E-Paper
Advertisement

Anchor Ravi: మేము అటు స్టార్స్ కాదు.. ఇటు నార్మల్ పబ్లిక్ కాదు. మధ్యలో ఉన్నాం

Anchor Ravi: మేము అటు స్టార్స్ కాదు.. ఇటు నార్మల్ పబ్లిక్ కాదు. మధ్యలో ఉన్నాం
Advertisement

Anchor Ravi: నేను పోయి 10 మందిని కొడితే.. ప్రేక్షకులు తీసుకోలేరు. మేము అటు స్టార్స్ కాదు.. ఇటు నార్మల్ పబ్లిక్ కాదు. మధ్యలో ఉన్నామని అన్నారు బుల్లితెర స్టార్ యాంకర్ రవి. తాజాగా ఆయన బిగ్ టీవీ షో కిస్సిక్ టాక్స్ విత్ వర్ష‌లో పాల్గొని, సినిమా ఇండస్ట్రీలో టీవీ ఆర్టిస్ట్‌ల పరిస్థితి ఎలా ఉందో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

మధ్యలో ఉన్నాం

‘‘ప్రస్తుతం సినిమా ఒక మ్యాసివ్‌గా మారిపోయింది. అందులో తెలుగు సినిమా గ్లోబల్ స్టేజ్‌లో ఉంది. సినిమా అంటే విఎఫ్‌ఎక్స్, సినిమా అంటే గ్రాఫిక్స్, గ్రీన్ మ్యాట్, రాజమౌళి, సుకుమార్ అని మెంటల్‌గా ఆడియెన్స్ ఫిక్స్ అయిపోయారు. నాలాంటి వాళ్లు సినిమాలు ‘పుష్ప’ బడ్జెట్‌కు వన్ పర్సంట్ కూడా ఉండదు. ‘ఆర్ఆర్ఆర్’కు 0.5 పర్సంట్ కూడా ఉండదు నేను చేస్తున్న సినిమా బడ్జెట్. వాళ్ల సినిమాలకు ఉన్న ఫ్రీడమ్ మాకు ఉండదు. ఒకవేళ మేము చేసినా జనాలు ఎక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేను పోయి 10 మందిని కొడితే.. జనాలు తీసుకోలేరు. మేము అటు స్టార్స్ కాదు.. ఇటు నార్మల్ పబ్లిక్ కాదు. మధ్యలో ఉన్నాం.. కాబట్టి ఆడియెన్స్ పట్టుకుని లాగడానికి చాలా ఈజీ.

Advertisement

Also Read- Kissik Talks: చిరంజీవిని అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చా.. కానీ అంత ఈజీ కాదు – యాంకర్ రవి

డబ్బులెందుకు ఖర్చు పెడతారు

మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టరు.. రీల్స్ చేయరు. ఆడియెన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం మనం రీల్స్ గట్రా చేయాలి. వాళ్లు ఆరు నెలలకు ఒకసారి కనబడినా చాలు.. కానీ, మనం రోజు కనిపించాలి. రోజూ కనిపించే వారిపై ప్రేక్షకులు డబ్బులెందుకు ఖర్చు పెడతారు. ఈ లాజిక్‌ని బ్రేక్ చేసుకుని వెళ్లిన వారు కూడా ఉన్నారు. కోలీవుడ్‌లో శివకార్తికేయన్ టీవీ వదిలేసి, లుక్ మార్చుకుని హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అతనే నాకు స్ఫూర్తి. ఆయన పాత్‌లోనే నేను నడవాలని అనుకుంటున్నా. ప్రస్తుతం నేను అదే ప్రాసెస్‌లో ఉన్నాను. కొంచెం కష్టంగా ఉన్నా తప్పడం లేదు.

Advertisement

Also Read- Kissik Talks with Varsha: యాంకర్ రవి అంత యంగ్‌గా ఉండటానికి కారణం ఇదేనట!

సైజ్ పెరుగుతుంది అంతే

బుల్లితెరపై ఎన్నో నేర్చుకుని, సక్సెస్ సాధించాను.. ఇప్పుడు వెండితెరపై కనిపించాలి. 15 సంవత్సరాలు టీవీలో ప్రతి ఒక్క ఛానల్లో అన్ని షోస్ చేసుకుంటూ వచ్చాను. వాట్ నెక్ట్స్.. ఎంత వరకు టీవీలోనే చేస్తాం. ఇదే సరైన సమయం వెండితెరపై కూడా మనం నిరూపించుకోవడానికి అని భావిస్తున్నాను. మంచి కథలతో ప్రేక్షకులను అలరించాలి. సేమ్ స్క్రీన్.. కాకపోతే సైజ్ పెరుగుతుంది అంతే. ఈ ప్రాసెస్‌లో నేను పడినా, నన్ను లేపడానికి నా ఫ్యామిలీ నాకు తోడుగా ఉంటుంది’’ అని యాంకర్ రవి తన మనసులోని మాటను బయటపెట్టారు.

Also Read- Anchor Ravi: ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా విజయ్ దేవరకొండకు ఫరక్ పడదు

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×