార్టీకి ఆపాదించే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

యువత భవిష్యత్తు నాశనం చేస్తారా?

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తో పుట్టా మహేష్ కుమార్ దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఎక్స్ వేదికగా వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో యువత భవిష్యత్తును టీడీపీ డ్రగ్స్ మాఫియా నాశనం చేస్తోందంటూ విరుచుకుపడింది. టీడీపీ కూటమి.. డ్రగ్స్ సంస్కృతిని తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా విస్తరిస్తుందో ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైందని పేర్కొంది. మీ పార్టీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారని.. దీనికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనితను ట్యాగ్ చేస్తూ వైసీపీ నిలదీసింది.

Advertisement

ఇరకాటంలో టీడీపీ!

తమ పార్టీ ఎంపీ రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ కేసులో దొరికిపోవడంతో.. అధికార టీడీపీ ఇరాకటంలో పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ చేస్తున్న దాడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాని స్థితిలోకి వెళ్లిపోయిందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వైసీపీ విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలి? ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాం ఏంటి? అనే దానిపై టీడీపీ నేతలు, అధికార ప్రతినిధులు సన్నద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. మెుత్తంగా తెలంగాణలో బయటపడ్డ డ్రగ్స్ కేసు.. ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించిందని చెప్పవచ్చు.

Also Read: Viral Video: స్కూల్ ఈవెంట్‌లో.. విద్యార్థినుల అర్ధనగ్న స్టెప్పులు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

ఎంపీ ఎలా పట్టుబడ్డారంటే?

మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో శనివారం అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడులు చేశారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ పార్టీపై పక్కా సమాచారంతో ఈగిల్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించిన ఈగిల్ టీమ్ సభ్యులను అక్కడ ఉన్న వ్యక్తులు అడ్డుకోవడంపై రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి పరిస్థితులను అదుపు చేశారు. అనంతరం నిర్వహించిన సోదాల్లో కొకైన్ బయటపడింది. మెుత్తం 11 మందిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ పేర్కొన్నారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యిందని స్పష్టం చేశారు.

Also Read: BRS Party: అరెరే పెద్ద సమస్యే వచ్చిందే.. పాపం బీఆర్ఎస్.. నైరాశ్యంలో కేడర్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×