E-Paper
Advertisement

Kissik Talks: చిరంజీవిని అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చా.. కానీ అంత ఈజీ కాదు – యాంకర్ రవి

Kissik Talks: చిరంజీవిని అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చా.. కానీ అంత ఈజీ కాదు – యాంకర్ రవి
Advertisement

Kissik Talks: రవి, మౌనిక కలిసి నటించిన ‘అలలే ఎగసి’ అనే సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళుతోంది. సాంగ్ ఇంత గొప్పగా ఆదరణ పొందుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ టీమ్ బిగ్ టీవీ ‘కిస్సిక్ టాక్స్ విత్ వర్ష’ పాడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సాంగ్ చిత్రీకరణకు సంబంధించిన విషయాలతో పాటు, సాంగ్ లాంచ్ చేసిన విజయ్ దేవరకొండకు వారంతా ధన్యవాదాలు తెలిపారు. ఇక యాంకర్ రవి, త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలిపారు. ఆ ప్రాజెక్ట్ వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. ఈ సాంగ్ గురించే కాకుండా, యాంకర్ రవి తన లైఫ్‌లో జరిగిన ఎన్నో విషయాలను ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే..

చిరంజీవిని అవ్వాలని వచ్చా..

నేను చిరంజీవిని అవ్వాలని ఇంటి నుంచి బయలుదేరా. ఈ ప్రాసెస్‌లో తెలుసుకున్నది ఏమిటంటే.. అది అంత ఈజీ కాదని. చిరంజీవి ఈజ్.. మచ్ మోర్ దెన్ వాట్ చిరంజీవి ఈజ్’. ఎన్నో ఒడిదుడుకులు వస్తాయ్. వాటన్నింటిని జయించి ఎంత ముందుకు వెళ్లినా.. గుర్తుంచుకోవాల్సింది మాత్రం నీ హార్ట్‌లో ఉన్న మంచితనం. అది నెగిటివ్ అయినా, పాజిటివ్ అయినా సరే.. ముందుకు నడిపించేదే అది.

Advertisement

Also Read- Anchor Ravi: ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా విజయ్ దేవరకొండకు ఫరక్ పడదు

మనుషులు అంటేనే వెన్నుపోటు

నేను పెట్ డాగ్స్‌తో కంటే హ్యుమన్స్‌తో ఎక్కువగా ఉండటానికే ఇష్టపడతాను. నా భార్య, పిల్లలతో ఉంటే నాకు ప్రశాంతత వస్తుంది. మనుషులలో కొంతమంది వెన్నుపోటు పొడిచేవారు కూడా ఉంటారు. అసలు మనుషులు అంటేనే వెన్నుపోటు. ఈ సొసైటీలో ఎవడు ఎట్లాంటివాడో ఎవరికీ తెలియదు. ఇందులో బాధపడటం ఎందుకు? సిద్ధంగా ఉండటమే. స్టార్టింగ్‌లో నేను కూడా బాధపడ్డాను. కానీ అనుభవమయ్యాక పీపుల్ ఇలా కూడా ఉంటారనేది తెలుసుకున్నాను. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే.. దానికి నెగిటివ్ కామెంట్స్ వస్తాయ్, పాజిటివ్ కామెంట్స్ వస్తాయ్. ఇష్టం ఉంటే చూస్తాం.. లేదంటే బ్లాక్ చేస్తాం. లైఫ్ కూడా అంతే.

Advertisement

Also Read- Kissik Talks with Varsha: యాంకర్ రవి అంత యంగ్‌గా ఉండటానికి కారణం ఇదేనట!

నేను బ్యాడ్‌ని యాక్సెప్ట్ చేశా

సోషల్ మీడియా వచ్చిన కొత్తలో మేమంతా వన్ సైడే చూసేవాళ్లం. జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.. మన గురించి బాగా మాట్లాడుకుంటున్నారని అనుకునేవాళ్లం. కానీ, తర్వాత మరో సైడ్ కూడా మాకు తెలిసింది. పీపుల్ ఇలా కూడా ఉంటారా? ఇలా ఆలోచిస్తారా? అనుకునే వాళ్లం. ఈ సొసైటీలో చదువుకున్న వాళ్లు ఎంతమంది ఉన్నారో, చదువురాని వాళ్లు కూడా అంతే ఉన్నారు. కొన్నిసార్లు చదువులేని వాళ్ల కామెంట్స్‌కి చదువుకున్న వాళ్లు కూడా అట్రాక్ట్ అవుతారు. అంటే నెగిటివిటీకి ఆకర్షితులవుతారు. గుడ్ యాక్సెప్ట్ చేసినట్టే.. బ్యాడ్‌ని కూడా యాక్సెప్ట్ చేయాలి. నేను బ్యాడ్‌ని యాక్సెప్ట్ చేశాను. నెగిటివ్‌‌తో ఎంత బాధపడ్డానో నాకు తెలుసు.. అలాగే సోషల్ మీడియా నాకు ఎంత పాజిటివ్ అయిందో కూడా తెలుసు. ఎన్నో జరుగుతుంటాయి. అవేం పట్టించుకోకూడదు. మనపై డబ్బులు పెట్టేటోడు హ్యాపీగా ఉండాలి. అదొక్కటి మాత్రం నేను చూసుకుంటాను.

Also Read- Emmanuel: బిగ్ బాస్ డబ్బులతో వారికి సర్ ప్రైజ్ ఇచ్చిన ఇమ్మానుయేల్.. ఏం చేశాడంటే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×